సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 21(బుధవారం) విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు. చినముషిడివాడలోని శ్రీ శారదా పీఠంలో రాజశ్యామల అమ్మవారిని సీఎం దర్శించుకోనున్నారు.
ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి చినముషిడివాడ చేరుకుంటారు. శ్రీ శారదా పీఠంలో రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్నాక మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.