Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. ఆయనకు టికెట్‌ ఇస్తే నేనే ఓడిస్తా
ADVERTISEMENT 

ఆయనకు టికెట్‌ ఇస్తే నేనే ఓడిస్తా

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Feb 3, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
tdp.jpg

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పాతపట్నంలో టీడీపీ నాలుగు స్తంభాలాట ఆడుతోంది. తనకు టికెట్‌ ఖాయమైపోయిందని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ప్రచారం చేస్తుండగా.. ఆయనకు టికెట్‌ ఇస్తే తానే ఓడిస్తానని మామిడి గోవిందరావు హెచ్చరిస్తున్నారు. ఈ గొడవతోనే ఆ పార్టీకి తలనోప్పి కడుతుంటే ఆ పార్టీ పాత నాయకుడు సిరిపురం తేజేశ్వరరావు తాజాగా తెరపైకి వచ్చి తానూ ఇండిపెండెంట్‌గా అయినా పోటీలో ఉంటానని చెబుతున్నారు. ఈ జంఝాటం మధ్య జనసేన ఇన్‌చార్జి గేదెల చైతన్య తనకు కూడా సీటిస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇలా గొడవలు, అభిప్రాయ భేదాలు, మాట పట్టింపులతో పాతపట్నంలో టీడీపీ రాజకీయం పతనావస్థకు చేరుకుంది.  

  బలంగా వైఎస్సార్‌సీపీ..

పాతపట్నం నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రూ.1200కోట్లకు పైగా సంక్షేమ పథకా లు, రూ.800కోట్లకు పైగా నాన్‌ డీబీటీ పథకాలు అందించడంతో పాటు రూ. వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. దానికి తోడు వంశధార నిర్వాసితులందరికీ చక్కగా పరిహారం అందజేసింది. దీంతో వైఎస్సార్‌సీపీ చాలా బలంగా కనిపిస్తోంది. మరోవైపు టీడీపీ, జనసేన తమలో తాము కొట్టుకుంటూ ప్రభుత్వంపై బురద జల్లే పని పెట్టుకున్నాయి. కానీ సమన్వయంలోపం కారణంగా ఆ పని కూడా చేయలేక చతికిలపడుతున్నారు.  

 అంతటా అయోమయం.. 

టీడీపీకి అలవాటైన డబుల్‌ గేమ్‌ పాతపట్నంలో వికటించే పరిస్థితి కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన కలమట వెంకటరమ ణ పార్టీ ఫిరాయించి టీడీపీకి వెళ్లడంతో ఆ పారీ్టలో ముసలం పుట్టింది. ఆయన అప్పటికే వంశధార నిర్వాసితుల పరిహారం, ఇసుక, ఇతరత్రా ప్రభుత్వ పథకాల్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. కోట్ల రూపాయల కోసమే కలమట పార్టీ మారారన్న విషయం అందరికీ అర్థమైపోయింది. దీంతో 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన కలమట ఘోరంగా ఓడిపోయారు.

ఇలాంటి వ్యక్తికి మరోసారి టికెట్‌ ఇస్తే ఓడించి తీరుమతామని మరో నేత మామిడి గోవిందరావు అండ్‌ కో బాహాటంగానే చెబుతోంది. కాకపోతే, కలమట వల్ల ఎంత లబ్ధిపొందారో.. ఏ రకంగా ప్రయోజనం కలిగిందో తెలీదు గానీ కింజరాపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడు ఫ్యామిలీ మాత్రం కలమటకు అండగా నిలుస్తోంది. వారి అండదండలే తనకు ఆశీస్సులని, అవే సీటు తెచ్చి పెడతాయని కలమట కొండంత ఆశతో ఉన్నారు. అందుకు తగ్గ సంకేతాలు వస్తున్నాయి. మామిడి గోవిందరావు తనకు పోటీ ఏంటని, వాడుకుని వదిలేస్తామని కలమట బాహాటంగానే చెప్పుకొస్తున్నారు. 

 టిక్కెట్‌ ఇవ్వకుంటే..  

టీడీపీలో మరో కీలక నేతగా ఎదిగిన మామిడి గోవిందరావు నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఈసారి సీటు తనకే వస్తుందని చెబుతున్నారు. తర చూ చంద్రబాబును, లోకేష్ ను కలిసి ప్రసన్నం చేసుకుంటున్నారు. వెళ్లిన ప్రతి సారి రూ. లక్షల్లో పార్టీకి చదివించుకుంటున్నారు. ఇలా ఆయన అధిష్టానం దృష్టిలో పడ్డారు. కాకపోతే, ఆయన ఆశలను కింజరాపు ఫ్యామిలీ అడియాశలు చేస్తోంది. మామిడి గోవింద్‌ను వాడుకుంటామని, ఖర్చు పెట్టిస్తామని, అంతమాత్రాన టిక్కెట్‌ ఇచ్చేస్తామా అని ఒకానొక సందర్భంలో అచ్చెన్నాయుడు బహిరంగంగా చెప్పేశారు.

అయినప్పటికీ మామిడి.. లోకేష్‌ తదితరులకు టచ్‌లోకి వెళ్లి, కింజరాపు ఫ్యామిలీ వ్యతిరేక గ్రూపులో రాజకీయాలు నెరుపుతున్నారు. కానీ ఈయనకు ఇప్పటివరకు స్పష్టమైన హామీ రాలేదు. ఒకవేళ తనకు కాకుండా కలమటకు టిక్కెట్‌ ఇస్తే నియోజకవర్గమంతా తిరిగి ఓడిస్తానని చెప్పకనే చెబుతున్నారు. కాకపోతే ఇటీవల ఆయనలో స్పీడు తగ్గింది. కార్లు ఇచ్చి డబ్బులిచ్చి తిప్పించడం వంటి పనులు కూడా తగ్గించేశారు.  

 కలవరం.. 

ఇదంతా ఓ వైపు సాగుతుండగా.. ఒకప్పుడు టీడీపీలో కొనసాగి, తర్వాత స్తబ్దతగా ఉన్న సిరిపురంతేజేశ్వరరావు ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేస్తానని నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఇప్పుడిది టీడీపీని కలవరపెడుతోంది. మరో మిత్రపక్షమైన జనసేన పరిస్థితి మరోలా ఉంది. తమకే టిక్కెట్‌ వస్తుందని ఆశపడుతూనే కలమటతో కలిసి పనిచేయలేమంటూ తమ వైఖరి ద్వారా తెలియజే స్తోంది. ఆ పార్టీ ఇన్‌చార్జి గేదెల చైతన్య తొలుత కొన్ని సార్లు కలమట వెంకటరమణతో కలిసి వేదిక లు పంచుకున్నా ఆ తర్వాత దూరం పాటిస్తున్నారు. గతంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న వారితో కలిసి పనిచేయలేమని జనసేన కేడర్‌ కూడా అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తోంది. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
TDP
internal fight
pathapatnam
YSRCP
AP Politics
AP Assembly Elections 2024
AP Elections 2024
AP 175
Srikakulam Elections
Srikakulam Assembly Constituencies
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

 బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాల్సిందే : వైఎస్సార్‌సీపీ

బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాల్సిందే : వైఎస్సార్‌సీపీ

 ‘‘SIR ప్రక్రియలో కుట్రలు జరుగుతున్నాయి’’

‘‘SIR ప్రక్రియలో కుట్రలు జరుగుతున్నాయి’’

‘ఈ కేసును సీబీఐ విచారణకు ఇవ్వాల్సిందే’

‘ఈ కేసును సీబీఐ విచారణకు ఇవ్వాల్సిందే’

కడపలో స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభంపై వైఎస్ జగన్ హర్షం

కడపలో స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభంపై వైఎస్ జగన్ హర్షం

జనసేన నేతలవి బుర్ర తక్కువ మాటలు: అంబటి రాంబాబు

జనసేన నేతలవి బుర్ర తక్కువ మాటలు: అంబటి రాంబాబు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.