సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నాగార్జున యాదవ్‌ని ఇంటి నుండి తీసుకెళ్లిన పోలీసులు.. తెలంగాణ పోలీసులమంటూ కుటుంబ సభ్యులకు చెప్పారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నాగార్జున యాదవ్‌ని పోలీసులు తీసుకెళ్లారు. నల్లపాడు పోలీస్ స్టేషన్‌కి సమాచారం ఇస్తామని పోలీసులు తెలిపారు.
నాగార్జున యాదవ్ అరెస్ట్‌పై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఆయన్ని అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ రఘురాం, నాగార్జున యాదవ్ భార్య.. ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు.


