Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. ఎన్‌కౌంటర్‌ చేస్తామని బెదిరించారు
ADVERTISEMENT 

ఎన్‌కౌంటర్‌ చేస్తామని బెదిరించారు

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Nov 13, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ncounter.jpg

మేజిస్ట్రేట్ ఎదుట పోలీసులపై సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ వర్రా రవీంద్రారెడ్డి వాంగ్మూలం 

చెప్పినట్టు వినకపోతే భార్య, కుమార్తెను అథోగతి పాల్జేస్తామన్నారు 

విజయమ్మ, షరి్మల, సునీతకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టించింది ఎంపీ అవినాష్ రెడ్డి, రాఘవరెడ్డి అని చెప్పమంటూ భయపెట్టారు  

కడప అర్బన్‌: తాము చెప్పినట్టు వినకపోతే ఎన్‌కౌంటర్‌ చేస్తామని పోలీసులు బెదిరించారని సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ వర్రా రవీంద్రారెడ్డి మేజిస్ట్రేట్   కు వాంగ్మూలం ఇచ్చారు. ఈ విషయాన్ని రవీంద్రారెడ్డి తరఫు న్యాయవాదులు నాగిరెడ్డి, ఓబులరెడ్డి మీడియాకు మంగళవారం తెలిపారు. న్యాయవాదులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్రా రవీంద్రారెడ్డిని ఈ నెల 4న రాత్రి పోలీసులు కడప తాలూకా పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి 41ఏ నోటీసు ఇచ్చారు. తరువాత తనతో వచి్చన న్యాయవాది హరినాథరెడ్డి, స్నేహితుడు మహేశ్వర్‌రెడ్డిని పోలీసులు ఇబ్బందులకు గురి చేశారు. ఈ నేపథ్యంలోనే వర్రా రవీంద్రారెడ్డి హైదరాబాద్‌ వెళ్లారు.

కాగా.. ఈ కేసు విషయమై జిల్లా ఎస్పీని బదిలీ చేయడంతో పాటు, సీఐని సస్పెండ్‌ చేశారని తెలిసి అతడు స్వచ్ఛందంగా లొంగిపోయేందుకు స్నేహితులైన వెంకటసుబ్బారెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డితో కలిసి కారులో కడప వస్తుండగా.. ఈ నెల 8న కర్నూలు టోల్‌ప్లాజా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తరువాత ఓ ఇంట్లోకి రవీంద్రారెడ్డిని తీసుకెళ్లి పోలీసులు విచారించారు. ఆ సమయంలో ఎన్‌కౌంటర్‌ చేసేందుకు వెనుకాడబోమని పోలీసులు అతడిని బెదిరించారు. 

తాము చెప్పినట్టుగా వాంగ్మూలం ఇవ్వకపోతే భార్యను, కుమార్తెను అథోగతి పాల్జేస్తామని రవీంద్రారెడ్డిని హెచ్చరించారు. ఎంపీ అవినాష్రెడ్డి, అతడి పీఏ రాఘవరెడ్డి ప్రోద్బలంతోనే వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ షరి్మల, వైఎస్‌ సునీతపై పోస్టింగ్‌లు చేశానని ఒప్పుకోవాలంటూ బలవంత పెట్టారు. తాము చెప్పినట్టు వినకపోతే ఎక్కువగా కేసులను పెట్టి జీవితాంతం జైలులో ఉండేలా చూస్తామని కూడా పోలీసులు హెచ్చరించారు. ఆ నేపథ్యంలోనే పోలీసులు థర్డ్‌ డిగ్రీని ప్రయోగించారు. థర్డ్‌ డిగ్రీ కారణంగా తన శరీరంపై అయిన గాయాలను మెజిస్ట్రేట్‌కు రవీంద్రారెడ్డి చూపించారు.  

ఆలస్యంగా వైద్య పరీక్షలు 
కాగా.. వర్రా రవీంద్రారెడ్డితో పాటు అరెస్టు చేసిన గుర్రంపాటి వెంకట సుబ్బారెడ్డి, గురజాల ఉదయ్‌కుమార్‌రెడ్డిని పోలీసులు సోమవారం రాత్రి 11 గంటల సమయంలో రిమ్స్‌కు వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లారు. అనంతరం అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో కడపలోని పులివెందుల కోర్టు ఇన్‌చార్జ్‌ మెజిస్ట్రేట్‌ ముందు హాజరు పరిచారు. మేజిస్ట్రేట్   వర్రా రవీంద్రారెడ్డికి 14 రోజుల రిమాండ్‌ విధించారు.

మిగిలిన ఇద్దరు నిందితులకు 41ఏ నోటీసులు అందజేసి బెయిల్‌ ఇచ్చారు. ఈ క్రమంలోనే వర్రా రవీంద్రారెడ్డిని రిమాండ్‌ నిమిత్తం కడప కేంద్ర కారాగారంలోకి తీసుకెళ్లిన తరువాత రిమ్స్‌కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించాలని మేజిస్ట్రేట్   ఆదేశించారు. దీంతో మంగళవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో కడప కేంద్ర కారాగారానికి వర్రాను తరలించారు. కాగా అధికారులు మంగళవారం సాయంత్రం వరకు అతడిని వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లకపోవడం గమనార్హం.  

వర్రా రవీంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, ఉదయ్‌లను అరెస్ట్‌ చేశాం
సాక్షి, అమరావతి: సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన వర్రా రవీంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, ఉదయ్‌ కుమార్‌రెడ్డిలను అరెస్ట్‌ చేసి సంబంధిత కోర్టు ముందు హాజరుపరిచామని పోలీసులు మంగళవారం హైకోర్టుకు నివేదించారు. ఈ ముగ్గురిలో రవీంద్రారెడ్డికి కోర్టు ఈ నెల 25 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించిందని తెలిపారు. మిగిలిన ఇద్దరి రిమాండ్‌ను కోర్టు తిరస్కరించిందన్నారు. 

ఈ వివరాలను హైకోర్టు రికార్డ్‌ చేసింది. ఇదిలావుంటే.. వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు విచారణ సందర్భంగా గాయపరిచిన విషయాన్ని ఆయన తరఫు న్యాయవాది వీఆర్‌ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై రాతపూర్వకంగా అఫిడవిట్‌ వేయాలని, దానిని పరిశీలించి తగిన ఆదేశాలు ఇస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. 

అలాగే రవీంద్రారెడ్డి నిర్బంధానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. వర్రా రవీంద్రారెడ్డి అక్రమ నిర్బంధంపై అతని భార్య కళ్యాణి, సుబ్బారెడ్డి, ఉదయభాస్కర్‌రెడ్డి నిర్బంధంపై వారి సంబంధీకులు హైకోర్టులో వేర్వేరుగా హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
ravindra reddy
Encounter
Police
nagireddy
Andhra Pradesh
testimony
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.