సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులు 18 కంపార్ట్మెంట్లలో నిండిపోయి ఉన్నారు. టికెట్లు లేని సర్వదర్శనానికి(ఉచిత దర్శనం) ఏడు గంటల సమయం పడుతోంది.
ఇక.. నిన్న(ఆగష్టు 30, 2023) స్వామివారిని 71,132 భక్తులు దర్శించుకున్నారు. 26,963 తలనీలాలు సమర్పించుకున్నారు. రూ. 4.06 కోట్ల హుండీ ఆదాయం లెక్కగా తేలింది.