సాక్షి, వైఎస్సార్: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులలో పర్యటిస్తున్నారు. ఆయనకు వరుసకు పెదనాన్న అయ్యే వైఎస్ ఆనంద్‌రెడ్డి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పార్థీవదేహానికి వైఎస్ జగన్ దంపతులు నివాళులర్పించారు.
కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సొంత పెదనాన్న అయిన వైఎస్ ఆనంద్‌రెడ్డి (87) గురువారం వృద్ధాప్య సంబంధిత సమస్యలతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో పులివెందుల వెళ్లిన వైఎస్ జగన్ దంపతులు.. ఆనంద్‌రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
వైఎస్ ఆనంద్‌రెడ్డికి నివాళులర్పించేందుకు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు నివాళులర్పించేందుకు వస్తున్నారు. కుటుంబ సభ్యులు వైఎస్ ప్రకాష్‌రెడ్డి, వైఎస్ ప్రతాప్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్ మధురెడ్డి, ఆనంద్‌రెడ్డి కుమారుడు వైఎస్ రాజేష్‌రెడ్డి, కుమార్తెలు సాధన, సునీత తదితరులు ఆయన భౌతికకాయం వద్ద ఇదివరకే నివాళులర్పించారు.

సమాధుల తోటలో అంత్యక్రియలు
వైఎస్ ఆనంద్‌రెడ్డి అంత్యక్రియలను మరికాసేపట్లో పులివెందుల డిగ్రీ కళాశాల రోడ్డులోని వైఎస్ కుటుంబ సభ్యుల సమాధుల తోటలో నిర్వహించనున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, పార్టీ నేతల సమక్షంలో అంత్యక్రియలు జరగనున్నాయి.