తాడేపల్లి : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి అంటేనే ఉజ్వల కాంతి అని, చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం.. దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయమని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే పండుగ దీపావళి అని, ఈ దీపావళి పండగ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలనీ, ప్రజలందరి జీవితాలు శోభాయమానంగా వెలుగొందాలనీ, ప్రతి ఇంటా ఆనంద కాంతులు విరాజిల్లాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. చీకటి నుంచి వెలుగువైపు, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపించే దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త వెలుగులు నింపాలని, మీ కృషి ఫలించి, మీ సంకల్పాలు నెరవేరి, ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. #HappyDiwali
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 8, 2026
ఇదీ చదవండి: మీరు చేసే నిర్బంధాలు దుర్మార్గం.. మీ పాలన హేయం: వైఎస్ జగన్










