Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. పోటెత్తిన తుంగభద్ర డ్రెయిన్‌
ADVERTISEMENT 

పోటెత్తిన తుంగభద్ర డ్రెయిన్‌

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Sep 6, 2024 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
drain.jpg

మూడు నియోజకవర్గాల్లోని వేలాది ఎకరాల్లో పంటల మునక

పలుచోట్లరోడ్లపైకి ప్రవహిస్తున్న నీరు

చుండూరు–మోదుకూరు మధ్య రాకపోకల బంద్‌

తెనాలి: తుంగభద్ర డ్రెయిన్‌ పోటెత్తింది... సమీప పంట పొలాలను ముంచెత్తింది. ఫలితంగా గుంటూరు జిల్లా తెనాలి, వేమూరు, పొన్నూరు నియోజకవర్గాల్లోని గ్రామాలకు చెందిన వేలాది ఎకరాల్లోకి  పంట పొలాలు మునకేశాయి. వరి పొలాలైతే చాలా చోట్ల మొనలు కూడా కనిపించడం లేదు. బీపీటీ వరిపై రైతులు ఆశలు వదిలేసుకున్నారు. కూరగాయలు, నిమ్మ, అరటి పొలాల్లో రోజుల తరబడి నీరు నిలిచి ఉండటంతోపంట నష్టం అనివార్యంగా రైతులు ఆందోళన చెందుతున్నారు.

 గుంటూరు నల్ల డ్రెయిన్‌... ఒకప్పుడు రైతుల దుఃఖదాయినిగా పేరు. తెనాలి నియోజకవర్గంలోని సంగం జాగర్లమూడి వద్ద కొమ్మమూరు కాలువ దిగువన అదనంగా అండర్‌ టన్నెల్‌ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి తుంగభద్ర డ్రెయినుగా మారుతుంది. వేమూరు నియోజకవర్గంలోని దుండిపాలెం, యడ్లపల్లి, వలివేరు, చుండూరు, మోదుకూరు, ఆరెమండ్ల, తాళ్లపాలెం, పొన్నూరు, ములుకుదురు, మాచవరం మీదుగా సముద్రంలో కలుస్తుంది. ఎప్పుడు వరదలొచ్చినా 24 గంటల్లో డ్రెయిను సాధా­రణ పరిస్థితికి వస్తుంది. 

అయితే ఈసారి ఆగస్టు 31, ఈ నెల 1న కురిసిన భారీ వర్షాలకు పోటెత్తిన తుంగభద్ర, వర్షాలు ఆగిపోవడంతో రెండో తేదీ తర్వాత తగ్గుముఖం పట్టింది. మళ్లీ అనూహ్యంగా 3వ తేదీ మధ్యాహ్నం నుంచి నీరు పోటెత్తింది. 36 గంట­లుగా ఇదే పరిస్థితి. మార్గమధ్యంలోని వంతెనల అంచులను తాకుతూ, కట్టలపై డ్రెయిన్‌ పొంగిపొర్లుతూ ప్రవహిస్తోంది. మంగళగిరి, చినకాకాని, కాజ, టోల్‌గేట్‌ ప్రాంతాల్లోని నీరు తుంగభద్ర డ్రెయినుకు రావడమే ఇందుకు కారణం. 

మరోవైపు తుంగభద్రలో కలిసే కొండేరు డ్రెయినుతో సహా పలు మురుగుకాల్వలు ఎగదన్ని పంటపొలాలను ముంచాయని స్థానికులు చెబుతున్నారు. అదేవిధంగా తెనాలి సమీపంలోని పినపాడు–దుండిపాలెం, చుండూరు మండలంలోని నడిగడ్డపాలెం–చుండూరు, చుండూరు–మోదుకూరు గ్రామాల మధ్య రోడ్లు జలమయమయ్యాయి. చుండూరు–మోదుకూరు, నడిగడ్డపాలెం–చుండూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులు కూడా తిరగడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Andhra Pradesh
Crop damage
paddy
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.