Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. ‘కోటి’ మాయల మెంబర్‌షిప్‌
ADVERTISEMENT 

‘కోటి’ మాయల మెంబర్‌షిప్‌

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Jan 19, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
TDP11.jpg

ప్రహసనంగా టీడీపీ సభ్యత్వ నమోదు 

రూ.5 లక్షల బీమా వస్తుందని నమ్మబలికి సభ్యత్వాలు.. సభ్యత్వం ఉంటేనే ప్రభుత్వ పథకాలు వస్తాయని బెదిరింపులు 

నియోజకవర్గాలు, నేతల వారీగా టార్గెట్లు 

టార్గెట్లు పూర్తయితేనే పార్టీలో అవకాశాలుంటాయని హెచ్చరిక

టీడీపీ సభ్యత్వాల కోసం వైఎస్సార్‌ బీమా బలి

సాక్షి, అమరావతి: అడుగడుగునా ప్రలోభాలు, బలవంతాలు, మాయమాటలు, బెదిరింపులు.. అధికార తెలుగుదేశం పార్టీ కోటి సభ్యత్వాల వెనుక తతంగమిది. ప్రజల్ని మాయ చేయడంలో ఆరితేరిన తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అధినేత, సీఎం చంద్రబాబు (Chandrababu) ఆడిన మరో మాయ నాటకమిది. ఈ కోటి సభ్యత్వాల వెనుక అధికారాన్ని అడ్డుపెట్టుకొని మూడు నెలలుగా టీడీపీ నేతలు ఒక పథకం ప్రకారం సాగించిన దందా దాగి ఉంది. ఓ పక్క బీమా ఆశ చూపించడం, మరోపక్క పథకాలు ఆగిపోతాయన్న బెది­రిం­పులు, ఇంకోపక్క మాయమాటలు.. ఇలా సభ్యత్వాలన్నీ ప్రజలకు ఇష్టం లేకపోయినా బలవంతంగా చేయించినవేనని టీడీపీ నేతలే చెబుతున్నారు.

టీడీపీ సభ్యత్వం (TDP Membership) తీసుకున్న వారికి రూ.5 లక్షల బీమా ఉంటుందని ఆ పార్టీ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. సభ్యత్వాల నమోదు ప్రారంభానికి ముందే చంద్రబాబు గతంలో రూ.2 లక్షలుగా ఉన్న ఈ బీమాను రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. దాని గురించి ప్రచారం చేయడంతోపాటు ప్రతి గ్రామంలోని ఓటర్లలో 80 శాతం మందిని సభ్యులుగా చేర్చాలని నేతలపై ఒత్తిడి చేశారు. సభ్యత్వాలు చేయించిన వారికే పార్టీలో అవకాశాలు ఉంటాయని చెప్పారు. దీంతో నేతలు, కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి టీడీపీ సభ్యత్వం తీసుకుంటే ఉచితంగా రూ.5 లక్షల బీమా వస్తుందని ప్రజల్ని నమ్మించారు. 

సభ్యత్వం ఉంటేనే పథకాలని బెదిరింపులు 
మరోపక్క టీడీపీ  సభ్యత్వం ఉంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు వస్తాయని, లేకుంటే రావని ఇంటింటికీ తిరిగి బెదిరింపులకు దిగారు. ప్రజల నుంచి ఆధార్‌ కార్డులు తీసుకుని పేర్లు రాసేసి, సభ్యత్వ రుసుము రూ.100 కూడా నాయకులే కట్టేశారు. ఈ కార్యక్రమాన్ని మంగళగిరి టీడీపీ కార్యాలయం నుంచి నిరంతరం పర్యవేక్షించారు. ఏ నియోజకవర్గంలో ఎంత శాతం సభ్యత్వాలు అయ్యాయో విశ్లేషిస్తూ తగ్గిన నియోజకవర్గాల నాయకులను హెచ్చరించారు. చంద్రబాబు పలుసార్లు టెలీ కాన్ఫరెన్స్‌లు నిర్వహించి తక్కువ సభ్యత్వాలు నమోదైన నియో­జకవర్గాల నేతలకు చీవాట్లు పెట్టారు. దీంతో వారు గ్రామాలు, వార్డుల్లో తిష్టవేసి బలవంతంగా సభ్యత్వాలు చేయించారు. కొన్ని గ్రామాల్లో ఏకంగా 80, 90 శాతం ఓటర్లను తమ సభ్యులుగా చేర్పించేశారు.  

ముచ్చర్లలో బయటపడిన బాగోతం 
విశాఖ జిల్లా ఆనందపురం మండలం ముచ్చర్ల గ్రామంలో ఏకంగా గ్రామంలోని వంద శాతం ఓటర్లను సభ్యులుగా నమోదు చేశారు. వంద శాతం సభ్యత్వ నమోదు జరిగిన గ్రామంగా ముచ్చర్లను ప్రకటించి సీఎం తనయుడు లోకేశ్‌తో అక్కడ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే అక్కడి సభ్యత్వాల లోగుట్టును వైఎస్సార్‌సీపీ నేత గుడివాడ అమర్‌నాథ్‌ బయటపెట్టడంతో లోకేశ్‌ పర్యటనను రద్దు చేసుకున్నారు. ముచ్చర్ల ఈనాం అన్‌ సెటిల్డ్‌ గ్రామం కావడంతో అక్కడున్న 600 ఎకరాలు వివాదంలో ఉన్నాయి. ఆ భూములకు పట్టాలు ఇప్పిస్తామని నమ్మబలికి, గ్రామస్తుల ఆధార్‌ కార్డులు తీసుకుని టీడీపీ సభ్యత్వాలు నమోదు చేయించినట్లు బయటపడింది.

నిజానికి ఆ గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులంతా వైఎస్సార్‌సీపీకి చెందినవారు. ఆ గ్రామంలో సుమారు 1,350 ఓట్లు ఉంటే గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 600కిపైగా ఓట్లు వచ్చాయి. జనసేన, బీజేపీ, వామపక్ష పార్టీల నేతలు కూడా ఆ గ్రామంలో ఉన్నారు. అలాంటి గ్రామంలో నూటికి నూరు శాతం టీడీపీ సభ్యత్వాల నమోదు ఎలా సాధ్యమైందనే ప్రశ్నకు సమాధానం కరువైంది. అందుకే ఆ గ్రామానికి రాకుండా లోకేశ్‌ జారుకున్నారు. దాదాపు అన్ని గ్రామాల్లోనూ ఇదే రీతిలో టీడీపీ శ్రేణులు బోగస్‌ సభ్యత్వాలు చేయించారు.

వైఎస్సార్‌ బీమాను పణంగా పెట్టి..
మరోవైపు టీడీపీ సభ్యత్వాల కోసం రాజకీయాలకు అతీతంగా అందరికీ అమలైన వైఎస్సార్‌ బీమా పథకాన్ని కూటమి ప్రభుత్వం నిలిపి వేసింది. ప్రతి గ్రామ, వార్డు సచివాలయం పరిధిలోని ప్రతి ఒక్కరితో వలంటీర్లు ఈ బీమాకు దరఖాస్తు చేయించారు. ఎవరైనా రోడ్డు ప్రమాదంలోనో, అనారోగ్యంతోనే చనిపోతే నేరుగా వారి ఖాతాల్లో రూ.5 లక్షల బీమా సొమ్ము జమ అయ్యేది. మృతుని కుటుంబానికి తక్షణం రూ.10 వేలు ఇచ్చేవారు. కూటమి ప్రభుత్వం రాగానే ఈ పథకాన్ని నిలిపివేసి, టీడీపీ సభ్యత్వాల నమోదు ప్రారంభించారు. టీడీపీ సభ్యత్వం తీసుకుంటే రూ.5 లక్షల బీమా వస్తుందని చెప్పారు. 

వైఎస్సార్‌ బీమా లేదు కాబట్టి ఇదైనా వస్తుందనే ఆశతో చాలామంది తప్పనిసరై సభ్యత్వం తీసుకున్నారు. కానీ, ఎవరికీ బీమా వర్తించడంలేదు. కృష్ణా జిల్లా మంటాడకు చెందిన ఆరేపల్లి సత్యనరేంద్ర వరప్రసాద్‌ (37) ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోతే అతని కుటుంబానికి ఒక్క రూపాయి పరిహారం రాలేదు. వైఎస్సార్‌ బీమా ఉంటే అతనికి రూ.5 లక్షలు వచ్చేది. ఇప్పుడు ఎలాంటి పరిహారం అందక ఆ కుటుంబం ఇబ్బందులు పడుతోంది. ప్రతి గ్రామంలోనూ ఇలాంటి కేసులు పదుల సంఖ్యలో ఉన్నాయి. బీమా పేరుతో టీడీపీ చేస్తున్న మోసపూరిత సభ్యత్వ నమోదుకు ఇదో నిదర్శనం. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
TDP
membership
Telugu Desam Party
Andhra Pradesh
Fact Check
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.