Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. హృదయాలయం.. నిరుపేదల గుండె గుడి
ADVERTISEMENT 

హృదయాలయం.. నిరుపేదల గుండె గుడి

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Oct 2, 2023 Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
tamilisai.jpg

సాక్షి, తిరుపతి : శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయం.. నిరుపేదల పాలిట గుండె‘గుడి’గా పూజింపబడుతోంది. చిన్నవయస్సులో హృద్రోగ సమస్యతో ఆస్పత్రిలో చేరిన నిరుపేద చిన్నారులకు గుండె మార్పిడి చేసి పునర్జన్మ ప్రసాదిస్తోంది. వెల కట్టలేని గుండెను ఉచితంగా అమర్చి శభాష్‌ అనిపించుకుంటోంది.

రూ.లక్షల విలువ­చేసే గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోలేక అనేకమంది చిన్నారులు ప్రాణాలు విడుస్తున్నారు. అలాంటి వారికి పునర్జన్మ­నివ్వటమే లక్ష్యంగా సీఎం వైఎస్‌ జగన్‌ గొప్ప సత్సంకల్పంతో తిరుపతిలో చిన్నపిల్లల ఆస్పత్రి ఏర్పాటు­చేయాలని భావించారు. ఆ బాధ్యతను టీటీడీకి అప్పగించారు. దీంతో కార్డియాక్‌ కేర్‌ సెంటర్‌కు టీటీడీ శ్రీకారం చుట్టింది.

ఈ ఆస్పత్రి తన మానసపుత్రికగా ప్రకటించిన సీఎం వైఎస్‌ జగన్‌ 2021 సెప్టెంబర్‌ 11న శ్రీపద్మావతి కార్డియాక్‌ కేర్‌ సెంటర్‌ను ప్రారంభించారు. కేవలం ఎనిమిది నెలల్లోనే దీన్ని అందుబాటులోకి తెచ్చా­రు. అంతేకాక.. అతికొద్ది కాలంలోనే 1,908 గుండె శస్త్రచి­కిత్సలను ఇక్కడి వైద్యులు విజయవంతంగా పూర్తిచేశా­రు. ఈ ఆస్పత్రిలో తొలిసారి గుండెమార్పిడి చికి­త్స­ను కూడా చేయడంతో ఆస్పత్రి కీర్తి ఒక్కసారిగా రెపరె­పలాడింది. ఇలా ఇప్పటికి రెండు గుండెమార్పిడి శస్త్రచిత్స­లను విజయ­వంతంగా నిర్వహించింది.

తాజాగా.. శ్రీకా­కుళంలో బ్రెయిన్‌డెడ్‌ అయిన వ్యక్తి గుండెను రోడ్డు మార్గంలోవిశాఖకు తరలించి అక్కడ నుంచి ప్రత్యేక ఎయిర్‌ అంబులెన్స్‌లో రేణిగుంట విమా­నాశ్రయానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి నిమిషాల వ్యవధిలో తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయానికి తీసుకొచ్చి నెల్లూరుకు చెందిన చిన్నారికి అమర్చారు.

ఈ నేపథ్యంలో.. టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయానికి ఉత్తమ పీడియాట్రిక్‌ కార్డియాక్‌ సెంటర్‌గా గుర్తించి ఆసియా టుడే రీసెర్చ్‌ అండ్‌ మీడియా సంస్థ ప్రైడ్‌ ఆఫ్‌ నేషన్‌ అవార్డును ఇటీవల ప్రకటించింది.  హైదరాబాద్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్‌ తమిళిసై చేతుల మీదుగా ఆస్పత్రి డైరెక్టర్‌ డా.ఎన్‌. శ్రీనాధరెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. 



మొట్టమొదటి గుండె మార్పిడి శస్త్రచికిత్స ఇలా..

తిరుపతిలోని టీటీడీ శ్రీపద్మావతి చిన్నపిల్లల గుండె చికిత్సాలయంలో ఈ ఏడాది జనవరి 20న తొలిసారి ఓ  చిన్నారికి గుండెమార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించారు. జనవరి 16న జంజూరు సన్యాసమ్మ (48) రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలై బ్రెయిన్‌డెడ్‌ అయ్యింది. షీలానగర్‌లోని కిమ్స్‌ ఐకాన్‌ ఆస్పత్రిలో ఉన్న ఆమె అవయవదానం చేశారు. ఆమె గుండెను అన్నమయ్య జిల్లా చిట్వేల్‌ మండలం కేఎస్సార్‌ అగ్రహారం గ్రామానికి చెందిన 15 సంవత్సరాల బాలుడికి అమర్చి చికిత్సను విజయవంతంగా పూర్తిచేశారు. 



దేశంలోని ప్రముఖ వైద్య నిపుణుల సేవలు..

ఇక ఆస్పత్రిలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రముఖ గుండె సంబంధిత వైద్య నిపుణులు, ఇతర వైద్య సిబ్బందితో పాటు ఎకో స్కానింగ్, మెడికల్‌ ల్యాబ్, ఎక్స్‌రే, క్యాథ్‌ల్యాబ్, అడ్వాన్స్‌డ్‌ ల్యాబ్‌ అందుబాటులో ఉన్నాయి. దేశంలోని ప్రముఖ చిన్నపిల్లల గుండె వైద్య నిపుణులు సైతం శ్రీపద్మావతి చిన్నపిల్లల కార్డియాక్‌ కేర్‌ సెంటర్‌కు వచ్చి తమ సేవలు అందిస్తున్నారు.



వైఎస్సార్‌ మాట..

అభం శుభం తెలియని ఏ పసిబిడ్డ కూడా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడకూడదు. వ్యాధిబారిన పడ్డ నా బిడ్డను కాపాడుకోలేకపోయాననే వేదన ఏ ఒక్కరూ పడకూడదు. ఇందుకు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరించాలి. ఆ బాధ్యత నాది అంటూ చిన్నపిల్లల గుండె సంబంధిత చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చి వివిధ ప్రముఖ ఆసుపత్రుల్లో అందించేలా దివంగత వైఎస్‌ కృషిచేశారు. 2003లో చెప్పిన ఆ మాటలను కార్యరూపం దాల్చేలా 2004లో నిర్ణయం తీసుకుని పసిగుండెలకు సాంత్వన చేకూర్చారు.



కొండంత అండగా టీటీడీ..

సీఎం ఆదేశాలతో ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకురావడంలో టీటీడీ అప్పటి ఈఓ కేఎస్‌ జవహర్‌రెడ్డి, ప్రస్తుత ఈఓ ఏవీ ధర్మారెడ్డి, ఆస్పత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనాథరెడ్డిలు ఎంతో కృషిచేశారు. ఆస్పత్రి నిర్వహణ, వైద్య సదుపాయాల కోసం రూ.25 కోట్లను టీటీడీ విడుదల చేసింది. 2022–23 వార్షిక ఏడాదికి ప్రాణదాన పథకం ద్వారా వైద్యఖర్చుల కోసం రూ.15 కోట్లను విడుదల చేసి టీటీడీ పెద్దన్న పాత్ర పోషించింది. చిన్నారి గుండెలకు శ్రీవారి అభయం తోడవడంతో అనతికాలంలోనే మంచి గుర్తింపు లభించింది. 



ముందుకొస్తున్న దాతలు..

మరోవైపు.. ఆస్పత్రిలో శస్త్రచికిత్సలు ప్రారంభమైన ఎనిమిది నెలల వ్యవధిలోనే ఇక్కడి వైద్య సేవలను గుర్తించి దాతలు ముందుకొస్తున్నారు. శ్రీవేంకటేశ్వర ఆపన్న హృదయం స్కీమ్‌ ద్వారా వచ్చే మొత్తాన్ని ఇక్కడి పిల్లల వైద్యం కోసం ఖర్చుచేయాలని టీటీడీ నిర్ణయించింది. ఆ మేరకు టీటీడీ ఇచ్చిన పిలుపునకు వివిధ రాష్ట్రాలకు చెందిన 150 మందికి పైగా దాతలు ముందుకొచ్చారు. రూ.లక్ష నుంచి పది లక్షల వరకు ఈ స్కీమ్‌లో జమచేశారు. ఈ పథకం కింద లక్షపైన ఇచ్చే భక్తులకు వీఐపీ బ్రేక్‌ (5 మందికి) దర్శన సదుపాయం కల్పిస్తోంది. మరింత మంది దాతలు ముందుకొచ్చి చిన్నారి గుండెలకు అండగా నిలవాలని టీటీడీ పిలుపునిచ్చింది.

ఆయన తనయుడిగా..

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తనయుడుగా సీఎం వైఎస్‌ జగన్‌ నాలుగడుగులు ముందుకేసి చిన్నపిల్లల గుండె సంరక్షణ బాధ్యత నాది అంటూ ఓ ఆస్పత్రిని నిర్మించాలని సంకల్పించారు. ఆయన చెప్పిన అనతికాలంలోనే టీటీడీ సహకారంతో అత్యాధునిక వైద్య సదుపాయాలతో శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయాన్ని  అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆరోగ్యశ్రీ ఉన్న ప్రతి ఒక్కరికీ ఖరీదైన గుండె సంబంధిత చికిత్సలను ఉచితంగా అందజేస్తున్నారు. టీటీడీ సంపూర్ణ సహకారంతో ఆస్పత్రి విజయవంతంగా వైద్యసేవలందిస్తూ అనతి కాలంలోనే దేశం నలుమూలలా వ్యాప్తి చెందింది. 

వరంగా మారిన ఆరోగ్యశ్రీ..

నిజానికి.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ప్రత్యేకించి చిన్నపిల్లల హార్ట్‌కేర్‌ సెంటర్‌ లేదు. గుండె సంబంధిత చికిత్సలనగానే రూ.లక్షలతో కూడుకున్న వైద్యం అన్న భయం జనంలో ఉండేది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పేదలకు వరంగా మారింది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక గుండెకు గుడి కట్టారు. మహానగరాలకు వెళ్లి వైద్యం చేయించుకునే స్తోమతలేని ఎన్నో పేద గుండెలకు పునర్జన్మనిస్తున్నారు.

తిరుపతిలోని శ్రీపద్మావతి చిల్డ్రన్‌ కార్డియాక్‌ కేర్‌ సెంటర్‌లో ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఉచితంగా శస్త్రచికిత్సలను అందిస్తున్నారు. ఆరోగ్యశ్రీ లేకున్నా ఇక్కడ వైద్య ఖర్చులు (పరికరాలు, మందులు) భరిస్తే ఎవరికైనా శస్త్రచికిత్సలను చేపడుతున్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ స్కీమ్‌ ద్వారా వివిధ రాష్ట్రాల్లోని పేదల పిల్లలకు సైతం ఉచితంగానే శస్త్రచికిత్సలను అందిస్తున్నారు.  

అనతికాలంలోనే వందల మందికి పునర్జన్మ

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, టీటీడీ సహకారంతో రూ.12 లక్షలు ఖర్చయ్యే గుండె మార్పిడి శస్త్రచికిత్సలను ఉచితంగా చేస్తున్నాం. అనతి కాలంలోనే వందల మందికి వైద్యులు పునర్జన్మనిచ్చారు. ఈ ఆస్పత్రిని ఆదర్శంగా తీసుకుని అలిపిరి వద్ద సుమారు రూ.450 కోట్ల వ్యయంతో చిన్నపిల్లల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తున్నాం. డిసెంబర్‌లో దీనిని ప్రారంభించేందుకు కృషిచేస్తున్నాం.  – డాక్టర్‌ శ్రీనాథరెడ్డి, డైరెక్టర్, శ్రీ పద్మావతి కార్డియాక్‌ కేర్‌ సెంటర్‌ 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
cardiac patients
heart transplant
children
TTD
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘మా నాన్నెవరో తెలుసా?’

‘మా నాన్నెవరో తెలుసా?’

జెన్‌ ఆల్ఫా.. జెట్‌ స్పీడ్‌

జెన్‌ ఆల్ఫా.. జెట్‌ స్పీడ్‌

మా బాబుకి రెండేళ్లు! ఎంత పిలిచినా.. చూడటం లేదు..

మా బాబుకి రెండేళ్లు! ఎంత పిలిచినా.. చూడటం లేదు..

పేగుబంధమే యమపాశమై!

పేగుబంధమే యమపాశమై!

బిర్యానీ తినిపించి.. తెప్పలో తీసుకెళ్లి

బిర్యానీ తినిపించి.. తెప్పలో తీసుకెళ్లి

పాక్‌ దాడులు.. 11 మంది చిన్నారులు మృతి

పాక్‌ దాడులు.. 11 మంది చిన్నారులు మృతి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.