Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. దక్కని అమాత్యయోగం కాళింగుల అంతర్మథనం
ADVERTISEMENT 

దక్కని అమాత్యయోగం కాళింగుల అంతర్మథనం

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Jun 13, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
565.jpg

మంత్రి వర్గంలో కాళింగ సామాజిక వర్గానికి చంద్రబాబు మొండిచేయి 

తీవ్ర ఆవేదనలో కూన రవికుమార్‌ అభిమానులు  

సామాజికవర్గ వాట్సాప్‌ గ్రూపుల్లో చర్చ  

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కల్పించిన ప్రాధాన్యతతో పోల్చుతున్న పరిస్థితి  

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:  రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించిన జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలకు నిరాశే ఎదురైంది. అచ్చెన్నాయుడితో పాటు కూన రవికుమార్, బెందాళం అశోక్, గౌతు శిరీష మంత్రి పదవి దక్కుతుందేమోనని ఆశించారు. పార్టీ విధేయత, సామాజికవర్గ సమీకరణాల నేపథ్యంలో మంత్రి పదవి వస్తుందని భావించారు. కానీ కింజరాపు ఫ్యామిలీకే చంద్రబాబు పెద్దపీట వేశారు. దీంతో జిల్లాలో ప్రధాన కీలక సామాజిక వర్గమైన కాళింగులకు మొండిచేయి మిగిలింది. అటు కేంద్రంలో ఎంపీ రామ్మోహన్‌నాయుడికి అవకాశమివ్వగా, ఇటు రాష్ట్రంలో అచ్చెన్నాయుడికి చోటు కల్పించడంతో మిగతా సామాజిక వర్గాలకు భంగపాటు తప్పలేదు.  

కూనకు నిరాశ.. 
జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, పార్టీకి కష్టకాలంలో ఎదురొడ్డి పనిచేసినందుకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ భారీగా ఆశలు పెట్టుకున్నారు. గతంలో విప్‌గా పని చేసిన అనుభవంతో ఈసారి తనకు కేబినెట్‌లో బెర్త్‌ ఉంటుందని భావించారు. కేంద్ర కేబినెట్‌లో వెలమ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ రామ్మోహన్‌నాయుడుకు అవకాశం ఇవ్వడంతో రాష్ట్ర కేబినెట్‌లో తప్పకుండా కాళింగులకు చోటు దక్కుతుందని, ఆ కోటాలో తనకే మంత్రి పదవి వస్తుందని ఆశించారు. అదే సామాజిక వర్గానికి చెందిన బెందాళం అశోక్‌ కూడా మంత్రి పదవి వస్తుందని ఊహించారు.

కాళింగ సామాజికవర్గంలో ఒకరికి తప్పకుండా వస్తుందని, అది ఈ ఇద్దరిలో ఎవరికో ఒకరికి మంత్రి పదవి వస్తుందని అంచనా వేసుకున్నారు. జిల్లాలోని కాళింగ సామాజిక వర్గీయులు కూడా పెద్ద ఎత్తున డిమాండ్‌ చేశారు. ఈసారి మంత్రి పదవి తప్పకుండా ఇవ్వాలని అధిష్టానానికి మొరపెట్టుకున్నారు. అయినా వీరి మొర వినలేదు.  మంత్రి వర్గంలో కాళింగులను పరిగణనలోకి తీసుకోలేదు. తనకు సన్నిహితంగా ఉన్న కింజరాపు ఫ్యామిలీకే ప్రాధాన్యమిచ్చి, మంత్రి పదవులు కట్టబెట్టారు.   

కష్టం గుర్తించలేదంటూ.. 
జిల్లాలో టీడీపీ గెలుపునకు కాళింగ సామాజిక వర్గం పనిచేసినా, పార్టీ అభ్యర్థులు విజయం సాధించడంలో కృషి చేసినప్పటికీ చంద్రబాబు గుర్తించకపోవడాన్ని కాళింగ సామాజిక వర్గీయులు ఆవేదన చెందుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో స్పీకర్, జెడ్పీ చైర్‌పర్సన్, ఎమ్మెల్సీ పదవులిస్తే ఈ ప్రభుత్వంలో కనీసం ఒక్కరికైనా మంత్రి పదవి ఇవ్వలేదని రుసరుసలాడుతున్నారు. ఈ మేరకు సామాజికవర్గ వాట్సాప్‌ గ్రూపుల్లో ఇదే చర్చ జరుగుతోంది. టీడీపీకి అండగా నిలిచినందుకు తగిన బహుమానం ఇచ్చారని చర్చించుకుంటున్నారు. 

ఇంకా ఉన్నది ఒక మంత్రి పదవి, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీప్‌ విప్, విప్‌ పదవులే ఉన్నాయని, వాటిలో మంత్రి పదవి, స్పీకర్‌ పదవి వచ్చే పరిస్థితి లేదని, ఇస్తే చీప్‌ విప్, విప్‌ ఇచ్చి చేతులు దులుపుకుంటారేమోని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కూన రవికుమార్‌ వర్గీయులు మాత్రం తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈసారి తప్పనిసరిగా మంత్రి పదవి వస్తుందని మంగళవారం అర్ధరాత్రి వరకు ఎదురు చూశారు. తీరా జాబితా వచ్చాక పేరు లేకపోవడంతో డీలా పడిపోయారు. సంతృప్తి పరచడానికి ఏదో కంటి తుడుపు పోస్టు ఇచ్చి చేతులు దులుపుకొంటారని కూన వర్గీయులు భావిస్తున్నారు. ప్రాధాన్యం లేని పోస్టులిస్తే ఎవరికి ఉపయోగమని కూడా చర్చించుకుంటున్నారు. 

మంత్రి పదవి కేటాయించకపోవడంపై  నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. అయితే, పూర్తి మెజారిటీ ఉండటంతో వీరి మొర వినే పరిస్థితిలో చంద్రబాబు లేరని కచ్చితంగా చెప్పవచ్చు. మళ్లీ మంత్రి విస్తరణ జరిగితే అప్పుడు చూసుకోవల్సిందే తప్ప అంతవరకు అవమానకరంగానే భావించాలి. ఇక, గౌతు శిరీష పరిస్థితి కూడా అంతే. తన తండ్రి సీనియారిటీ, పారీ్టకి విధేయతను దృష్టిలో ఉంచుకుని మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నా చంద్రబాబు కనీసం పరిశీలించలేదు.      

 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Chandrababu Naidu
ravi kumar
TDP
AP Politics
Andhra Pradesh
Minister Positions
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.