Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. 1 నుంచి పులుల గణన
ADVERTISEMENT 

1 నుంచి పులుల గణన

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Nov 29, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
tiger.jpg

1, 2, 3 తేదీల్లో మాంసాహార, 6, 7, 8 తేదీల్లో శాకాహార వన్యప్రాణుల గుర్తింపు

ప్రత్యక్షంగా చూసి నమోదు 

జనవరి 1 నుంచి కెమెరా ట్రాప్‌ల ఏర్పాటు 

అనంతరం పులుల సంఖ్య ప్రకటన

పెద్దదోర్నాల: రాష్ట్రంలో డిసెంబర్‌ 1వ తేదీ నుంచి వన్యప్రాణులను లెక్కించనున్నారు. 1, 2, 3 తేదీల్లో మాంసాహార జంతువులైన పెద్దపులి, చిరుతపులి, ఎలుగుబంట్లు, రేచుకుక్కలు, అడవిపిల్లులను, 6, 7, 8 తేదీల్లో గడ్డి జాతులను తిని బతికే దుప్పులు, సాంబార్, జింకలు, కుందేళ్లు తదితర శాకాహార వన్యప్రాణులను ప్రత్యక్షంగా చూసి నమోదు చేయనున్నారు. 

వన్యప్రాణుల లెక్కింపు అయినా.. ప్రధానంగా పెద్దపులుల సంఖ్య ఎంత అనేది కీలకం. ఎందుకంటే అడవిలో పెద్దపులి సంచరిస్తుంటే ఆ అడవి సమతుల్యంగా ఉంటుంది. రాష్ట్రంలో పులుల సంతతి పెరిగేందుకు నల్లమల అడవి ఒక రక్షణ ఛత్రంగా మారింది. నల్లమలలో పులుల సంతతి గణనీయంగా పెరుగుతోంది. 

ఈ క్రమంలోనే రాజీవ్‌గాంధీ పులుల అభయారణ్యంగా ఏర్పాటైన నల్లమల పులుల అభయారణ్యం.. ప్రస్తుతం నాగార్జున సాగర్‌–శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌గా ఉంది. దేశవ్యాప్తంగా నాలుగేళ్లకు ఒకసారి పులుల సంఖ్యను లెక్కిస్తారు. ఆలిండియా టైగర్‌ ఎస్టిమేషన్‌లో భాగంగా మన రాష్ట్రంలో అటవీశాఖ అధికారులు శాస్త్రీయంగా వీటిని లెక్కించనున్నారు. 

సాంకేతిక పరిజ్ఞానంతో పెద్దపులుల సర్వే 
1వ తేదీ నుంచి అడవిలో మాంసాహార, శాకాహార జంతువుల్ని ప్రత్యక్షంగా చూసి నమోదు చేయనున్నట్లు ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల అటవీ రేంజి అధికారి హరి తెలిపారు. నల్లమల అభయారణ్యంలోని ప్రతి బీట్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని చెప్పారు. పులుల గణనలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నామన్నారు. గతంలో పులులు, చిరుతలు, ఇతర వన్యప్రాణులను వాటి పాదముద్రల ఆధారంగా లెక్కించేవారు. 

అయితే, అవి అరణ్యంలోని పలు ప్రాంతాల్లో సంచరిస్తుండటంతో కచ్చితమైన సంఖ్య తేలేది కాదు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. పులి సంచారం ఉన్న ప్రాంతాల్లో కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేస్తున్నారు. వీటి నుంచి వెలువడే ఆల్ఫ్రారెడ్‌ బీమ్‌ పరిధిలోకి జంతువు రాగానే కెమెరా చిత్రీకరిస్తుంది. 15 క్షణాల్లో మళ్లీ కెమెరా సిద్ధమవుతుంది. 

చిత్రాల్లో పులి శరీరంపై చారికల ఆధారంగా లెక్కింపు చేపడతారు. దీంతోపాటు కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఎకోలాజికల్‌ యాప్‌ను ఉపయోగించి ఆండ్రాయిడ్‌ ఫోన్‌ల ద్వారా వన్యప్రాణుల వివరాలను సేకరిస్తారు. నూతన శాస్త్రీయ పరిజ్జానంతో పాటు, పులుల పాదముద్రలు, మలము, చెట్ల మొదళ్లపై పులుల గోళ్ల రక్కుల ఆనవాళ్లను సైతం పరిగణలోకి తీసుకుని పులుల గణనను పకడ్బందీగా నిర్వహిస్తారు. 

ఇందుకోసం సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. జనవరి 1వ తేదీ నుంచి నల్లమల అభయారణ్యంలోని దట్టమైన ప్రాంతాల్లో ట్రాప్‌ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిలో నిక్షిప్తమైన పులుల చారికల ఆధారంగా పూర్తిస్థాయి సమాచారాన్ని క్రోడీకరించి పులుల సంఖ్యను ప్రకటిస్తారు.

పులుల సంఖ్య పెరిగేందుకు చర్యలు
దేశంలో పులుల సంతతి పెరిగేలా అధికారులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. వాటికి ఆహారంగా ఉపయోగపడే జింకలు, దుప్పులు, అడవిపందుల పెరుగుదలకు అనుకూల ఆవాసం కల్పించేందుకు నిరంతర కృషిచేస్తున్నారు. అడవిలోని నిషిద్ధ ప్రాంతాల్లోకి జనం వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. పెద్దపులి చాలావరకు మాటేసి ఆహారాన్వేషణ చేస్తుంది. 

పొదల్లో దాక్కుని, నీటి వనరులున్న ప్రాంతాల్లో నీరు తాగేందుకు వచ్చే జంతువులను మాటేసి పట్టుకుంటుంది. అడవుల్లో నివసించే పులి జీవితకాలం 10–15 ఏళ్లు మాత్రమే. సంరక్షణ కేంద్రాల్లో ఇవి 20 ఏళ్ల వరకు జీవిస్తాయి. పులి సంతానోత్పత్తి కాలం 93 నుంచి 112 రోజులు. సాధారణంగా నవంబర్‌–ఏప్రిల్‌ మధ్య వీటి సంతానోత్పత్తికి అనుకూలం. 

ఆడపులి కలయికకు కొన్ని రోజులు మాత్రమే అనుకూలంగా ఉంటుంది. ఒక కాన్పులో 3–4 పిల్లలను కంటాయి. పిల్లల సంరక్షణ సాధారణంగా ఆడపులే చూస్తుంది. వీటిలో మరణాల రేటు కూడా అధికంగానే ఉంటుంది. పులిచర్మం, దంతాలు, ఎముకలు, వెంట్రుకలకు గిరాకీ ఉండటంతో వేటగాళ్ల బారిన పడుతుంటాయి. వాటి తగ్గుదలకు ఇది ఓ ప్రధాన కారణం.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Andhra Pradesh
Wildlife
Nallamala
Forest Department
Tiger
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.