సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదన మేరకు 2024–25 ఆర్థి క సంవత్సరానికి గాను మహాత్మా గాంధీ జాయతీ గ్రామీణ ఉపాధి హామీ పథకం లేబర్ బడ్జెట్‌ను 21.50 కోట్ల పని దినాలకు పెంచడానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అంగీకరించిందని డిప్యూటీ సీఎం కె.పవన్‌కళ్యాణ్ ఒక మంగళవారం ప్రకటనలో తెలిపారు. పెరిగిన పని దినాల వల్ల ఉపాధి హామీ పథకంలో పని చేసే 54 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని పేర్కొన్నారు. కూలీలకు చెల్లించాల్సిన బకాయిల సత్వర విడుదలకు కేంద్రం సమ్మతించిందని ఆయన తెలిపారు.
యూఎస్ కాన్సుల్ జనరల్ భేటీ
కాగా.. పవన్‌కళ్యాణ్‌తో యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ మంగళవారం భేటీ అయ్యారు. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునే నైపుణ్యం గల యువత రాష్ట్రంలో ఉందని, వారి ప్రతిభకు తగిన అవకాశాలు అందించడంతోపాటు ఉన్నత విద్యకు అమెరికా వెళ్లేవారికి తగిన సహకారం, మార్గనిర్దేశం చేయాలని పవన్‌కళ్యాణ్ ఈ సందర్భంగా కోరినట్టు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. జెన్నిఫర్ లార్సన్ను పవన్ కల్యాణ్ సన్మానించారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ADVERTISEMENT
ADVERTISEMENT