సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజమండ్రి కల్తీ పాల బాధితులు ఇవాళ(మంగళవారం) కలిశారు. గత ఫిబ్రవరిలో కల్తీ పాలు తాగి తమ పిల్లలు అనారోగ్యానికి గురైన విషయాన్ని వైఎస్ జగన్కు తల్లిదండ్రులు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయమూ అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి మూడు రోజులు హడావుడి చేసి ఆపై పట్టించుకోవటం లేదని ఫిర్యాదు చేశారు. బాధితులకు అండగా నిలుస్తామని వైఎస్ జగన్ తెలిపారు.

ADVERTISEMENT
ADVERTISEMENT