Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

డిజిటల్‌ పేమెంట్లు.. చీఫ్‌ రిస్క్‌ ఆఫీసర్‌ చిట్కాలు

Business Sakshi User Sakshi Sakshi Time Dec 15, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
digital.jpg

డిజిటల్‌ పేమెంట్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి, ఇవి భారతదేశాన్ని డిజిటల్‌–ఫస్ట్‌ ఆర్థిక వ్యవస్థ వైపు తీసుకెళ్తున్నాయి. ఇవి భద్రతతో పాటు, వినియోగదారులకు చెల్లింపుల్లో సౌకర్యాన్ని అందిస్తాయి. అయితే, డిజిటల్‌ పేమెంట్లను సురక్షితంగా ఉపయోగించడం, ఆన్‌లైన్‌ మోసాలకు గురి కాకుండా ఉండటం ఈరోజుల్లో  అత్యంత కీలకం.

సంభవించే మోసాలను ముందుగానే గుర్తించగలిగితే అది  మీతోపాటు  మీ కుటుంబ సభ్యులను కూడా ఆన్‌ లైన్‌ మోసాల నుంచి కాపాడడమే కాకుండా అందరికీ  సురక్షితమైన, తక్కువ నగదు వినియోగంతో కూడిన ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో సహాయపడుతుంది. ఆధునిక టెక్నాలజీ  చెల్లింపులను వేగంగా జరిపేలా, సులభతరంగా మార్చినప్పటికీ, ఆన్‌లైన్‌ మోసాల నుండి పూర్తి స్థాయి రక్షణ అవగాహనతోనే సాధ్య పడుతుంది. ఆన్‌లైన్‌ మోసాలు, ముఖ్యంగా సామాజిక ఇంజినీరింగ్‌ ద్వారా జరిగేవి  ఇటీవలి కాలంలో చాలా ఆందోళనగా కలిగిస్తున్నాయి. దురాశ, భయం, అత్యవసరం వంటి భావోద్వేగాలను సాధనాలుగా ఉపయోగించి ఆన్‌లైన్‌ మోసగాళ్లు వినియోగదారులను వంచిస్తారు.

ఇటీవలి కాలంలో వేగంగా పెరుగుతున్న ధోరణుల్లో ఒకటి ‘‘డిజిటల్‌ అరెస్టు‘ తమను పోలీసులమని  చెప్పుకుంటూ ఎవరో  కాల్‌ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. మీ బ్యాంక్‌ ఖాతా దర్యాప్తులో ఉందని, డబ్బును ‘సురక్షిత’ ఖాతాకు మార్చాలని వారు చెబుతారు. వెంటనే మానసిక ఒత్తిడికి గురైన వినియోగదారులు వారి ట్రాప్‌లో పడి  అంతా పోగొట్టుకుని చాలా ఆలస్యంగా అది మోసమని  గ్రహిస్తారు. నిజమైన ప్రభుత్వ సంస్థలు, నియంత్రణ సంస్థలు ఎప్పుడూ ఫోన్లు, వీడియో కాల్‌ ద్వారా డబ్బు అడగవు,  కేసులను దర్యాప్తు చేయవు. డబ్బు విషయంలో నిర్ణయం తీసుకునే ముందు కాల్‌ చేసిన వ్యక్తి నిజస్వరూపాన్ని నిర్ధారించుకోవడం, నమ్మకమైన ప్రభుత్వ సంస్థలను సంప్రదించడం చాలా ముఖ్యం.

వేగంగా పెరుగుతున్న పెట్టుబడి మోసాలు 
ఆరి్ధక నిపుణులుగా పరిచయం చేసుకుని మోసంచేసే వారు ఇటీవలి బాగా పెరిగారు. పేరున్న సంస్థలను, నకిలీ రిఫరెన్సులను అమాయక, ఔత్సాహిక ఇన్వెస్టర్లను మోసగించేందుకు వీరు  ఉపయోగిస్తారు.అసాధారణ లాభాలు , ప్రత్యేక పెట్టుబడి అవకాశాలను అందిస్తామని వాగ్దానం చేస్తారు. బదులుగా డబ్బు అందుకున్న వెంటనే అదృశ్యమైపోతారు. అందుకే  ఎల్లప్పుడూ సెబీ, ఆర్‌బీఐ ఇతర అధికారిక నియంత్రణ సంస్థల వెబ్‌సైట్లలో నమోదైన సంస్థల జాబితాలను తనిఖీ చేస్తుండాలి.

వినియోగదారులు సురక్షితంగా ఎలా ? 
డిజిటల్‌ పేమెంట్‌లను ఆమోదించే ముందు వినియోగదారులు ఎల్లవేళలా యాప్‌ నోటిఫికేషన్‌లను జాగ్రత్తగా పరిశీలించాలి, మోసం జరిగితే వెంటనే తమ బ్యాంకుకు తెలియజేయాలి లేదా 1930 (సైబర్‌ సెక్యూరిటీ హెల్ప్‌లైన్‌)కు కాల్‌ చేయాలి, అలాగే నిర్ధారించని యాప్‌లను డౌన్‌లోడ్‌ చేయకూడదు.  నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(NPCI) కూడా తక్షణ చెల్లింపు వ్యవస్థ –యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ ఫేస్‌(UPI) వ్యవస్థలో అనేక భద్రతా చర్యలను అమలు చేస్తోంది. తెలియని  యూపీఐ ఐడీలకు డబ్బు పంపేటప్పుడు హెచ్చరిక సందేశాలతో ప్రారంభ అలర్ట్‌లు, అలాగే డివైస్‌ బైండింగ్‌ లాంటి రెండంచెల ధృవీకరణతో కూడిన  భద్రతా వ్యవస్థను అమల్లోకి తెచ్చింది.

‘మే మూర్ఖ్‌ నహీ హూన్‌’’ వంటి ప్రచార వీడియోల ద్వారా ప్రజల్లో అవగాహనను పెంచడానికి కూడా ఎన్‌పీసీఐ కృషి చేస్తోంది. డిజిటల్‌ భద్రతగా ఉండడం, ఆన్‌లైన్‌ మోసాల విషయంలో అప్రమత్తతతో ఉండే సంస్కృతిని వినియోగదారుల్లో పెంపొందించేందుకు ప్రయత్నిస్తోంది. డిజిటల్‌ పేమెంట్లు ప్రతి వినియోగదారుడికి సులభంగా  సురక్షితంగా ఉండేలా చేస్తోంది. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
digital payments
NPCI
Chief
risk
officer
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

అన్నిటికీ ఒకటే క్యూర్‌

అన్నిటికీ ఒకటే క్యూర్‌

ఎస్‌ఐ ఉద్యోగం వదిలేసి, ఆస్ట్రేలియాలో రియల్‌ ఎస్టేట్‌ కింగ్‌ అయ్యాడు!

ఎస్‌ఐ ఉద్యోగం వదిలేసి, ఆస్ట్రేలియాలో రియల్‌ ఎస్టేట్‌ కింగ్‌ అయ్యాడు!

'దేవుడు వరమందిస్తే' సాంగ్.. రీల్స్ చేస్తే ప్రైజ్‌మనీ

'దేవుడు వరమందిస్తే' సాంగ్.. రీల్స్ చేస్తే ప్రైజ్‌మనీ

సారీ చెప్పి.. 15 వేలు ఫోన్‌పే చేశాడు!

సారీ చెప్పి.. 15 వేలు ఫోన్‌పే చేశాడు!

రికార్డ్‌ బ్రేకింగ్‌: యూపీఐ పేమెంట్లు.. రూ.29.90 లక్షల కోట్లు

రికార్డ్‌ బ్రేకింగ్‌: యూపీఐ పేమెంట్లు.. రూ.29.90 లక్షల కోట్లు

‘మూన్‌ మిషన్‌’కు బ్రేక్..‘నాసా’ కీలక ప్రకటన

‘మూన్‌ మిషన్‌’కు బ్రేక్..‘నాసా’ కీలక ప్రకటన

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.