Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Astrology
  3. ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ADVERTISEMENT 

ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Astrology Sakshi User Sakshi Sakshi Time Jan 18, 2026 Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
vara.jpg

మేషం...
నూతనంగా చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. ఆస్తుల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వాహనయోగం. మీ నిర్ణయాలు అందరూ గౌరవిస్తారు. సభలు, సమావేశాలకు హాజరవుతారు. తీర్థయాత్రలు చేస్తారు. దూరపు  బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వివాహయత్నాలు తుది దశకు చేరుకుంటాయి. ఆరోగ్య సమస్యలు ఎదురైనా ఉపశమనం పొందుతారు. వ్యాపారాలు కొంతవరకూ లాభిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. వ్యయప్రయాసలు. ఎరుపు, తెలుపు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.

వృషభం...
అనుకున్న వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆస్తి విషయాలలో సోదరుల నుంచి అనుకూల సంకేతాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి రుణాలు తీరుస్తారు. కొన్ని నిర్ణయాలు తీసుకుని కుటుంబసభ్యులను ఆశ్చర్యపరుస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనయోగం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో బాధ్యతల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. రాజకీయవర్గాలకు మరింత అనుకూల సమయం. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. పసుపు, ఆకుపచ్చ రంగులు. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

మిథునం....
అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మీ వ్యూహాలు కుటుంబసభ్యులను మెప్పిస్తాయి. వ్యాపారాలలో ఊహించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఆశాజనకంగా ఉంటుంది. విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ఆరోగ్యసమస్యలు. వ్యయప్రయాసలు. గులాబీ, పసుపు రంగులు. గణేశాష్టకం పఠించండి.

కర్కాటకం....
కొన్ని పనులను ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. కుటుంబసమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆరోగ్యం కొంత కుదుటపడుతుంది. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. ఆస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. అందరిలోనూ ప్రత్యేకతను చాటుకుంటారు. మీ ప్రజ్ఞాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకోని హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు పురస్కారాలు అందుతాయి. వారం చివరిలో ఆరోగ్య, కుటుంబసమస్యలు. ధనవ్యయం. గులాబీ, నేరేడు రంగులు.  లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.

సింహం....
ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. సంఘంలో గౌరవం మరింత పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. వాహనయోగం. స్థిరాస్తి వృద్ధి. కొన్ని నిర్ణయాలు బంధువులను ఆశ్చర్యపరుస్తాయి. విద్యార్థులకు ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. కుటుంబసభ్యులు మీపై మరింత ఆదరణ చూపుతారు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. నేరేడు, తెలుపు రంగులు. లక్ష్మీస్తుతి మంచిది.

కన్య....
ముఖ్యమైన పనులలో అవాంతరాలు తొలగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులు, మిత్రులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. పరిస్థితులు అనుకూలించి ముందడుగు వేస్తారు. నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగాలు దక్కుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. కళారంగం వారికి అవార్డులు దక్కే అవకాశం. వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. మానసిక అశాంతి. నీలం, ఆకుపచ్చ రంగులు.  సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

తుల....
ఆర్థికంగా పురోగతి కనిపించినా రుణాలు సైతం చేస్తారు. మిత్రులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తుల విషయంలో నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగుతుంది. కొన్ని వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు కొంత శ్రమ తప్పదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు మిశ్రమంగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో ఆరోగ్యభంగం. బంధువులతో మాటపట్టింపులు. . పసుపు, తెలుపు రంగులు. ఈశ్వరారాధన మంచిది.

వృశ్చికం....
అనుకున్న సమయానికి డబ్బు సమకూరక ఇబ్బందిపడవచ్చు. ఆలోచనలు అంతగా కలసిరావు. కుటుంబబాధ్యతలు మరింత పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులు, మిత్రులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. ముఖ్యమైన పనులు నిదానంగా కొనసాగుతాయి. కొన్ని వివాదాలు చికాకు పరుస్తాయి. ఆరోగ్యం కొంత చికాకు పరుస్తుంది. వ్యాపార లావాదేవీలు కొంత నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరిగేవీలుంది. కళారంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. గులాబీ, నీలం రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

ధనుస్సు...
అనుకున్న వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. బంధువులకు మీ మనస్సులోని భావాలను వెల్లడిస్తారు. అందరిలోనూ గౌరవానికి లోటు ఉండదు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆస్తుల విషయంలో కొద్దిపాటి సమస్యలు ఎదురైనా సర్దుబాటు చేసుకుంటారు. ఇంటి నిర్మాణాలపై తుది నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు దక్కుతాయి. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు గతం కంటే కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొత్త విధుల్లో చేరవచ్చు. రాజకీయవర్గాలకు కొన్ని పదవులు దక్కే అవకాశం. వారం మధ్యలో ఆరోగ్యభంగం. మిత్రులతో వివాదాలు. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు.  దేవీఖడ్గమాల పఠించండి.

మకరం...
ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి కాగలవు. ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఒడ్డున పడతారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పరపతి కలిగిన వారితో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. మీ అభిప్రాయాలు, మనోగతాన్ని కుటుంబసభ్యులు గౌరవిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. కాంట్రాక్టర్లకు శుభవార్తలు అందుతాయి. శత్రువులను సైతం ఆదరిస్తారు. వ్యాపార లావాదేవీలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కించుకుంటారు. కళారంగం వారికి సత్కారాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. ఎరుపు, నేరేడు రంగులు. అన్నపూర్ణాష్టకం పఠించండి.

కుంభం...
చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. శ్రమకు ఫలితం కనిపిస్తుంది. విద్యార్థుల యత్నాలు సానుకూలం. కొత్త పనులు చేపట్టి విజయవంతంగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఇంటి నిర్మాణాల్లో  ఆటంకాలు తొలగుతాయి. నూతనోద్యోగాలు దక్కించుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. గులాబీ, నేరేడు రంగులు. సుబ్రహ్మణ్యస్తోత్రాలు పఠించండి.

మీనం....
ఆర్థిక వ్యవహారాలు కొంత సామాన్యంగా ఉన్నా అవసరాలకు లోటు రాదు. చిన్ననాటి మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆస్తి విషయంలో చిక్కులు తొలగి లబ్ధి చేకూరుతుంది. మీ ఆశయాలు నెరవేరతాయి. చాకచక్యంగా కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సానుకూలమవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న  మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి సత్కారాలు జరుగుతాయి. వారం మధ్యలో అనారోగ్యం. నిర్ణయాలలో మార్పులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. అన్నపూర్ణాష్టకం  పఠించండి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Rasi Phalalu
Astrology
Horoscope
Weekly Horoscope
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి

ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి

ఈ రాశి వారు స్థిరాస్తులు కొంటారు

ఈ రాశి వారు స్థిరాస్తులు కొంటారు

ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం

ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం

ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. ఆస్తిలాభం

ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. ఆస్తిలాభం

ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. పలుకుబడి పెరుగుతుంది

ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. పలుకుబడి పెరుగుతుంది

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.