Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

నగదు వ్యవహారాలు వద్దే వద్దు ..!

Business Sakshi User Sakshi Sakshi Time Feb 23, 2026 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
cash.jpg

నగదు వ్యవహారాలు ఇప్పటికీ చాలామంది చేస్తూనే ఉన్నారు. వ్యవస్థలో నగదు చెలామణి ఈ జనవరిలో రూ. 40 లక్షల కోట్లకు చేరిందని ప్రాథమిక అంచనా. ఇది వార్షికంగా 11.1% చొప్పున పెరుగుతోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ పెరుగుదల ఒక చరిత్రను సృష్టిస్తోంది. మరోవైపు డిజిటల్‌ వ్యవస్థ వృద్ధి చెందుతోంది. దేశవ్యాప్తంగా యూపీఐ వాడే వారి సంఖ్య 400 మిలియన్లు. దానిని మరో 600 మిలియన్లకు పెంచి ‘ఒక బిలియన్‌’కి పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యం.

ఫోన్‌పే, గూగుల్‌ పే, పేటీఎంలు ‘స్కాన్‌అండ్‌పే’ ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాయి. భవిష్యత్తు ‘డిజిటల్‌ ప్రపంచమే’. అయినా మనిషి మారడం లేదు. నగదు వదలట్లేదు. రాజకీయ ఎన్నికల్లో నగదు పంపిణీ గురించి వింటాం. సినిమా ఇండస్ట్రీలో అది పరిపాటి. రియల్‌ ఎస్టేట్‌లో అలవాటు. లంచావతరాలకు దురలవాటు. ఎందుకో ఈ పొరపాటు చేసిన తర్వాత, దొరికిపోయిన తర్వాత గ్రహపాటు అని సరిపెట్టుకోవడం సాధారణమైంది.  
భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేసుకుంటూ సక్రమమైన మార్గంలోనే సంపాదిస్తూ చౌక రోజుల్లో ఇళ్లు, ఫ్లాటు కొన్నారు. కాలం కలిసొచ్చింది. వాటిని అమ్మినప్పుడు భారీ లాభాలు వచ్చాయి.

అయితే మార్కెట్‌ ధరని మించిన ప్రతిఫలాన్ని నగదులో తీసుకున్నారు. సక్రమమైన(వైట్‌) వ్యవహారాన్ని ఆదాయపన్ను వారికి డిక్లేర్‌ చేసి చేతులు దులుపుకున్నారు. కానీ ఇంట్లో కొండచిలువగా నగదు నిలువ ఉంది. ఏం చేయాలి? ఇదొక పెద్ద ప్రశ్న..!  ఇంతటితో ఆగిపోయిందా? లేదు. జాలి గుండె కలిగిన ఆ ఇల్లాలు స్నేహితుడికి వైద్యం నిమిత్తం రూ.6 లక్షలు నగుదు రూపంలో ఇచ్చింది. ఆ స్నేహితుడు తన భార్య ఆనారోగ్యం కోసం ఖర్చు పెట్టినా భార్య చనిపోయింది. తరువాత ఇన్సూరెన్సు డబ్బు బ్యాంకు ద్వారా వచ్చాయి. ‘చేతిలో నగదు లేదు. తను తిరిగి చెల్లించాల్సిన రూ.6 లక్షల మొత్తం చెక్కు ద్వారా ఇస్తాను’ అంటున్నాడు. ఇప్పుడు ఆ జాలి గుండె కలిగిన ఆ ఇల్లాలు ఆ మొత్తాన్ని ఎలా చూపించాలన్నది ప్రశ్న.

మంచికి పోతే చెడు ఎదురురొచ్చింది..?  
తండ్రి బతికున్నప్పుడు జాగాలో సగం రాయించుకున్నాడు పెద్ద కొడుకు. పెద్దలు ఇద్దరూ కాలం చేశారు. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు మిగిలిన సగం జాగా పెద్దవాడికే అమ్మేశారు. కానీ పెద్దవాడు వ్యాపారంలో బాగా సంపాదించడం వలన తన దగ్గర ఉన్న నగదు కుటుంబ సభ్యులకిచ్చి వ్యవహారం నడిపించాడు. డబ్బు మీద వ్యామోహం వలన అందరూ నగదు వైపే మొగ్గు చూపించారు. ఒక్కొక్కరి చేతిలో పదేసి లక్షల మూట చేరింది. అటు పెద్దకొడుకు తన ‘బ్లాక్‌మనీ’ని వదిలించుకొని మిగతా అందరికి నగదు పంచి ఇచ్చాడు.

నగదు నాగుపాములా తయారైంది.!  
అన్నదమ్ములు ఐక్యంగా ఉన్న కుటుంబంలో అన్న పురోహితుడు, తమ్ముడు క్యాటరింగ్‌ చేసేవారు. ఇద్దరికి దశ తిరిగింది. బాగా డబ్బులు నగదు రూపంలో వచ్చాయి. భార్యామణుల సలహామేరకు బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేశారు. కాలక్రమేణా పెద్ద మొత్తాలుగా మారాయి. టీడీయస్‌.. ఇన్‌కమ్‌టాక్స్‌.. పన్ను ఎగవేత ఉద్దేశంతో ఇన్‌కమ్‌ రిటర్నులు వేయడం లేదు. ఇప్పుడేం చేయాలనేది ఎడతెగని ప్రశ్న..?

తను ఒక చిన్న ఇంట్లో ఉంటూ తన పది ప్లాట్లు కేవలం నగదుకే అద్దెకిచ్చి, అద్దె వసూలు చేస్తూ జీవితం కులాసాగా గడుపుతున్నాడు గోవిందం. పొరపాటున ఒక కిరాయిదారునికి ఇచ్చిన రశీదు కొంప ముంచింది. ఒకటి నగదు రశీదు. రెండవది పన్ను ఎగవేత. వీటి విషయం ఏమిటంటే.. నగదు వ్యవహారాలను చేయకండి. అసలు ప్రోత్సహించకండి. నల్లధనం (బ్లాక్‌ మనీ) వైపు వెళ్లొద్దు. నగదులో అప్పు ఇవ్వడం తప్పు. పుచ్చుకోవడం మరీ తప్పు. ఆ మొత్తాన్ని తిరిగి బ్యాంకు ద్వారా చెల్లిస్తే అది ఆదాయంగా మారి పన్నుకి గురి అవుతుంది. నగదు తీసుకోవడం తప్పని చెప్పాం కదా..! పోనీ దానిని అకౌంటు చేస్తే కనీసం మీ నిజాయితీ తెలుస్తుంది.  

గణనీయంగా పెరిగిన నగదు వ్యవహారాలను కృత్రిమ మేధస్సు (ఏఐ) ద్వారా కనుక్కొవచ్చు. డిపార్ట్‌మెంట్‌ వారి వద్ద ఇంటెలిజెన్స్, ఫోరెన్సిక్‌ విభాగాలున్నాయి. మీరు సంపాదించిన ‘ధనం’ మీ దగ్గర ఉన్నా, వారి దగ్గర ‘ఇంధనం’ లాంటి సమాచారం ఉంది. ఈ రెండింటిని అనుసంధానం చేసే అవకాశం ఇవ్వకండి. సౌకర్యం కోసం నగదుని ఆశ్రయించకండి. అన్ని విధాల బ్యాంకు దారి సక్రమమైన రహదారి.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
cash transactions
Risks
Black Money
Income Tax (IT)
tax experts
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

జీడీపీ వృద్ధికి సవాళ్లు..!

జీడీపీ వృద్ధికి సవాళ్లు..!

Income Tax: నోటీసుకి బదులివ్వండి..

Income Tax: నోటీసుకి బదులివ్వండి..

ఆదాయపన్ను వసూళ్లు రూ.5.21 లక్షల కోట్లు

ఆదాయపన్ను వసూళ్లు రూ.5.21 లక్షల కోట్లు

Income Tax: ‘ఇన్‌కం స్టేట్‌మెంట్‌’ ఇలా తయారు చేయండి..

Income Tax: ‘ఇన్‌కం స్టేట్‌మెంట్‌’ ఇలా తయారు చేయండి..

అడ్వాన్స్ ట్యాక్స్ డెడ్‌లైన్‌ రేపే..

అడ్వాన్స్ ట్యాక్స్ డెడ్‌లైన్‌ రేపే..

వైభవ్ సూర్యవంశీ ట్యాక్స్ ఎవరు కట్టాలి?: రూల్స్ ఏం చెబుతున్నాయ్!

వైభవ్ సూర్యవంశీ ట్యాక్స్ ఎవరు కట్టాలి?: రూల్స్ ఏం చెబుతున్నాయ్!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.