Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

జెన్‌ జెడ్‌ ఇన్వెస్టర్లకు బీమా.. డైలమా

Business Sakshi User Sakshi Sakshi Time Dec 1, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
insurance.jpg

పూర్తిగా డిజిటల్‌ శకంలో పెరుగుతున్న జెన్‌ జెడ్‌ తొలి తరం ఇన్వెస్టర్లు.. డబ్బు, లైఫ్‌స్టయిల్, విశ్వసనీయతకు సంబంధించిన అభిప్రాయాలను తిరగరాస్తున్నారు. వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉంటున్నారు. ఎంచుకునే ప్రతి దాన్నుంచి గరిష్ట విలువను పొందడంపై దృష్టి పెడుతున్నారు. తాము ఉపయోగించే ప్రతి ప్రొడక్టు, సర్వీసు సరళంగా, వేగవంతంగా ఉండాలని కోరుకుంటున్నారు. దీనితో వారికి అనుగుణమైన ప్రోడక్టులను అందించే విషయంలో ఈ పరిణామం, బీమా సంస్థలకు ఒక పెద్ద డైలమాగా మారింది. వారి వాస్తవ అవసరాలు, అందుబాటులో ఉన్న సాధనాల మధ్య అంతరాలను భర్తీ చేసేలా కొత్త సొల్యూషన్స్‌ని కనుగొనాల్సిన పరిస్థితి నెలకొంది.

జెన్‌ జెడ్‌ తరం వారు ఆర్థిక ప్రణాళికలపై ఆసక్తిగానే ఉన్నప్పటికీ బీమాను ఇంకా పూర్తి స్థాయిలో పరిశీలించడం లేదు. ఇటీవలి హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో నివేదిక ప్రకారం 61 శాతం యువత హెల్త్‌ ఇన్సూరెన్స్‌పై ఆసక్తి చూపగా, 37 శాతం మంది క్యాష్‌లెస్‌ హాస్పిటల్‌ నెట్‌వర్క్‌ లభ్యతకు ప్రాధాన్యమిచ్చారు. బీమాకు ప్రాధాన్యమిస్తున్నప్పటికీ కేవలం సంప్రదాయ ఫీచర్లకే పరిమితం కాకుండా సౌకర్యం, తమకు ఎంత వరకు ఉపయోగకరంగా ఉంటుందనే కోణాల్లో కూడా ఇన్సూరెన్స్‌ని చూస్తున్నారని దీని ద్వారా తెలుస్తోంది.

జెన్‌ జెడ్‌ తరం టెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ లాంటి అంశాలపై గణనీయంగా ఖర్చు చేస్తోంది. తమ లైఫ్‌స్టయిల్‌కి అనుగుణంగా, పారదర్శకమైన, సరళమైన ట్రావెల్, హెల్త్‌ పాలసీలను, గ్యాడ్జెట్స్‌ను కొనుగోలు చేసేందుకు వారు సిద్ధంగా ఉంటున్నారు. దానికి తగ్గట్లుగా వారికి అర్థమయ్యే రీతిలో బీమాను వివరించి, తగు పాలసీలను అందచేయగలిగితే ఇన్సూరెన్స్‌ ప్రయోజనాలను జెన్‌ జడ్‌ తరంవారికి మరింతగా చేరువ చేసేందుకు వీలవుతుంది.

ఏం కోరుకుంటున్నారు..

సరళత్వం: అర్థం కాని సంక్లిష్టమైన పదాలు, సుదీర్ఘంగా ఉండే పాలసీ డాక్యుమెంట్లను వారు ఇష్టపడటం లేదు. సాదా సీదాగా అర్థమయ్యే భాషను, డిజిటల్‌ సాధనాలను, స్పష్టతను కోరుకుంటున్నారు.

పర్సనలైజేషన్‌: వారు సంప్రదాయ పద్ధతుల్లో గిరిగీసుకుని ఉండటం లేదు. ఫ్రీల్యాన్స్‌ కెరియర్లు మొదలుకుని ఇతరత్రా పార్ట్‌టైమ్‌ పనులు కూడా చేస్తున్నారు. కాబట్టి పే–యాజ్‌–యు–డ్రైవ్‌ కార్‌ ఇన్సూ రెన్స్, అవసరాలకు తగ్గట్లు యాడ్‌–ఆన్‌లను చేర్చేందుకు వీలుండే హెల్త్‌ పాలసీలు, స్వల్పకాలిక కవరేజీల్లాంటి ప్రోడక్టులను వారు ఇష్టపడుతున్నారు.

డిజిటల్‌ ఫస్ట్‌: ఫోన్‌తో చెల్లింపులు జరిపినట్లు లేదా ఫుడ్‌ డెలివరీ యాప్‌ ద్వారా ఆర్డరు పెట్టినట్లు పాలసీ కొనుగోలు అనుభూతి కూడా సులభతరమైన విధంగా, వేగవంతంగా, మొబైల్‌ – ఫస్ట్‌ తరహాలో ఉండాలనుకుంటున్నారు.

పారదర్శకత: నైతిక విలువలు, పారదర్శక విధానాలను పాటించే బ్రాండ్స్‌ వైపు జెన్‌ జెడ్‌ తరం మొగ్గు చూపుతున్నారు. సమాజం, పర్యావరణంపట్ల బాధ్యతాయుతంగా ఉండే సొల్యూషన్స్‌.. వారి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో జెన్‌ జడ్‌ తరం అవసరాలకి తగ్గ పాలసీలను అందించే దిశగా పరిశ్రమలో ఇప్పటికే మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టెలీమ్యాటిక్స్‌ ఆధారిత వాహన బీమా యువ డ్రైవర్లకు దన్నుగా ఉంటోంది. వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఆరోగ్య బీమా సంస్థలు తమ పాలసీల్లో వెల్‌నెస్‌ ప్రోగ్రాంలు, నగదురహిత డిజిటల్‌ సర్వీసులు మొదలైనవి అందిస్తున్నాయి. ప్రయాణాలు కావచ్చు ఇతరత్రా కొనుగోళ్లు కావచ్చు అన్నింటి అంతర్గతంగా బీమా ప్రయోజనాన్ని అందించే విధానం క్రమంగా ఊపందుకుంటోంది.

జెన్‌ జడ్‌ తరం వారు బీమాను భారంగా కాకుండా సాధికారతగా చూస్తున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా కలలను సాకారం చేసుకునేందుకు తోడ్పడే భద్రత సాధనాలను వారు కోరుకుంటున్నారు. వృద్ధిలోకి వచ్చేందుకు ఇన్వెస్ట్‌ చేయదల్చుకుంటున్నారు. కాబట్టి బీమా అనేది డిజిటల్‌–ఫస్ట్‌గా, సరళంగా, పారదర్శకంగా ఉంటే కేవలం బ్యాకప్‌ వ్యూహంగా మాత్రమే కాకుండా వారు కోరుకునే జీవితాన్ని గడిపేందుకు సహాయపడే సాధనంగా ఉంటుంది.

వారి ఆకాంక్షలకు తగ్గట్లు పరిశ్రమ కూడా తనను తాను మల్చుకోగలిగితే జెన్‌ జడ్‌ తరానికి చేరువ కావడంతో పాటు బీమా రంగ భవిష్యత్తును సరికొత్తగా తీర్చిదిద్దుకోవడానికి ఆస్కారం ఉంటుంది. జెన్‌ జడ్‌ తరం అంటే ఏదో అల్లాటప్పా కస్టమర్‌ సెగ్మెంట్‌ కాదు, బీమా రంగం భవిష్యత్తుకు దిక్సూచిలాంటిది. కొత ఆవిష్కరణలను కనుగొనడం, పాలసీలను మరింత సరళం చేయడం, చక్కగా అర్థమయ్యేలా వివరించడంలాంటి అంశాల్లో పరిశ్రమ పురోగమనాన్ని ఇది మరింత వేగవంతం చేయనుంది.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Generation-Z
Investors
insurance
Youth Finance
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

దూసుకెళ్లిన రిలయన్స్ పవర్ స్టాక్ ఇన్వెస్టర్లకు లాభాల పంట

దూసుకెళ్లిన రిలయన్స్ పవర్ స్టాక్ ఇన్వెస్టర్లకు లాభాల పంట

ఆ షేర్ల ట్రేడింగ్‌లో జాగ్రత్త: సెబీ హెచ్చరిక

ఆ షేర్ల ట్రేడింగ్‌లో జాగ్రత్త: సెబీ హెచ్చరిక

గృహలక్ష్మి ఇప్పుడు... ఇన్వెస్ట్‌మెంట్‌ మహాలక్ష్మి

గృహలక్ష్మి ఇప్పుడు... ఇన్వెస్ట్‌మెంట్‌ మహాలక్ష్మి

వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని..

వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని..

రూ.10,000 కోట్లకు 5 ఐపీఓలు రెడీ!

రూ.10,000 కోట్లకు 5 ఐపీఓలు రెడీ!

కాలం కరిగేలోపే.. కలల నిధిని గెలిచేద్దాం!

కాలం కరిగేలోపే.. కలల నిధిని గెలిచేద్దాం!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.