Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. టమాట మండీ.. అక్రమ వసూళ్లు దండి
ADVERTISEMENT 

టమాట మండీ.. అక్రమ వసూళ్లు దండి

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Aug 21, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
22_2.jpg

రైతుల కష్టాన్ని నిలువునా దోచేస్తున్న అధికార పార్టీ నేత

ప్రతి లోడుకూ అన్నదాతలు కప్పం కట్టాల్సిందే

పెద్ద లారీకి రూ.2,500, మినీ లారీకి రూ.500 ఫిక్స్‌

రోజూ 230కు పైగా లారీల దాకా లోడింగ్‌

నిత్యం రూ.4  లక్షల దాకా అక్రమ వసూళ్లు

ఈ మొత్తం సాయంత్రానికి ముఖ్య ప్రజాప్రతినిధి ఇంటికి

ఇప్పటికే రూ.1.15 కోట్ల దాకా వసూళ్లు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌/రాఫ్తాడు రూరల్‌: ఓవైపు ఆరుగాలం ఎండనక.. వాననక కష్టపడి పండించుకున్న పంటకు కనీస మద్దతు ధర కూడా లభించక అన్నదాతలు ఆవేదన చెందుతుంటే.. మరోవైపు వారి కష్టాన్ని అధికార పార్టీ ముఖ్య ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుడు నిలువుదోపిడీ చేస్తున్నారు. అధికారంలో ఉండి రైతులను ఆదుకోవాల్సిన ఆయనే రైతుల నుంచి భారీ ఎత్తున పిండుకుంటున్నారు. అనంతపురం రూరల్‌ మండలం కక్కలపల్లి సమీపంలోని టమాట మండీలో అక్రమ వసూళ్లకు తెర తీశారు. 

గతంలో టమాట మండీకి వచ్చే వాహనాల నుంచి పంచాయతీ అధికారులు సుంకం వసూలు చేసేవారు. దీనిపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడంతో ఈ వసూళ్లు నిలిపేశారు. అయితే ప్రస్తుతం రాప్తాడు నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ ముఖ్య ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుడు రంగంలోకి దిగారు. టమాట మండీకి వచ్చే వాహనాలు కప్పం కట్టాల్సిందేనని హుకుం జారీ చేశారు. 

లోడు చేసుకునే పెద్ద వాహనం నుంచి రూ.2,500, చిన్న వాహనం నుంచి రూ. 500 ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. మండీ ఓనర్స్‌ అసోసియేషన్‌ పేరుతో వసూళ్లకు దిగారు. మండీ ఓనర్స్‌ అసోసియేషన్, లారీ ఓనర్స్‌ అసోసియేషన్, బయ్యర్లు.. ఈ ముగ్గురూ కలిసి చేస్తున్న వివిధ రకాల వసూళ్లతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

నెల రోజులుగా దందా..
కక్కలపల్లి టమాట మండీలో అధికార పార్టీ నేత సాగిస్తున్న అక్రమ వసూళ్ల దందా నెల రోజులుగా సాగుతోంది. రోజూ రమారమి 230 వాహనాలు లోడింగ్‌ అవుతున్నాయి. ఇందులో 140 దాకా పెద్దవి, 90 దాకా చిన్న వాహనాలు ఉంటున్నాయి. రోజుకు రూ.3,95,000 చొప్పున ఇప్పటిదాకా రూ.1.15 కోట్లకు పైగా వసూలు చేశారు. 

రోజూ వసూలవుతున్న మొత్తం సాయంత్రానికి అధికార పార్టీ ముఖ్య నేత ఇంటికి వెళ్తున్నట్టు తెలుస్తోంది. కూటమి నేతలు అడిగిన కప్పం కట్టడానికి నిరాకరించినవారికి బెదిరింపులు తీవ్ర స్థాయిలో ఉంటున్నాయి. మహారాష్ట్రకు చెందిన ఓ బయ్యర్‌ కప్పం కట్టేందుకు నిరాకరించడంతో ఆయన్ను బెదిరించి కప్పం కట్టించారు.

నోటీసులను లెక్క చేయని అసోసియేషన్‌
“టమాట మండీ ఓనర్స్‌ అసోసియేషన్‌ చేస్తున్న వసూళ్లు పూర్తిగా చట్ట విరుద్ధం. ప్రభుత్వ అనుమతి లేకుండా పంచాయతీ పరిధిలో ఎలాంటి వసూళ్లు చేయరాదు. అలా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు’  అంటూ కక్కలపల్లి పంచాయతీ కార్యదర్శి గత నెల 22న టమాట మండీ ఓనర్స్‌ అసోసియేషన్‌కు నోటీసు ఇచ్చారు. 

వసూళ్ల నిర్వాకంపై స్వయంగా ఈవోఆర్డీ, డీఎల్‌పీవో, డీపీవోతో పాటు పోలీస్‌స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశారు.  అయినా ఏమాత్రమూ లెక్క చేయకుండా వసూళ్లు చేస్తూనే ఉన్నారు. పైగా ఎవరికి డబ్బులు ఇవ్వొద్దని అధికారులు ఏర్పాటు చేసిన బ్యానర్‌ను కూడా తొలగించేశారు.


రెండో రోజూ రోడ్డెక్కిన టమాట రైతులు 
టమాటాలు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో అనంతపురంలో రైతులు రెండో రోజు మంగళవారం కూడా రోడ్డెక్కారు. అనంతపురం రూరల్‌ మండలం కక్కలపల్లి టమాట మండీల్లో అసోసి­యేషన్‌ నాయకులు నిలువు దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమ వసూళ్లను నిరసిస్తూ బయ్యర్లు రెండురోజులుగా కొను­గోలు ఆపేశారు. దీంతో ఆగ్రహించిన రైతులు జాతీయ రహదారి–44పై బైఠాయించి ఆందోళన చేశారు. దీంతో అనంతపురం డీఎస్పీ ప్రతాప్‌ ఆధ్వర్యంలో పోలీసులు రైతులతో మాట్లాడారు. 

ఏదైనా ఉంటే మండీ అసోసియేషన్, బయ్యర్లతో కూర్చుని మాట్లాడదామని, వెంటనే ఆందోళన విరమించాలని సూచించారు. దీంతో రైతులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రెండు రోజులుగా రైతులు రోడ్డెక్కుతున్నా ఏమి న్యాయం చేశారంటూ నిలదీశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మార్కెట్‌కు తీసుకొస్తే బయ్యర్లు కొనేందుకు ముందుకు రావడం లేదన్నారు. తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలి? ప్రభుత్వం పట్టించుకోకపోతే ఎలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న రాప్తా­డు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్‌ టమాట మండీ వద్దకు చేరుకున్నారు. 

మండీ ఓనర్స్‌ అసోసి­యేషన్‌ పేరుతో ప్రతి లోడుకూ రూ.2,500 అదనంగా వసూలు చేస్తున్న విషయాన్ని కొందరు బయ్యర్లు శ్రీరామ్‌ దృష్టికి తీసుకెళ్లారు.ఈ వసూళ్లపై ఎందుకు స్పందించలేదని ఆయనను నిలదీశారు. కాగా బయ్యర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో మంగళవారం వేలం పాట నిలిచిపోయింది. దీంతో ప్రతి రైతుకూ వేలాది రూపాయలు నష్టం వాటిల్లింది. 

నెత్తిన గుండేసుకుని చావాలా?
బయ్యర్ల నుంచి ప్రతి లోడుకు డబ్బులు వసూలు చేస్తున్నారు. అది పరిష్కారం అయ్యేదాకా తాము కొనుగోలు చేయబోమని బయ్యర్లు అంటున్నారు. సరుకు తెచ్చిన రైతులు నెత్తిన గుండేసుకుని చావాలా?  – తిమ్మప్ప, రాంపురం, ఉరవకొండ మండలంమా గోడు ఎవరికి చెప్పుకోవాలి? 

నేను 100 బాక్సుల టమాట తీసుకొచ్చా. రేయంతా కాసుకుని కూర్చున్నా. ఉదయమైతే బయ్యర్లు కొనేందుకు ముందుకు రాలేదు. పంట సాగు చేసినప్పటి నుంచి మండీకి తెచ్చేదాకా రైతులు ఎన్నో అగచాట్లు పడుతున్నారు. మా గోడు ఎవరికి చెప్పుకోవాలి?     – మంజునాథ్, కళ్యాణదుర్గం 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
support price
Andhra Pradesh
Tomato
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.