Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. ‘మూడ్స్‌’ అంటే మోజా..!
ADVERTISEMENT 

‘మూడ్స్‌’ అంటే మోజా..!

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Aug 25, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
faid.jpg

చిన్నారుల ఆరోగ్యంతో కూటమి సర్కారు చెలగాటం..!

అంగన్‌వాడీ సెంటర్లకు ‘మెడికల్‌ కిట్స్‌’లో నామినేషన్‌ కిటుకు 

కేరళ కండోమ్‌ తయారీ కంపెనీకి రూ.7.31 కోట్ల వర్క్‌ ఆర్డర్‌ 

డైరెక్టర్‌ ముస్సోరి శిక్షణకు వెళ్లడమే అదనుగా నిబంధనలకు తూట్లు  

ప్రభుత్వ పెద్దల డైరెక్షన్‌లో చక్రం తిప్పిన కీలక అధికారి 

టెండర్‌ లేకుండా ఆగమేఘాలపై నామినేషన్‌ పద్ధతికి కుదిరిన డీల్‌ 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కూటమి సర్కారు అభంశుభం తెలియని చిన్నారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతోంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో అందించే ఎమర్జెన్సీ మెడికల్‌ కిట్ల పంపిణీలోనూ చేతివాటం ప్రదర్శించింది. 2025–26 సంవత్సరానికి టెండర్‌ పిలవకుండానే నిబంధనలకు విరుద్ధంగా రూ.7,31,54,361 విలువైన వర్క్‌ ఆర్డర్‌ను నామినేషన్‌ పద్ధతిపై అప్పగించేసింది. 

కేరళకు చెందిన మూడ్స్‌ కండోమ్స్‌ తదితర వస్తువుల తయారీ కంపెనీకి అడ్డగోలుగా నామినేషన్‌పై అప్పగించడంలో తెరవెనుక డీల్‌ కుదిరింది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని 257 ఇంటిగ్రేటెడ్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ సర్వీసెస్‌(ఐసీడీఎస్‌) ప్రాజెక్ట్‌ల పరిధిలో 55,746 అంగన్‌వాడీ సెంటర్‌లలో ఉండే చిన్నారుల ప్రాథమిక వైద్యం (ఫస్ట్‌ ఎయిడ్‌) కోసం అందించే మెడికల్‌ కిట్లలోనూ కక్కుర్తి పడటం అత్యంత దారుణమని అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. 

నిబంధనలకు పాతర..  
వాస్తవానికి వైద్యపరంగా అత్యవసరమైతేనే నామినేషన్‌ పద్ధతిలో వర్క్‌ ఆర్డర్‌ ఇస్తారు.  సాధారణ సందర్భాల్లో రూ.లక్ష వర్క్‌ ఆర్డర్‌ ఇవ్వాలన్నా టెండర్‌ పిలవాలనే నిబంధన ఉంది. అందుకు విరుద్ధంగా రూ.7.31 కోట్ల విలువైన మెడికల్‌ కిట్ల సరఫరాకు నామినేషన్‌ పద్ధతిపై ఈ నెల 5న వర్క్‌ ఆర్డర్‌ ఇవ్వడం వెనుక ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందనేది తేటతెల్లమవుతోంది. 

అది కూడా అందుబాటులో ఉన్న పెరెన్నికగన్న కంపెనీలను కాదని ఎక్కడో కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురానికి చెందిన హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌ లిమిటెడ్‌ కంపెనీకి నామినేషన్‌ పద్ధతిపై అప్పగించడం గమనార్హం. ఆ కంపెనీ మూడ్స్‌ కండోమ్స్, గర్భ నిరోధక, రుతుక్రమం పరిశుభ్రత వస్తువులు, సర్జికల్‌ వస్తువులు వంటి వాటిని ఉత్పత్తి చేస్తోంది. 

పొరుగు రాష్ట్రానికి చెందిన కంపెనీకి నామినేషన్‌ పద్ధతిపై వర్క్‌ ఆర్డర్‌ అప్పగించడంతో 10శాతం బ్యాంక్‌ గ్యారంటీ చెల్లింపు, సక్రమంగా మెడికల్‌ కిట్‌ల పంపిణీలో ఎంత మేరకు బాధ్యత ఉంటుందన్నది అనుమానమే. దీనికితోడు నిజంగా కేరళ నుంచి మెడికల్‌ కిట్‌లు కొనుగోలు చేసి ఏపీకి అందిస్తే స్థానికంగా మన రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీని కూడా నష్టపోవాల్సి వస్తుంది.  ఒక్కో మెడికల్‌ కిట్‌ ధర రూ.1312.25 చొప్పున నిర్ణయించగా స్థానిక మార్కెట్‌లో దానిలో కనీసం 30 శాతం నుంచి 40 శాతం తక్కువ ధరకు లభిస్తుందని చెబుతున్నారు. 

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా.. 
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అంగన్‌వాడీ కేంద్రాలకు మెడికల్‌ కిట్‌ల పంపిణీ నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(ఏపీఎంఎస్‌ఐడీసీ) టెండర్‌ పిలిచి అపోలో, మెడ్‌ప్లస్, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ వంటి ప్రముఖ కంపెనీల ద్వారా మెడికల్‌ కిట్‌లు సరఫరా చేసేవారు. అందుకు భిన్నంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం నామినేషన్‌ పద్ధతిపై కేరళ కంపెనీకి కట్టబెట్టడం శోచనీయం.   

ప్రభుత్వ పెద్దల డైరెక్షన్‌లో చక్రం తిప్పిన అధికారి.. 
రూ.7.31 కోట్లకుపైగా వర్క్‌ ఆర్డర్‌ను నామినేషన్‌ పద్ధతిపై కట్టబెట్టిన తంతులో ప్రభుత్వ పెద్దల డైరెక్షన్‌లో కీలక అధికారి ఒకరు చక్రం తిప్పినట్టు తెల్సింది. గత టీడీపీ పాలనలో మంత్రి లోకేశ్‌ కోసం విజయవాడ కనకదుర్గ ఆలయంలో క్షుద్ర పూజలు జరిపించారన్న విమర్శలు ఎదుర్కొన్న అధికారి ఒకరు ఈ వ్యవహారాన్ని చక్కబెట్టినట్టు సమాచారం. 

వాస్తవానికి ఈ ఏడాది జూన్‌లోనే అంగన్‌వాడీ కేంద్రాలకు మెడికల్‌ కిట్‌ల పంపిణీ ప్రతిపాదన వచ్చింది. అంత పెద్ద మొత్తంలో నామినేషన్‌ పద్ధతిలో ఇవ్వడం సరికాదని, టెండర్‌ పిలవాల్సిందేనని ఐసీడీఎస్‌ డైరెక్టర్‌ తేల్చి చెప్పినట్టు తెలిసింది. కొరకరాని కొయ్యగా మారిన ఆయన ఇటీవల నెల రోజులపాటు ముస్సోరీ శిక్షణకు వెళ్లారు. అదే అదనుగా కీలక అధికారి ఒకరు ఈ డీల్‌ సెట్‌ చేసినట్టు విశ్వసనీయంగా తెల్సింది. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Medical
kits
Anganwadi centre
Andhra Pradesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.