Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. మూగ వేదన.. అరణ్య రోదన!
ADVERTISEMENT 

మూగ వేదన.. అరణ్య రోదన!

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time May 2, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
nallamala.jpg

నల్లమలలో వన్యప్రాణులు విలవిల

అడవిలో నీటి చుక్క కరువు.. ఎండిన కుంటలు, వాగులు

నీటి తొట్టెలు  నిర్మించినా అరకొర నీరే!

జనావాస ప్రాంతాలకు వస్తున్న వన్యప్రాణులు 

చోద్యం చూస్తున్న అటవీ అధికారులు

ఆళ్లగడ్డ: మండే ఎండలతో ప్రజలే దాహంతో అల్లాడుతున్నారు. నల్లమల అడవిలో వన్యప్రాణులదీ ఇదే పరిస్థితి. అటవీ ప్రాంతంలో నీటి నిల్వలు తగ్గడంతో జనావాస ప్రాంతాలకు వస్తూ ప్రాణాలను కోల్పోతున్నాయి. వేసవిలో సాసర్‌ పిట్లు( నీటి తొట్టెలను) నింపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో అమలు కావటం లేదు.  

నల్లమలలో జంతువులు ఇవీ.. 
దేశంలోనే అతి పెద్ద అభయారణ్యం నల్లమల. ఇక్కడ ఎన్నో రకాల వన్యప్రాణులు ఉన్నాయి. నంద్యాల జిల్లాలో అటవీ భూభాగం 1.60 లక్షల హెక్టార్లలో ఉంది. గుండ్లబ్రహ్మేశ్వరం, బండిఆత్మకూరు, నంద్యాల, చెలమ, రుద్రవరం, ఆత్మకూరు, బైర్లూటి, నాగలూటి, శ్రీశైలం, వెలుగోడు అటవీ రేంజ్‌లు ఉన్నాయి. వీటి పరిధిలో 65 బీట్లు, 44 సెక్షన్లు ఉన్నాయి. అడవిలో చిరుతలు, పెద్దపులులు, ఎలుగుబంట్లు ఎక్కువగా ఉన్నాయి. 

అలాగే రేసు కుక్కలు, అడవి పిల్లులు, చుక్కల దుప్పులు, అడవి పందులు, కృష్ణ జింకలు, కుందేళ్లు, అడవి గొర్రెలు, నక్కలు కనిపిస్తాయి. బట్టమేక, అడవికోళ్లు, నెమళ్లతో పాటు వందలాది పక్షి జాతులకు నల్లమల ఆవాసం. వర్షాభావం వెంటాడటం, ఎండ తీవ్రత పెరగడంతో కుంటలు, వాగులు ఎండిపోయాయి. జలవనరుల్లో నీటి జాడ కనుమరుగైంది. అడవిలో చాలా చోట్ల తేమ సైతం ఆవిరైంది. ఇదే వన్యప్రాణుల పాలిట శాపమవుతోంది. 

సాసర్లు నింపరు! 
నాగార్జునసాగర్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిధిలో వన్యప్రాణుల దాహం తీర్చేందుకు 450కి పైగా సాసర్‌ పిట్లు ఏర్పాటు చేశారు. ఏటా ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు 5 నెలలు నిరంతరం పర్యవేక్షిస్తూ సాసర్‌ పిట్లలో నీరు నింపాల్సి ఉంది. అయితే ఈ ఏడాది నిధుల కొరతతో చాలాకాలంగా నీరు నింపడంలేదన్నట్లు తెలుస్తోంది. 

కొందరు క్షేత్ర స్థాయి అధికారులు అడపాదడపా అక్కడక్కడా దాతల సాయంతో, సొంతంగా ఖర్చు చేసుకొని వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో దప్పిక తీరడంలేదు. అనేక చోట్ల సాసర్‌ పిట్‌లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. చెత్తాచెదారంతో నిండిపోయి ఉన్నాయి. 

ఇలా చేస్తే ఎంతో మేలు.. 
బండిఆత్మకూరు, చెలమ, రుద్రవరం రేంజ్‌ పరిధిలో సాసర్‌ పిట్లకు ప్రతి రోజూ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలి. కొన్ని ప్రాంతాల్లో చెలమలను తవ్వి మూగజీవాలకు నీటి సౌకర్యాన్ని అందించాలి. అదేవిధంగా చెక్‌ డ్యామ్స్‌ ఏర్పాటు చేసి వాటి వద్ద నీటి నిల్వలను ఉంచాలి. సాసర్‌ పిట్ల వద్దకు నీటి కోసం వచ్చిన జంతువుల కోసం ఉప్పు ముద్దలను ఏర్పాటు చేయాలి. మూగ జంతువులు ఉప్పు ముద్దను నాకడంతో వడదెబ్బ బారి నుంచి కాపాడుకునే అవకాశం ఉంది.

నీటి కోసం వచ్చి.. ప్రాణాలు విడిచి
అడవిలో నీటి వనరులు ఎండిపోవడం, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాసర్‌ పిట్లలో నీరు నింపకపోవడంతో మూగ జీవాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఈ సమయంలో వాహనాలు ఢీకొని ప్రాణాలు వదులుతున్నాయి. అలాగే విద్యుదాఘాతానికి గురై, వేటగాళ్ల ఉచ్చులో చిక్కి మృత్యువాత పడుతున్నాయి.

» ఈ మధ్య కాలంలో నీటికోసం వస్తున్న మూగజీవాలను వేటగాళ్లు నీటిలో విషపు గుళికలు వేసి చంపేస్తున్నారు.  
» రుద్రవరం, చెలమ అటవీ రేంజ్‌ల పరిధిలో వేటగాళ్లు పెట్రేగి పోతున్నారు. ఉచ్చులు వేసి వణ్యప్రాణులను వేటాడి వాటి మాంసాన్ని, శరీర భాగాలను విక్రయిస్తున్నారు. 
» ఇటీవల పెద్దకంబలూరు సమీపంలో వేటగాళ్లు వేసిన ఉచ్చులో చిక్కుకుని పెద్దపులి మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది.  
» మూడు నెలల క్రితం అహోబిలం సమీపంలో కారుపై  పెద్దపులి దాడి చేసింది. ఆ  సమయంలో గాయాలై అడవిలోకి వెళ్లి పోయింది.   
» ఈ నెల 6వ తేదీ రుద్రవరంలో ఇద్దరు వ్యక్తులు వన్యప్రాణుల మాంసం విక్రయిస్తుండగా అట వీ అధికారులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. 
» 2019లో బాచిపల్లె తండా సమీపంలో పెద్దపులి కళేబరం కనిపించింది. అదే సంవత్స రం ఓ పెద్ద పులి మిట్టపల్లె సమీపంలోని ఎర్రచెరువు కాల్వలో మృతి చెంది కనిపించింది.  
» గండ్లేరు రిజర్వాయరులో వేర్వేరు సంఘటనల్లో రెండు చిరుత కళేబరాలు కనిపించాయి.  


» 2018లో బాచిపల్లె తండా, అహోబిలం మధ్యన రెండు ఎలుగుబంట్ల కళేబరాలు కనిపించాయి.   
» ఆళ్లగడ్డ సమీపంలో కృష్ణజింక వేటకు బలైంది.  
» రుద్రవరం సమీపంలో ఐదు నెమళ్లు వేటగాళ్ల ఉచ్చుకు బలయ్యాయి. 
» గాజులపల్లి – బొగద మధ్య రైలు పట్టాలపై రెండు చిరుత పులులు మృతి చెందాయి. 


చర్యలు తీసుకుంటాం 
సాసర్‌ పిట్లలో నీరు నింపుతున్నాం. ఎక్కడైనా నీరు లేదంటే సిబ్బంది చూడక పోవడమో,  మరచిపోవడమో ఉంటుంది. వెంటనే నీటిని నింపేలా చర్యలు తీసుకుంటాం.  – శ్రీపతి నాయుడు, రుద్రవరం అటవీ రేంజ్‌ అధికారి  

కుంటలు ఎండిపోయాయి 
అహోబిలం అటవీ పరిధిలో చెరువులు, కుంటలు పూర్తిగా ఎండిపోయాయి. వన్యప్రాణులు నీటి కోసం పొలాల్లోకి, గ్రామాల్లోకి వస్తున్నాయి. అవి దాడి చేస్తాయోనని ప్రజలు భయపడుతున్నారు.   – నాసారి వెంకటేశ్వర్లు, ఏకలవ్య ఎరుకలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు  

అందరి బాధ్యత 
నల్లమల అభయారణ్యం రాయలసీమకు మాణిక్యం లాంటింది. అందులోని వన్యప్రాణులను కాపాడుకోవల్సిన బాధ్యత అందరిపై ఉంది. సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి మూగజీవాల దాహార్తి తీర్చేందుకు ఏర్పాట్లు చేయాలి. – గజ్జల రాఘవేంద్రారెడ్డి, ఎంపీపీ   

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Wildlife animals
summer
drinking water
Andhra Pradesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.