Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

ఆర్థిక లక్ష్యాన్ని చేరేదెలా..?

Business Sakshi User Sakshi Sakshi Time Dec 2, 2024 Sakshi Read Time Read Time: 7 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
BU-MONEY-CHARGING--91324449.jpg

స్థిరమైన ఆదాయానికి ఎన్నో మార్గాలు 

పోస్టాఫీస్‌ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ 

సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ 

మ్యూచువల్‌ ఫండ్స్‌ మంత్లీ ఇన్‌కమ్‌ ప్లాన్లు 

బీమా సంస్థల యాన్యుటీ ప్లాన్లు 

సిస్టమ్యాటిక్‌ విత్‌డ్రాయల్‌ కూడా ఒక సాధనమే 

రిస్క్, రాబడుల ఆధారంగా తుది ఎంపిక

స్థిరమైన ఆదాయం చాలా మందికి ఒక ముఖ్యమైన ఆర్థిక లక్ష్యం. రిటైర్మెంట్‌ ప్రణాళిక కావొచ్చు. లేదా ప్యాసివ్‌ ఆదాయ మార్గం కోరుకోవచ్చు. అప్పటికే వస్తున్న ఆదాయాన్ని మరింత పెంచుకోవాలని అనుకోవచ్చు. క్రమం తప్పకుండా ఆదాయం వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలో కీలక పాత్ర పోషిస్తుంది. జీవితానికీ స్థిరత్వాన్నిస్తుంది. ముందస్తు పింఛను ప్రణాళికలు లేని వారు రిటైర్మెంట్‌ తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం వచ్చే మార్గాలను ఆశ్రయించాల్సిందే. 

ఉద్యోగం/వృత్తి/ వ్యాపారాల్లో ఉన్న వారు సైతం తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఆసక్తి చూపించొచ్చు. కొన్ని రకాల వృత్తుల్లో, వ్యాపారాల్లో ఉన్న వారికి ప్రతి నెలా స్థిరమైన ఆదాయం ఉండదు. ఈ తరహా వ్యక్తుల ముందు ఎన్నో పెట్టుబడి సాధనాలు అందుబాటులో ఉన్నాయి. రిస్క్, రాబడుల ఆధారంగా తమకు అనువైనవి ఎంపిక చేసుకోవడం ద్వారా తమ ఆర్థిక లక్ష్యాలను సులభంగా సాకారం చేసుకోవచ్చు.  

పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకం (ఎంఐఎస్‌) 
నెలవారీ ఆదాయం కోసం అందుబాటులోని డెట్‌ సాధనాల్లో ఇది కూడా ఒకటి. ఇందులో పెట్టుబడులకు నూరు శాతం భారత ప్రభుత్వం హామీ ఉంటుంది. కనుక పెట్టుబడులు, రాబడుల విషయంలో ఎలాంటి రిస్క్‌ ఉండదు. రిస్క్‌ వద్దనుకునే వారికి అనువైనది. ప్రస్తుతం ఇందులో పెట్టుబడిపై 7.4 శాతం వార్షిక రాబడి అందుబాటులో ఉంది. ఈ ప్రకారం రూ. లక్ష పెట్టుబడిపై ప్రతి నెలా రూ.616 ఆదాయంగా అందుతుంది. ఇందులో డిపాజిట్‌ కాల వ్యవధి ఐదేళ్లు. గడువు తీరిన తర్వాత మరో ఐదేళ్లకు తిరిగి ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు.

 ఒకరు గరిష్టంగా రూ.9,00,000 వరకు, ఉమ్మడిగా అయితే రూ.15,00,000 ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ఇందులో పెట్టుబడులకు, వడ్డీ రాబడికి ఎలాంటి పన్ను ప్రయోజనం లేదు. రాబడి పన్ను పరిధిలోకి వస్తుంది. తమ వార్షిక ఆదాయంలో చూపించి పన్ను చెల్లించాల్సిందే. 10 ఏళ్లు నిండిన మైనర్‌ పేరిట కూడా ఖాతా ప్రారంభించొచ్చు. నెలవారీ వడ్డీని పోస్టల్‌ సేవింగ్స్‌ ఖాతాలో జమ చేస్తారు. గడువు కంటే ముందే ఈ పథకం నుంచి వైదొలిగేట్టు అయితే కొంత నష్టపోవాల్సి వస్తుంది. డిపాజిట్‌ చేసిన ఏడాది నుంచి మూడేళ్లలోపు అయితే పెట్టుబడిలో 2 శాతం, మూడేళ్ల తర్వాత ఒక శాతాన్ని కోత విధిస్తారు.  

దీర్ఘకాల ప్రభుత్వ బాండ్లు (జీ–సెక్‌లు)
5–40 ఏళ్ల కాలంతో ఇవి ఉంటాయి. వీటిపై ఆరు నెలలకు ఒకసారి వడ్డీ ఆదాయం పొందొచ్చు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు  తమ వ్యయాల కోసం ఈ బాండ్ల ద్వారా నిధులు సమీకరిస్తాయి. వీటిల్లో రిస్క్‌ లేదనే చెప్పుకోవచ్చు. ఇన్వెస్టర్లు ఆర్‌బీఐ వద్ద రిటైల్‌ డైరెక్ట్‌ ఖాతాను ఉచితంగా తెరిచి, జీసెక్‌లలో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ఈ ఖాతా ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీలను ప్రైమరీ, సెకండరీ మార్కెట్లో ఎలాంటి చార్జీలు లేకుండా కొనుగోలు చేసుకోవచ్చు. ప్రభుత్వ బాండ్లలో ఫిక్స్‌డ్, ఫ్లోటింగ్, ఇన్‌ఫ్లేషన్‌ ఇండెక్స్‌డ్‌ అని పలు రకాలున్నాయి. 

గడువు ముగిసే వరకు కొనసాగకుండా, మధ్యంతరంగా సెకండరీ మార్కెట్లో విక్రయించాలనుకుంటే అప్పటి వడ్డీ రేట్ల పరంగా చేతికి వచ్చే మొత్తంలో మార్పు ఉండొచ్చు. కేంద్ర ప్రభుత్వం ట్రెజరీ బిల్లులు, డేటెడ్‌ సెక్యూరిటీలు (జీ–సెక్‌లు) జారీ చేస్తుంటుంది. ఇందులో ట్రెజరీ బిల్లులు అన్నవి 91 రోజులు, 182 రోజులు, 364 రోజుల వ్యవధితో వస్తాయి. వీటిల్లో వడ్డీ చెల్లింపులు ఉండవు. కూపన్‌ రేటు మేర ముందే ముఖ విలువలో తగ్గించి తీసుకుంటారు. కనుక ఇన్వెస్టర్లు జీసెక్‌లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు స్టేట్‌ గవర్నమెంట్‌ సెక్యూరిటీలు జారీ చేస్తుంటాయి.

యాన్యుటీ ప్లాన్లు
పెట్టుబడిపై మరుసటి నెల నుంచే ఆదాయాన్నిచ్చే ‘ఇమీడియెట్‌ యాన్యుటీ ప్లాన్‌’లను జీవిత బీమా కంపెనీలు ఆఫర్‌ చేస్తుంటాయి. ఎల్‌ఐసీ నుంచి జీవన్‌ శాంతి, జీవన్‌ అక్షయ్‌ ఇవే తరహా ప్లాన్లు. ఇన్వెస్టర్ల అవసరాలకు అనుగుణంగా ఈ ప్లాన్లలో ఎన్నో ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసుకున్న కాలం వరకు స్థిరమైన రాబడులు ఇందులో వస్తాయి. వడ్డీ రేట్లలో అస్థిరతల ప్రభావం వీటి రాబడిపై ఉండవు. 

నెలవారీ, త్రైమాసికం, ఆరు నెలలు, ఏడాదికోసారి ఆదాయం వచ్చే ఆప్షన్లలో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు. జీవితకాలానికి ఈ యాన్యుటీ ప్లాన్లను తీసుకోవచ్చు. మరణానంతరం పెట్టుబడిని నామీనికి అందిస్తారు. వీటికి పన్ను పరమైన ప్రయోజనాలు లేవు. ఈ ప్లాన్ల నుంచి అందుకునే రాబడిపై 1.8 శాతం జీఎస్‌టీ చెల్లించాలి. ఈ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. డిఫర్డ్‌ యాన్యుటీ ప్లాన్లు అని కూడా ఉంటాయి. అవి ఏక మొత్తంలో ఇన్వెస్ట్‌ చేసిన వెంటనే కాకుండా.. నిరీ్ణత కాలం తర్వాత నుంచి క్రమం తప్పకుండా చెల్లింపులు చేసేవి.

సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఎస్‌సీఎస్‌ఎస్‌)
60 ఏళ్లు నిండిన వారికే ఈ పథకంలో ఇన్వెస్ట్‌ చేసుకోవడానికి అనుమతి ఉంది. పదవీ విరమణ తర్వాత ఆదాయం కోరుకునే వారు ఈ పథకాన్ని పరిశీలించొచ్చు. ఇందులో ఒకరు రూ.30లక్షల వరకు ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. దంపతులు అయితే ఉమ్మడిగా రూ.60 లక్షలు ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. పథకం కాల వ్యవధి ఐదేళ్లు. దీనిపై 8.2 శాతం వడ్డీ లభిస్తుంది. అన్ని పోస్టాఫీసుల్లోనూ, కొన్ని బ్యాంక్‌ శాఖల్లో ఎస్‌సీఎస్‌ఎస్‌ ఖాతా తెరవొచ్చు. ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లిస్తారు.

 ఇది ఆదాయపన్ను పరిధిలోకి వస్తుంది. ఇందులో చేసే పెట్టుబడిపై అదే ఆర్థిక సంవత్సరంలో సెక్షన్‌ 80సీ కింద పన్ను ప్రయోజనం మినహాయింపును క్లెయిమ్‌ చేసుకోవచ్చు. వడ్డీ రాబడిని ఏ ఏడాదికి ఆ ఏడాదే పన్ను రిటర్నుల్లో చూపించాల్సి ఉంటుంది. ఆదాయ శ్లాబుకు అనుగుణంగా పన్ను రేటు చెల్లించాల్సి వస్తుంది. ముందస్తు పదవీ విరమణ తీసుకున్న వారికి కనీస వయోపరిమితి 55 ఏళ్లుగా ఉంది. రక్షణ దళాల్లో పనిచేసిన మాజీ ఉద్యోగులు 50 ఏళ్లకే ఇందులో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు.

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (ఎఫ్‌డీలు)
బ్యాంకుల్లో దీర్ఘకాల డిపాజిట్లపై వడ్డీ 7–9 శాతం మధ్య ఉంది. ప్రముఖ బ్యాంకుల్లో ఇది 7–8 శాతం మధ్య ఉంటే, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు కొంచెం అదనంగా ఆఫర్‌ చేస్తున్నాయి. బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (నాన్‌ క్యుములేటివ్‌)లపై ప్రతి నెలా వడ్డీ చెల్లింపులు లభిస్తాయి. కాకపోతే మరీ దీర్ఘకాలానికి (పదేళ్లకు మించిన) డిపాజిట్‌ చేసుకోవడానికి అవకాశం ఉండదు. పైగా ఎలాంటి పన్ను ప్రయోజనం లేదు.

 వడ్డీ రాబడి ఆదాయ పన్ను పరిధిలోకి వస్తుంది. రిస్క్‌ పరంగా చూస్తే.. బ్యాంక్‌ ఎఫ్‌డీలకు ఆర్‌బీఐ డిపాజిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ కింద రక్షణ ఉంటుంది. బ్యాంక్‌ సంక్షోభంలో పడితే ఒక బ్యాంక్‌ పరిధిలో ఒక ఖాతాదారు పేరిట ఎంత డిపాజిట్‌ ఉన్నప్పటికీ గరిష్టంగా రూ.5లక్షల వరకు వెనక్కి వస్తుంది. కనుక ఒక బ్యాంక్‌ పరిధిలో (ఎన్ని శాఖలైనా) రూ.5లక్షలే డిపాజిట్‌ చేసుకోవడం తెలివైన నిర్ణయం.

మంత్లీ ఇన్‌కమ్‌ ప్లాన్లు
మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు మంత్లీ ఇన్‌కమ్‌ ప్లాన్లను (ఎంఐపీలు) ఆఫర్‌ చేస్తుంటాయి. ప్రధానంగా డెట్‌ సెక్యూరిటీల్లో, స్వల్పంగా (10–20శాతం) ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా ఇన్వెస్టర్లకు స్థిరాదాయాన్ని అందిస్తాయి. వీటిల్లో రాబడులకు ఎలాంటి హామీ ఉండదు. స్థిరంగానూ ఉండవు. మార్కెట్‌ ఆధారితంగా రాబడులు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో రాబడులు మరీ తగ్గొచ్చు. వీటిల్లో రిస్క్‌ తక్కువ. లిక్విడిటీ ఎక్కువ. ఎప్పుడు అవసరమైతే అప్పుడు పెట్టుబడిని వెనక్కి తీసుకోవచ్చు.

కార్పొరేట్‌ డిపాజిట్లు
నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ)లు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు (హెచ్‌ఎఫ్‌సీలు) తమ డిపాజిట్ల ద్వారా నిధులు సమీకరిస్తుంటాయి. ఈ తరహా కార్పొరేట్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల(నాన్‌ క్యుములేటివ్‌)లో ఇన్వెస్ట్‌ చేసుకుని, వీటి నుంచి నెలవారీ/మూడు నెలలు/ఆరు నెలలు/ఏడాదికి ఒకసారి చొప్పున ఆదాయం తీసుకునే వెసులుబాటు ఉంది. వీటిని బ్యాంక్‌ డిపాజిట్లతో పోల్చి చూడొచ్చు. బ్యాంకుల్లో రూ. 5 లక్షల వరకు డిపాజిట్లకు రక్షణ ఉంటుంది. 

కానీ కార్పొరేట్‌ డిపాజిట్లలో ఎలాంటి హామీ ఉండదు. కనుక రిస్క్‌ తగ్గించుకునేందుకు ఏఏఏ రేటెడ్, ఏఏ మైనస్‌ రేటెడ్‌ డిపాజిట్లను ఎంపిక చేసుకోవచ్చు. సంబంధిత ఆర్థిక సంస్థ గత చరిత్రను ఇన్వెస్ట్‌ చేసే ముందు పరిశీలించాలి. బ్యాంక్‌ ఎఫ్‌డీల కంటే కాస్త అధిక రాబడులు వీటిల్లో ఉంటాయి. వడ్డీ ఆదాయానికి ఎలాంటి పన్ను ప్రయోజనాల్లేవు. ఉదాహరణకు బజాజ్‌ ఫైనాన్స్, శ్రీరామ్‌ ఫైనాన్స్‌ సంస్థలు డిపాజిట్లపై నిధులు సమీకరిస్తుంటాయి. ఇవి మెరుగైన రేటింగ్‌ కలిగిన సంస్థలు.

సిస్టమ్యాటిక్‌ విత్‌ డ్రాయల్‌ ప్లాన్లు (ఎస్‌డబ్ల్యూపీ)
ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌)లు గురించి తెలిసే ఉంటుంది. ఎంపిక చేసుకున్న పథకాల్లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్‌ చేసుకునేందుకు వీలు కలి్పంచేదే సిప్‌. దీనికి విరుద్ధంగా ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసి క్రమంగా కొంత చొప్పున ఉపసంహరించుకోవడమే ఎస్‌డబ్యూపీ. ఎంత మేర ఉపసంహరించుకోవాలన్నది ఇన్వెస్టర్‌ అభీష్టమే. తమ వద్దనున్న మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేసుకునేందుకు అనువైన ఫండ్స్‌ను ముందుగా ఎంపిక చేసుకోవాలి. 

అందులో ఏకమొత్తంలో కాకుండా, ఆరు నుంచి 12 నెలల సమాన వాయిదాల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలి. దీనివల్ల కొనుగోలు సగటుగా మారుతుంది. ఆ తర్వాత నుంచి ప్రతి నెలా నిరీ్ణత శాతం మేర ఎస్‌డబ్ల్యూపీ ద్వారా ఉపసంహరించుకోవచ్చు. రాబడుల కంటే మూడు శాతం తక్కువ ఉపసంహరణకు పరిమితం కావాలి. దీనివల్ల ఈ మూడు శాతం తిరిగి పెట్టుబడి వృద్ధికి దోహదపడుతుంది. దీంతో ద్రవ్యోల్బణ ప్రభావాన్ని అధిగమించేందుకు వీలుంటుంది.  


మోతీలాల్‌ ఓస్వాల్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ అఖిల్‌ చతుర్వేది సూచన ప్రకారం.. ఈక్విటీల్లో 65 శాతం, డెట్‌కు 35 శాతం కేటాయించే అగ్రెస్సివ్‌ హైబ్రిడ్‌ ఫండ్స్‌ లేదా ఈక్విటీలకు 60 శాతం, డెట్‌కు 40 శాతం కేటాయించే బ్యాలన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. వీటిల్లో దీర్ఘకాలంలో రాబడులు 12–13 శాతం మేర ఉంటాయి. కనుక ఉపసంహరణ 6–9 శాతం మించకూడదు. ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్స్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇవి అయితే ఈక్విటీ కేటాయింపులను 35 శాతానికే పరిమితం చేసి మిగిలిన మొత్తాన్ని డెట్‌కు కేటాయిస్తాయి. 

వీటిల్లో దీర్ఘకాల రాబడి 9–10 శాతం మేర ఉంటుంది. కనుక 6 శాతం ఉపసంహరణకు పరిమితం కావాలి. ఇవే ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసి, డివిడెండ్‌ ఆప్షన్‌ ఎంపిక చేసుకున్నా సరిపోతుంది. కానీ, డివిడెండ్‌ ఎప్పుడు ప్రకటించాలన్నది ఫండ్స్‌ సంస్థల అభీష్టం. అందుకే ఎస్‌డబ్ల్యూపీ మెరుగైన ఆప్షన్‌ అవుతుంది. వీటిల్లో పెట్టుబడులకు ఎలాంటి పన్ను ప్రయోజనం లేదు. కానీ, ఏడాదిలోపు విక్రయించిన పెట్టుబడులకు సంబంధించి లాభంపై 20 శాతం పన్ను, ఏడాది మించిన పెట్టుబడులు విక్రయించగా వచి్చన లాభంపై మొదటి రూ.1.25 లక్షల తర్వాతి మొత్తంపై 12.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.  

బాండ్‌ ల్యాడర్‌ పోర్ట్‌ఫోలియో 
వివిధ కాల వ్యవధులతో బాండ్లను కొనుగోలు చేయడం. అంటే ఒక్కో బాండ్‌ మెచ్యూరిటీ ఒకే తేదీతో కాకుండా, వరుస క్రమంలో ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకు ఏడాది కాలానికి ఒకటి తీసుకుంటే, 13 నెలలు, 14 నెలలు, 15 నెలలు ఇలా అనమాట. గడువు తీరి చేతికి వచి్చన ప్రతి బాండ్‌ మెచ్యూరిటీ మొత్తంలో అసలుతో తిరిగి బాండ్‌ కొనుగోలు చేయాలి. వడ్డీ భాగాన్ని ఆదాయం కింద వినియోగించుకోవాలి.  

పీర్‌ టు పీర్‌ (పీ2పీ) లెండింగ్‌ 
పీ2పీ ఫిన్‌టెక్‌ ప్లాట్‌ఫామ్‌లు ప్రత్యేకంగా ఉన్నాయి. ఇవి రుణం కావాల్సిన వారిని, అదే సమయంలో రుణంపై ఆదాయం కోరుకునే వారిని ఒకే వేదికగా కలుపుతాయి. బాండ్లు, ఎఫ్‌డీల కంటే పీ2పీ ప్లాట్‌ఫామ్‌లు ఎక్కువ రాబడికి మార్గం చూపుతాయి. కాకపోతే రుణం తీసుకునే వ్యక్తికి సంబందించి ఆర్థిక చరిత్ర ఈ సంస్థలకు పెద్దగా తెలియదు. కనుక రుణ ఎగవేతల రిస్క్‌ వీటిల్లో ఉంటుంది. వడ్డీ ఆదాయంలో కొంత పంచుకునేట్టు అయితే పీ2పీ సంస్థలు రుణం వసూలు బాధ్యతను తీసుకుంటున్నాయి.  

వీటిని గమనించాలి..
→ నెలవారీ లేదా త్రైమాసికంవారీ స్థిరమైన ఆదాయానికి వీలుగా పెట్టుబడి సాధనం ఎంపికలో ఎంతో ఆచితూచి వ్యవహరించాలి. అందరికీ అన్నీ అనుకూలంగా ఉండవు. పెట్టుబడికి అందుబాటులో ఉన్న నిధి, వాటిపై ఆశిస్తున్న రాబడి, ఎంత రిస్క్‌ తీసుకోగలరు? ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. తమ ఆకాంక్షలకు సరిపోలే ఉత్పత్తిని ఎంపిక చేసుకోవాలి. పెట్టుబడుల వృద్ధికి, పెట్టుబడిపై స్థిరమైన రాబడికి మధ్య వ్యత్యాసం ఉంది. స్పష్టత తెచ్చుకోలేకపోతే 
ఈ విషయంలో నిపుణుల సాయం తీసుకోవడానికి వెనుకాడొద్దు.  
→ రాబడిపై పన్ను బాధ్యతను తప్పకుండా గుర్తించాలి. పన్ను పోను నికర రాబడి ఎంతన్నది చూడాలి. తమ పెట్టుబడుల 
కాల వ్యవధికి అనుకూలమైన ఉత్పత్తిని ఎంపిక చేసుకోవాలి.  
→ పెట్టుబడి మొత్తాన్ని ఏదో ఒక సాధనంలో కాకుండా, ఒకటికి మించిన సాధనాల మధ్య వైవిధ్యం చేసుకోవడాన్ని పరిశీలించాలి.  

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌ 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Fixed income
Retirement Plan
post office
Senior Citizens Saving Scheme
Fixed Deposit
Systematic withdrawal plan
Off Beat
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా గోల్డెన్‌ గోల్‌ స్కీమ్‌

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా గోల్డెన్‌ గోల్‌ స్కీమ్‌

ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌.. ఫటాపట్‌!

ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌.. ఫటాపట్‌!

పోస్టాఫీస్ బంపర్ ఆఫర్.. రూ.370 పొదుపుతో చేతికి రూ.8 లక్షలు..

పోస్టాఫీస్ బంపర్ ఆఫర్.. రూ.370 పొదుపుతో చేతికి రూ.8 లక్షలు..

రిస్క్‌ లేకుంటే రాబడి లేదు!

రిస్క్‌ లేకుంటే రాబడి లేదు!

నెలకు రూ. 5వేలుతో.. రూ. 8లక్షలు చేతికి!

నెలకు రూ. 5వేలుతో.. రూ. 8లక్షలు చేతికి!

లైఫ్ ఇన్సూరెన్స్.. ఎందుకు తీసుకోవాలంటే?

లైఫ్ ఇన్సూరెన్స్.. ఎందుకు తీసుకోవాలంటే?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.