Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. వెంకన్న హుండీలను దోచేసింది టీడీపీ వాళ్లే?
ADVERTISEMENT 

వెంకన్న హుండీలను దోచేసింది టీడీపీ వాళ్లే?

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Jun 8, 2026 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
565488.jpg

అనకాపల్లి జిల్లా: ప్రముఖ పుణ్యక్షేత్రం, టీటీడీ అనుబంధ దేవాలయం ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 3వ తేదీ రాత్రి హుండీలను కొల్లగొట్టి భక్తులు సమర్పించిన కానుకలను చోరీచేసిన ఇద్దరు దొంగలు దొరికారు. ఈ దుర్మార్గానికి పాల్పడింది   హోంమంత్రి, స్థానిక ఎమ్మెల్యే వంగలపూడి అనితకు అత్యంత సన్నిహితులైన టీడీపీ నాయకుల కుటుంబసభ్యులని తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో కోట్లాదిమంది భక్తులు తమ ఇలవేల్పుగా కొలిచే  ఉపమాక వేంకటేశ్వరస్వామికి భక్తులు సమర్పించిన కానుకలను దోచుకుంది టీడీపీ కార్యకర్తలేనన్న ప్రచారం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. 

ఈ నెల 3వ తేదీ అర్ధరాత్రి  ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలోకి ఇద్దరు దుండగులు ప్రవేశించి ఉత్సవమూర్తులున్న గర్భాలయం ఎదురుగాగల ఆస్థాన మండపంలో ఒక హుండీ, ఆండాళ్లమ్మ సన్నిధిలో మరో హుండీని కట్టర్లతో ధ్వంసంచేసి లక్షలాది రూపాయలు దోచుకెళ్లిన సంగతి తెలిసిందే. నిందితులు స్పష్టంగా కనిపిస్తున్న సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు వివిధ గ్రూపుల్లో షేర్‌ చేసి, గ్రామాల్లో యువకులకు చూపించి ఆరా తీశారు. ఈ దురాగతానికి పాల్పడింది నక్కపల్లి మండలం రేబాక గ్రామానికి చెందిన ఇద్దరు యువకులని తేలడంతో వారిద్దరిని పోలీసులు శనివారం రాత్రి అన్నవరంలోని ఒక రిసార్ట్స్‌లో అదుపులోకి తీసుకుని కొంత నగదును స్వా«దీనం చేసుకున్నారు. 

తరువాత వారిని రేబాక తీసుకెళ్లారు. నిందితుల్లో ఒకరి ఇంటి సమీపంలోని తుప్పల్లో దాచిన నగదుమూటను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. పోలీసులు మొత్తం రూ.2.30 లక్షలకుపైగా స్వా«దీనం చేసుకున్నట్లు తెలిసింది. నిందితుల్లో ఒకరు హోంమంత్రి వంగలపూడి అనితకు అత్యంత సన్నిహితుడు, నియోజకవర్గ ఐటీడీపీలో కీలక నాయకుడికి సోదరుడని, మరో నిందితుడు గ్రామంలో పార్టీ సీనియర్‌ నాయకుడి కుమారుడని ప్రచారం జరుగుతోంది.  

ఆరేళ్లలో 56 గ్రాముల బంగారమేనా?! 
ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో హుండీల లెక్కింపు సమయంలో నగదును లెక్కించిన తరువాత బంగారు, వెండి ఆభరణాలు, వస్తువులను మూటగట్టి మళ్లీ హుండీలోనే ఉంచుతారు. ఆరేళ్లుగా వచ్చిన బంగారు, వెండి ఆభరణాలు, వస్తువులను కట్టిన మూటను దొంగలు ఎత్తుకెళ్లి ఆలయం వెనుక తోటలో పడేశారు. దీన్లో కేవలం 56 గ్రాముల బంగారు, 2.5 కిలోల వెండి ఆభరణాలు మాత్రమే ఉండటం అనుమానాలు కలిగిస్తోంది. ఆరేళ్లుగా భక్తులు సమర్పించిన బంగారం ఈ కొద్దిమొత్తమేనా అనే చర్చసాగుతోంది. ఈ వ్యవహారంలో టీటీడీ అధికారుల పాత్రను కూడా భక్తులు అనుమానిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో బంగారానికి సంబంధించిన వ్యవహారాలు కూడా బయటపడే అవకాశం ఉంది.  

రెక్కీ..ఆపై చోరీ  
సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను పరిశీలిస్తే ఈ నెల ఒకటోతేదీ మధ్యాహ్నం నిందితులు యూనికార్న్‌ మోటారు సైకిల్‌పై ఆలయానికి వచ్చి ఆస్థాన మండపంలో ఉన్న హుండీ వద్ద నుంచి స్వామిని దర్శించుకుని, పరిసరాలను పరిశీలించారు. పాయకరావుపేటలో ఐరన్‌ కట్టర్‌ను కొనుగోలు చేసిన నిందితులు ఈ నెల 3వ తేదీ అర్ధరాత్రి రెండుగంటల సమయంలో ఆలయం వెనుక వైపున్న కొండపైనుంచి మామిడి చెట్టు మీదుగా ఆలయంలోకి ప్రవేశించారు.

 రెండు హుండీలను ఎలక్ట్రిక్‌ కట్టర్లతో కట్‌చేసి వాటిలో ఉన్న నగదు, బంగారు, వెండి ఆభరణాలను  దోచుకెళ్లారు. మార్చి నెల నుంచి ఆ రోజువరకు హుండీల్లో ఉన్న నగదుతోపాటు, ఆరేళ్లనుంచి భక్తులు స్వామికి కానుకలుగా సమరి్పంచిన బంగారు, వెండి ఆభరణాల మూటను కూడా వీరు ఎత్తుకెళ్లారు. అయితే ఈ ఆభరణాల మూటను ఆలయం వెనుక తోటలో పడేశారు. ఈ మూటలో 56 గ్రాముల బంగారు, 2.5 కిలోల వెండి ఆభరణాలున్నట్లు పోలీసులు గుర్తించారు. చోరీ జరిగినరోజు రాత్రి ఆలయానికి సమీపంలో మనబానవానిపాలెంలో  జాతీయ రహదారిపై దుర్గాదేవి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా భారీగా బాణసంచా కాల్చారు.

 ఈ బాణసంచా మోతల్లోనే హుండీలను కట్‌చేసినట్లు భావిస్తున్నారు. నిందితుల్ని పట్టుకోవడంలో డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో నక్కపల్లి సీఐ జె.మురళి, ఎస్‌ఐ సన్నిబాబు కీలకపాత్ర పోషించారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను పోలీసులు సోమవారం విలేకరులకు తెలిపే అవకాశం ఉంది. గతంలో రేబాక గూడుపుమ్మ ఆలయం, రమణయ్యపేట, ముకుందరాజుపేట, కాగిత, ఒడ్డిమెట్ట తదితర గ్రామాల్లోని ఆలయాల్లో జరిగిన చోరీల్లో కూడా ఈ నిందితుల ప్రమేయం ఉండవచ్చని ఆయా గ్రామాల ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.   

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
TTD
Andhra Pradesh
hundi
accused
vangalapudi anitha
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.