వేసవి సెలవుల కారణంగా తిరుమలలో రద్దీ ఎక్కువవుతున్న సమయంలో సిఫారసు లేఖల బ్రేక్ దర్శనాలు 2025 మే 1 నుంచి 15 వరకు రద్దు చేస్తూ.. టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు తాజాగా సిఫారసు లేఖలతో బ్రేక్ దర్శనాలను కల్పించనున్నట్లు ప్రకటించింది. ఇది ఎల్లుండి (మే 15) నుంచి అమలులోకి రానుంది. తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు సిఫారసు లేఖలపై.. మే 15 (గురువారం) నుంచి మళ్ళీ వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పించనున్నట్లు దేవదాయశాఖ మంత్రి పేర్కొన్నారు.
ADVERTISEMENT
ADVERTISEMENT