Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

కొందరి చేతుల్లోనే పోగవుతున్న ధనలక్ష్మీ

Business Sakshi User Sakshi Sakshi Time Dec 19, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
richh.jpg

ఒకవైపు ఆకాశాన్ని తాకే ఆడంబరపు అద్దాల భవనాలు.. మరోవైపు ఆ భవనాల నీడలోనే మగ్గిపోతున్న రేకుల షెడ్లు. ఒకరికి వేల కోట్ల సంపద ఎలా ఖర్చు చేయాలో తెలియని సందిగ్ధం.. మరొకరికి పూట గడవడానికి కావాల్సిన సరుకులు లేక విచారం. అంకెల్లో చూస్తే అభివృద్ధిలో ప్రపంచంలోనే దేశం పరుగులు పెడుతోంది కానీ, ఆ పరుగులో సామాన్యుడు మాత్రం వెనకబడిపోతున్నాడు. వరల్డ్ ఇనీక్వాలిటీ రిపోర్ట్ బయటపెట్టిన తాజా వాస్తవాలు భారత్‌లో పెరుగుతున్న ఈ అగాధాన్ని కళ్లకు కడుతున్నాయి. ఇదే ఆర్థిక అసమానతలు కొనసాగితే సామాజిక అశాంతి పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భారత ఆర్థిక వ్యవస్థ ఒక భారీ వృక్షంలా ఎదుగుతోంది. కానీ దాని ఫలాలు మాత్రం కొద్దిమందికే అందుతున్నాయి. దేశంలోని 1 శాతం మంది చేతుల్లోనే 40 శాతం సంపద పోగుపడటం అనేది కేవలం ఆర్థిక లెక్క మాత్రమే కాదు, అది కోట్ల మంది భారతీయుల నిస్సహాయతకు సాక్ష్యం. అభివృద్ధి అంటే కేవలం జీడీపీ పెరగడమేనా? లేక ఆ పెరిగిన సంపద పేదవాడి ఆకలిని తీర్చడమా? ఈ తరుణంలో పెరుగుతున్న అసమానతలపై విశ్లేషణ చూద్దాం.

భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతోంది. జీడీపీ పరంగా మనం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగాం. అయితే, ఈ గణాంకాల వెనుక ఒక చేదు నిజం దాగి ఉంది. దేశ సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం కావడం.. పేద, మధ్యతరగతి ప్రజల ఆదాయాలు స్తంభించిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

గణాంకాలు ఏం చెబుతున్నాయి?

వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థలో అంతరాలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. దేశంలోని కేవలం 1 శాతం అత్యంత ధనవంతుల వద్దే 40 శాతం జాతీయ సంపద ఉంది. సంపదపరంగా టాప్‌లో ఉన్న 10 శాతం మంది జాతీయ ఆదాయంలో 58 శాతాన్ని పొందుతుండగా, దిగువన ఉన్న 50 శాతం మందికి కేవలం 15 శాతం ఆదాయం మాత్రమే దక్కుతోంది. ప్రస్తుత ఆదాయ అసమానతలు బ్రిటిష్ పాలన కాలం నాటి కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం.

ఆర్థిక అసమానతల వల్ల తలెత్తే పరిణామాలు

ఆదాయంలో భారీ వ్యత్యాసాలు ఉన్నప్పుడు సమాజంలో అసంతృప్తి పెరుగుతుంది. ఇది నేరాలు పెరగడానికి, వర్గ పోరాటాలకు, పౌర అశాంతికి దారితీస్తుంది. మెజారిటీ ప్రజల వద్ద ఆదాయం లేకపోతే వారు నాణ్యమైన విద్య, వైద్యానికి దూరమవుతారు. ఇది దేశ భవిష్యత్తు శ్రామిక శక్తి నాణ్యతను తగ్గిస్తుంది. ఆర్థిక వ్యవస్థ నడవాలంటే సామాన్యుల దగ్గర కొనుగోలు శక్తి ఉండాలి. కేవలం కొద్దిమంది ధనవంతుల ఖర్చుతో దేశ ఆర్థిక చక్రం పూర్తిస్థాయిలో తిరగలేదు. పేదరికం వల్ల మార్కెట్‌లో వస్తువులకు డిమాండ్ తగ్గి, ఉత్పత్తి రంగం దెబ్బతింటుంది. సంపద కేంద్రీకరణ వల్ల రాజకీయ అధికారం కూడా కొద్దిమంది ధనవంతుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇది సామాన్యుల గొంతుకను నొక్కివేస్తుంది.

నియంత్రించేందుకు మార్గాలు

  • అత్యంత ధనవంతులపై సంపద పన్ను(Wealth Tax) లేదా వారసత్వ పన్ను (Inheritance Tax) వంటివి విధించడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రజా సంక్షేమ పథకాలకు మళ్లించాలి.

  • ప్రభుత్వ విద్య, వైద్య వ్యవస్థలను బలోపేతం చేయడం వల్ల పేద కుటుంబాల ఆర్థిక భారం తగ్గుతుంది. ఇది వారిని పేదరికం నుంచి బయటపడేలా చేస్తుంది.

  • కేవలం కార్పొరేట్ కంపెనీలకే కాకుండా భారీగా ఉపాధి కల్పించే చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహకాలు అందించాలి.

  • అసంఘటిత రంగంలోని కార్మికులకు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా కనీస వేతనాలు అందేలా కఠినమైన చట్టాలు అమలు చేయాలి.

  • ఇప్పటికీ దేశంలో సగం జనాభా ఆధారపడుతున్న వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం ద్వారా గ్రామీణ ఆదాయాలను పెంచవచ్చు.

చివరగా..

ఆర్థిక వృద్ధి అనేది కేవలం అంకెల్లో కాకుండా సమాజంలోని చివరి వ్యక్తికి కూడా ఫలాలను అందించినప్పుడే అది సమ్మిళిత వృద్ధి సాధ్యం అవుతుంది. భారతదేశం వికసిత్ భారత్‌గా మారాలంటే సంపద సృష్టించడమే కాదు, ఆ సంపద సమంగా పంపిణీ అయ్యేలా చూడటం అత్యవసరం. లేనిపక్షంలో ఈ ఆర్థిక అసమానతలు దేశ సుస్థిరతకు ముప్పుగా మారతాయని గమనించాలి.

ఇదీ చదవండి: ఏఐ నియంత్రణపై భారత్ అడుగులు ఎటువైపు?

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Income
inequality
rich
poor
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

అపుడు నెలకు రూ. 25 వేలు, క్యాబ్‌ డ్రైవర్‌గా ఇపుడు లక్ష

అపుడు నెలకు రూ. 25 వేలు, క్యాబ్‌ డ్రైవర్‌గా ఇపుడు లక్ష

ఒక్క రీల్‌కు రూ. 76 లక్షలు, లంచ్‌కి  రూ. 20 లక్షలు : ఎలా?

ఒక్క రీల్‌కు రూ. 76 లక్షలు, లంచ్‌కి రూ. 20 లక్షలు : ఎలా?

Income Tax: ‘ఇన్‌కం స్టేట్‌మెంట్‌’ ఇలా తయారు చేయండి..

Income Tax: ‘ఇన్‌కం స్టేట్‌మెంట్‌’ ఇలా తయారు చేయండి..

డబ్బు కావాలా? వీటిలో మాస్టర్స్ అవ్వాల్సిందే!

డబ్బు కావాలా? వీటిలో మాస్టర్స్ అవ్వాల్సిందే!

భార్య ప్రెగ్నెన్సీ బ్రేక్: వైరల్ అవుతున్న ఏఐ ప్లాన్!

భార్య ప్రెగ్నెన్సీ బ్రేక్: వైరల్ అవుతున్న ఏఐ ప్లాన్!

ఆదాయాల అంతరం.. ఆప్యాయతలు దూరం!

ఆదాయాల అంతరం.. ఆప్యాయతలు దూరం!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.