Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. పులివెందుల ముంగిట్లో అత్యున్నత వైద్యం
ADVERTISEMENT 

పులివెందుల ముంగిట్లో అత్యున్నత వైద్యం

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Feb 27, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ysr.jpg

వైఎస్‌ రాజారెడ్డి కంటి వైద్యశాలను ప్రారంభించిన వైఎస్‌ జగన్‌  

ఆస్పత్రిలో వివిధ విభాగాల పరిశీలన  

అత్యాధునిక పరికరాల పనితీరును వివరించిన నిపుణులు 

ఆస్పత్రిలో వైఎస్‌ జగన్‌కు కంటి పరీక్షలు    

సాక్షి కడప: వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందులలో అత్యాధునిక వసతులు, అత్యున్నత పరికరాలు, అత్యుత్తమ నిపుణుల ఆధ్వర్యంలో రూ.10 కోట్ల వ్యయంతో ఆధునికీకరించిన వైఎస్‌ రాజారెడ్డి నేత్ర వైద్యశాలను మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్య­క్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ప్రారంభించి పులివెందుల ప్రజలకు అంకితం చేశారు. ముందుగా ఆస్పత్రి ఆవరణలోకి వైఎస్‌ జగన్‌ చేరుకోగానే వైఎస్సార్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులతోపాటు ఎల్వీ ప్రసాద్‌ ఐ ఆస్పత్రి యాజమాన్యం ఘన స్వాగతం పలికారు. 

ఎల్వీ ప్రసాద్‌ ఐ ఆస్పత్రి ఫౌండర్, చైర్మన్‌ డాక్టర్‌ గుళ్లపల్లి నాగేశ్వరరావు, ఆయన సతీమణి ప్రతిభారావులతో కలసి రిబ్బన్‌ కట్‌ చేసి వైఎస్‌ జగన్‌ ఆస్పత్రిని ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం వైఎస్సార్‌ ఔట్‌ పేషెంట్స్‌ విభాగాన్ని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ప్రతిభారావు ప్రారంభించారు. పులివెందులలో రాజారెడ్డి ఆస్పత్రి దశాబ్దాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఇదే ఆస్పత్రిలో పని చేసి రూపాయి వైద్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 

ఈ ఆస్పత్రిని ఇప్పుడు అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దారు. రోజుకు 5 వేల ఆపరేషన్లు చేయగల అత్యాధునిక పరికరాలను అందుబాటులో ఉంచారు. వైద్యశాలకు వైఎస్సార్‌ ఫౌండేషన్‌ స్థలాన్ని సమకూర్చడంతోపాటు సుమారు రూ.10 కోట్లు వెచ్చిoచి నూతన భవనం, అత్యాధునిక పరికరాలను సమకూర్చింది. ఆధునికీకరించిన ఈ నేత్ర వైద్యశాలను ఎల్వీ ప్రసాద్, వైఎస్‌ రాజారెడ్డి కంటి వైద్య విజ్ఞాన సంస్థగా తీర్చిదిద్ది అత్యాధునిక కంటి వైద్య సేవలు అందించేలా సిద్ధం చేశారు. 

ఆస్పత్రిలో కలియతిరిగి.. 
కడప ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్‌ ఇన్‌చార్జి వైఎస్‌ మనోహర్‌రెడ్డిలతో కలసి వైఎస్‌ జగన్‌ ఆస్పత్రిలో కలియతిరిగి అన్ని విభాగాలను నిశితంగా పరిశీలించారు. కంటి యంత్ర పరికరాలను ఆసక్తిగా తిలకించారు. ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ ప్రశాంత్‌ గార్గ్, వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌ కె.రెడ్డి, డైరెక్టర్‌ రాజశేఖర్‌ వాటి పనితీరును వివరించారు. ఆసుపత్రి సిబ్బందితోపాటు అక్కడ ఉన్న అందరినీ పలుకరిస్తూ వైఎస్‌ జగన్‌ ముందుకు కదిలారు.   

కార్యకర్తలతో మమేకం..
రెండు రోజుల పర్యటన నిమిత్తం పులివెందులకు వచ్చిన వైఎస్‌ జగన్‌ తొలిరోజు మంగళవారం కార్యకర్తలు, నాయకులతో క్యాంపు కార్యాలయంలో మమేకమయ్యారు. బుధవారం వైఎస్‌ రాజారెడ్డి, ఎల్వీ ప్రసాద్‌ నేత్ర వైద్యశాలను ప్రారంభించారు. అనంతరం బయట వేలాదిగా వేచి ఉన్న మహిళలు, అభిమానులకు అభివాదం చేశారు. తెలిసినవారు కావడంతో పలువురిని పేరు పేరునా ఆప్యాయంగా పలుకరించారు.


కంటి పరీక్షలు చేయించుకున్న వైఎస్‌ జగన్‌  
వైఎస్‌ రాజారెడ్డి ఐ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం వైఎస్‌ జగన్‌ అక్కడ కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఎల్వీ ప్రసాద్‌ కంటి వైద్య నిపుణులు ఆయనకు పరీక్షలు చేశారు. ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని వారిని వైఎస్‌ జగన్‌ కోరారు. ఆసుపత్రికి సంబంధించి ఎలాంటి అవసరం ఉన్నా వెంటనే తీర్చాలని వైఎస్సార్‌ ఫౌండేషన్‌ ప్రతినిధి జనార్థన్‌రెడ్డికి సూచించారు.


‘‘రాజారెడ్డి ఐ సెంటర్‌..’’ నాన్న జ్ఞాపకాలను తిరిగి తెస్తోంది
వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ 
సాక్షి, అమరావతి: పులివెందులలో ‘‘ఎల్‌వీపీఈఐ’’ సహకారంతో అత్యాధునిక సౌకర్యాలతో రాజారెడ్డి కంటి ఆస్పత్రిని ప్రారంభించడం గర్వంగా ఉందని మాజీ సీఎం, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘‘ఈ క్షణం.. అదే ఆస్పత్రికి చెందిన ప్రఖ్యాత వైద్యుడు, మా నాన్న జ్ఞాపకాలను తిరిగి తెస్తోంది. పులివెందులలో కొన్ని దశాబ్దాలుగా రాజారెడ్డి ఆస్పత్రి సేవలు అందిస్తోంది. 

దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఈ ఆస్పత్రిలోనే పని చేసి రూపాయి వైద్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఆస్పత్రిని ఇప్పుడు అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దారు. అత్యాధునిక సౌకర్యాలతో ఇక నుంచి రాజారెడ్డి ఆస్పత్రి కంటి వైద్య సేవలు అందించనుంది’’ అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Andhra Pradesh
Eye hospital
YS Jagan Mohan Reddy
Pulivendula
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.