Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. ప్రపంచదేశాలకు ‘చెత్త’ సవాల్‌.. ఆకాశం కూడా ఆగమాగం.. ఏంటీ పరిస్థితి?
ADVERTISEMENT 

ప్రపంచదేశాలకు ‘చెత్త’ సవాల్‌.. ఆకాశం కూడా ఆగమాగం.. ఏంటీ పరిస్థితి?

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Jan 28, 2023 Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
space.jpg

భూగోళాన్ని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి ‘చెత్త’. నానాటికీ పెరుగుతున్న వ్యర్థాలను వదిలించుకునేందుకు చాలా దేశాలు పెద్ద కసరత్తే చేస్తున్నాయి. కాగా.. ఇదే సందర్భంలో అంతరిక్షంలోనూ పేరుకుపోతున్న చెత్త వివిధ దేశాలకు సవాల్‌ విసురుతోంది. ప్రస్తుతం రోదసీలో 3,409 శాటిలైట్లు చెత్తగా మారిపోయాయి. ఇవికాకుండా దాదాపు 34 వేల స్పేస్‌ జంక్‌ ముక్కలు, మిలియన్ల కొద్దీ చిన్నపాటి ముక్కలు అంతరిక్షాన్ని కమ్మేశాయి. 2030 నాటికి రోదసీలో ఉండే శాటిలైట్ల సంఖ్య 58 వేలకు దాటిపోవచ్చని అంచనా. దీనివల్ల గగనతలం భవిష్యత్‌లో పెద్ద ముప్పునే ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.  

– సాక్షి, అమరావతి

అంతరిక్ష ప్రయోగాలు మానవాళి చరిత్రను  సమూలంగా మార్చేశాయి. ఉపగ్రహాల (శాటిలై­ట్స్‌) వినియోగంతో టీవీ, ఫోన్, ఇంటర్నెట్, జీపీఎస్‌ తదితర సేవలతో పాటు ఎప్పటికప్పుడు వాతా­వ­రణంలో వచ్చే మార్పులను ముందే పసిగట్టి జాగ్ర­త్తలు తీసుకుంటున్నాం. ఒక్క క్లిక్‌తో సమస్త సమా­చారాన్ని అరచేతిలో చూడగలుగుతున్నాం. ఇదంతా శాటిలైట్స్‌ వల్లే సాధ్యమైంది. సోవియట్‌ యూనియన్‌ 1957 అక్టోబర్‌ 4న స్పుతి్నక్‌ శాటిలైట్‌ ప్రయోగంతో అంతరిక్ష యుగం మొదలైంది.

వివిధ దేశాల ఆధ్వర్యంలో మాత్రమే శాటిలైట్‌ ప్రయోగా­లు కొనసాగగా.. ఇటీవల ప్రైవేట్‌ కంపెనీలు సైతం ఈ రంగంలోకి ప్రవేశించాయి. ఐక్యరాజ్య సమితి ఔ టర్‌ స్పేస్‌ అఫైర్స్‌ విభాగం లెక్కల ప్రకారం 2022 జన­వరి నాటికి భూమి చుట్టూ 8,261 ఉపగ్రహాలు తిరుగుతున్నాయి. ‘ఆర్యభట్ట’. 1975 ఏప్రిల్‌ 19న ఆర్య­భట్టతో మొదలుపెట్టిన భారత్‌ ఇప్పటివరకు సుమా­రు 180 శాటిలైట్స్‌ను అంతరిక్షంలోకి పంపించిం­ది.

ఇవికాక సుమారు 38 దేశాలకు చెందిన 350­కి పైగా శాటిలైట్లను అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. మనదేశ శాటిలైట్లలో 40 వరకు సేవలందిస్తుండగా.. మిగిలినవి విశ్వంలో నిరుపయోగంగా ఉన్నాయి.  

నాణేనికి రెండో వైపు.. 

ప్రపంచ దేశాలు పోటీపడి మరీ పంపిస్తున్న శాటిలైట్లతో అంతరిక్షంలో ట్రాఫిక్‌ పెరిగిపోతోంది. కాలం చెల్లిన శాటిలైట్లు, రాకెట్ల శిథిలాలతో గగనతలం చెత్తకుప్పగా మారిపోతోంది. యూనియన్‌ ఆఫ్‌ కన్సర్న్‌డ్‌ సైంటిస్ట్స్‌ (యూసీఎస్‌) లెక్కల ప్రకారం స్పేస్‌లో ఉన్న మొత్తం 8,261 శాటిలైట్లలో ప్రస్తుతం 4,852 మాత్రమే సేవలందిస్తున్నాయి. మిగిలిన 3,409 శాటిలైట్లు నిరుపయోగమై వ్యర్థాలుగా మారిపోయాయి.

ఇవికాకుండా రాకెట్ల నుంచి రాలిపడిన దాదాపు 34 వేల స్పేస్‌ జంక్‌ ముక్కలు (10 సెం.మీ కంటే పెద్దవి), మిలియన్ల కొద్దీ చిన్న ముక్కలు అంతరిక్షం చుట్టూ పేరుకుపోయాయి. ఇటీవల అమెజాన్, స్పేస్‌–ఎక్స్‌ వంటి ప్రైవేట్‌ కంపెనీలు అంతరిక్షంలోకి అడుగుపెట్టి శాటిలైట్ల ప్రయోగాలు చేసేందుకు పోటీ పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల వల్ల 2030 నాటికి రోదసీలో శాటిలైట్ల సంఖ్య 58 వేలకు పైగా దాటిపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే అంతరిక్షంలో స్పేస్‌ ట్రాఫిక్‌ పెరిగిపోవడంతోపాటు డెబ్రిస్‌ (చెత్త)తో నిండిపోతుందని అంచనా. 

పెనుసవాల్‌.. స్పేస్‌ జంక్‌

అంతరిక్షంలో ఉపగ్రహాలు తిరిగే వృత్తాకార మార్గా­న్ని కక్ష్య (ఆర్బిట్‌) అంటారు. శాటిలైట్స్‌ను మూడు రకాల ఆర్బిట్స్‌లో ఉంచుతారు. ఇవి భూమి నుంచి 300కి.మీ. వరకు లోయర్‌ ఆర్బిట్, 700–1,000 కి.మీ వరకు రిమోట్‌ సెన్సింగ్‌ శాటిలైట్‌ ఆర్బిట్స్, 36 వేల కి.మీ. జియో సింక్రనస్‌ ఆర్బి­ట్‌ (కమ్యూనికేషన్‌ శాటిలైట్స్‌) ఉంటాయి. ఏటా వందల సంఖ్య­లో శాటిలైట్లను కక్ష్యల్లోకి పంపుతుండటంతో వాటి మధ్య దూరం తగ్గిపోయి స్పేస్‌ ట్రాఫిక్‌ ఏర్పడుతోంది.

దీంతో కొత్త ఉపగ్రహాలను పంపేటప్పుడు ఇ­బ్బం­దులు ఏర్పడుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించా­రు. అంతరిక్షంలో రాకెట్‌ పరికరాల శిథిలాలను స్పేస్‌ డెబ్రిస్‌ అంటారు. ఎక్కువ అంతరిక్ష శిథిలాలు 600–700 కి.మీ. పరిధిలోనే ఉన్నాయి. సాఫ్ట్‌బాల్‌ పరిమాణంలో 34 వేల స్పేస్‌ డెబ్రిస్‌ శిథిలాలు ఉ­న్నా­యని, ఒక మిల్లీమీటర్‌ కంటే పెద్ద పరిమాణంలో 128 మిలియన్ల శిథిలాలు ఉన్నాయని నాసా ప్రకటిం­చింది.

ప్రతి 10 వేల శిథిలాలలో ఒకటి ప్రమా­దా­­­నికి కారణమవుతుందని అంచనా వేసింది. ఇ­లాం­­టి శిథిలాలు 1999 నుంచి ఇప్పటిదాకా 25 ఐఎస్‌ఎస్‌ను తాకినట్టు స్పేస్‌ శాస్త్రవేత్తలు గుర్తించా­రు. మరోపక్క అంతరిక్ష వ్యర్థాలు విచ్ఛిన్నమై రేణువుల్లా విడిపోయి అంతరిక్ష కక్ష్యను కలుíÙతం చేస్తున్నాయి. ఈ వ్యర్థ రేణువుల్లో కొన్ని గంటకు 40 వేల కి.మీ. వేగంతో భూకక్ష్య వైపు దూసుకొస్తున్నాయి.  

శిథిలాల తొలగింపునకు అంతర్జాతీయ కమిటీ  

వాస్తవానికి అంతరిక్ష వ్యర్థాల్లో మూడింటి ఒక భాగం అమెరికా, రష్యాలవే. వేల కి.మీ. వేగంతో తిరుగుతున్న డెడ్‌ శాటిలైట్లు, రాకెట్‌ శిథిలాలను తొలగించడం కత్తిమీద సాములా మారింది. దీంతో అమెరికా వివిధ దేశాల స్పేస్‌ శాస్త్రవేత్తలతో 1993లో ఇంటర్‌ ఏజెన్సీ స్పేస్‌ డెబ్రిస్‌ కో–ఆర్డినేషన్‌ కమిటీని నియమించింది. ఐక్యరాజ్య సమితి 1959లోనే ‘ఔటర్‌ స్పేస్‌ శాంతియుత ఉపయోగాల కమిటీ’ (యూఎన్‌–సీఓపీయూఓఎస్‌)ని నియమించింది.

ఈ రెండు కమిటీల్లోనూ భారత్‌ ప్రారంభ సభ్యదేశంగా ఉంది. ఈ కమిటీల్లోని శాస్త్రవేత్తలు అంతరిక్ష శిథిలాల తొలగింపుపై ఓ నివేదికను రూపొందించాయి. దీనిప్రకారం అధునాతన రాడార్లు, టెలిస్కోపులను ఉపయోగించి అంతరిక్ష వ్యర్థాలను పసిగట్టి ముందస్తు హెచ్చరికలు చేస్తుంటారు. కాలం చెల్లిన శాటిలైట్లను కక్ష్య నుంచి తప్పించి భూ వాతావరణంలోకి తెచ్చే యోచన జరుగుతోంది. స్పేస్‌ డెబ్రిస్‌ను తొలగించే యంత్రాంగం ప్రస్తుతం ప్రపంచంలో ఏ దేశం వద్దా లేదు. 

– ఎంవైఎస్‌ ప్రసాద్, మాజీ డైరెక్టర్, షార్‌ 

‘నాసా’ ట్రాక్‌ చేస్తోంది 

స్పేస్‌లోకి వెళ్లిన ప్రతి వస్తువుకు పొజిషనింగ్‌ నంబర్‌ ఇచ్చి వాటి కదలికలను అనుక్షణం ‘నాసా’ ట్రాక్‌ చేస్తోంది. దీనినే స్పేస్‌ సర్వేలెన్స్‌ నెట్‌వర్క్‌ ట్రాకింగ్‌ అంటారు. నాసా అంచనా ప్రకారం ప్రతిరోజూ ఒక శిథిలం భూమి వైపు దూసుకొస్తోంది. అది నేలపై పడటమో లేదా వాతావరణంలోకి ప్రవేశించగానే మండిపోవడమో జరుగుతోంది. రాబోయే సంవత్సరాల్లో అంతరిక్ష శిథిలాల సంఖ్య లక్షకు పైగా పెరుగుతుందని, ఇవి ట్రాక్‌ చేయడానికి చిన్నవే అయినా అంతరిక్ష నౌకను దెబ్బతీసేంత పెద్దవని యూఎస్‌ మిలటరీ సైతం ప్రకటించింది.

అంతరిక్ష యాత్రకు ప్రాణాంతకం లేదా విపత్తు కలిగించే వేల వస్తువులు, నష్టాన్ని కలిగించేంత సామర్థ్యం గలవి మిలియన్ల కొద్దీ ఉన్నాయని అంచనా వేసింది. జియో సింక్రనస్‌ ఆర్బిట్‌లో భారీ బరువుండే ఉప గ్రహాలుంటాయి. ఈ ఆర్బిట్‌లోని పనికిరాని శాటిలైట్లను పైస్థాయికి పంపేస్తారని.. ఇక్కడ డెబ్రిస్‌ని అంచనా వేయలేమని ‘షార్‌’ మాజీ డైరెక్టర్‌ ఎంవైఎస్‌ ప్రసాద్‌ చెప్పారు. అయితే, అధిక ‘డెడ్‌ శాటిలైట్లు’, శిథిలాలు 600–700 కి.మీ. పరిధిలోనే ఉన్నాయని, ఇవే ప్రధాన సమస్య అని ఆయన స్పష్టం చేశారు.   

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Debris
space junk
Satellites
Space experiments
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

అంతరిక్షంలో దాయాది దొంగ దెబ్బ.. భారత్‌కు సవాల్!

అంతరిక్షంలో దాయాది దొంగ దెబ్బ.. భారత్‌కు సవాల్!

మాల్దీవుల్లో తేలిన... ఇస్రో రాకెట్‌ శకలాలు! 

మాల్దీవుల్లో తేలిన... ఇస్రో రాకెట్‌ శకలాలు! 

దిద్దుబాటుకు 'ఇస్రో' ఉపక్రమించాలి!

దిద్దుబాటుకు 'ఇస్రో' ఉపక్రమించాలి!

అదే జరిగితే అంతరిక్షంలో చెత్తంతా మాయం!

అదే జరిగితే అంతరిక్షంలో చెత్తంతా మాయం!

శభాష్‌... ఇస్రో!

శభాష్‌... ఇస్రో!

అవే లేకపోతే జరిగేది ప్రళయమే.. ఎలా కాపాడుతున్నాయి?

అవే లేకపోతే జరిగేది ప్రళయమే.. ఎలా కాపాడుతున్నాయి?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.