సాక్షి, అమరావతి: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 7, 8 తేదీల్లో వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు వైఎస్ జగన్ పులివెందుల చేరుకుంటారు. భాకరాపురం క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు.
రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. 8న బుధవారం ఉదయం పులివెందుల నుంచి బయలుదేరి ఉదయం 7.30 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని నివాళులర్పిస్తారు.