Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. జెండా ఎగరేస్తే.. నిన్ను ఇక్కడే పాతేస్తా నా...!
ADVERTISEMENT 

జెండా ఎగరేస్తే.. నిన్ను ఇక్కడే పాతేస్తా నా...!

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Aug 16, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
flag.jpg

పంచాయతీ సర్పంచ్‌పై టీడీపీ కార్యకర్త దాడి 

వత్తాసు పలికిన పోలీసులు 

సర్పంచ్‌నే స్టేషన్‌కు తరలించి, నిర్బంధించిన డీఎస్పీ

తీవ్ర ఒత్తిడిలో స్టేషన్‌లోనే కుప్పకూలిన వైఎస్సార్‌సీపీ నేత 

తిరుపతి జిల్లాలో దారుణం

చంద్రగిరి:  స్వాతంత్య్ర దినోత్సవంనాడు తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. జాతీయ పతాకం ఆవిష్కరణకు వచ్చిన పంచాయతీ సర్పంచ్‌పై ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ‘‘జెండా ఎగరేస్తే నిన్ను ఇక్కడే పాతేస్తా నా.. ’’ అంటూ దాడికి పాల్పడ్డాడు. దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్‌ చేయాల్సిన పోలీసులు,  రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి  సెల్యూట్‌ చేస్తూ జెండా ఎగురవేయనీయకుండా అడ్డుకుని సర్పంచ్‌నే బలవంతంగా స్టేషన్‌కు తరలించడంతో, తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన వైఎస్సార్‌సీపీ నేత అక్కడికక్కడే కుప్పకూలారు. 

వివరాల్లోకి వెళితే,  2024 ఎన్నికల అనంతరం టీడీపీ నాయకుల తీవ్ర హింసాకాండ నేపథ్యంలో మండల పరిధిలోని రామిరెడ్డిపల్లి పంచాయతీ సర్పంచ్, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు కొటాల చంద్రశేఖర్‌రెడ్డి గ్రామం విడిచి వెళ్లిపోయి, ప్రస్తుతం చంద్రగిరిలో ఉంటున్నారు. హైకోర్టు రూలింగ్‌ నేపథ్యంలో ఆయన గ్రామంలోకి అప్పుడప్పుడూ వచ్చి వెళుతున్నా..  పూర్తిగా గ్రామంలో ఉండలేని దారుణ పరిస్థితి. ఈ నేపథ్యంలో  పంచాయతీ ప్రథమ పౌరునిగా ఆగస్టు 15న గ్రామ సచివాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణకు చంద్రశేఖర్‌రెడ్డి రామిరెడ్డిపల్లికి వెళ్లారు.

ఈ సందర్భంలో పంచాయతీ పరిధిలోని కూచువారిపల్లికి చెందిన మురళీనాయుడు కొంత మంది అల్లరి మూకలను తీసుకొచ్చి  జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని అడ్డుకున్నాడు. ‘‘ఈ ఊర్లోకి వచ్చేందుకు నీకు ఎంత ధైర్యం రా.. జెండా ఎగరేస్తే నిన్ను ఇక్కడే పాతేస్తా నా...’’ అంటూ బూతుపురాణం ఎత్తుకుని సర్పంచ్‌పై దాడికి యత్నించాడు. 

స్టేషన్‌లో తీవ్ర అవమానం 
సమాచారం అందుకున్న డీఎస్పీ ప్రసాద్‌ తన సిబ్బందితో కలసి సచివాలయం వద్దకు చేరుకున్నాడు. సర్పంచ్‌ జెండా ఆవిష్కరణలో పాల్గొనకుండా బలవంతంగా స్టేషన్‌కు తరలించాడు. 12.15 గంటల వరకూ రెండు గంటలకుపైగా స్టేషన్‌లోనే నిర్బంధించాడు. ఈ సందర్భంగా డీఎస్పీ టీడీపీ కార్యకర్త మురళీనాయుడు ఎదుటే సర్పంచ్‌ని అగౌరవపరుస్తూ మాట్లాడాడు.  దీనితో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న చంద్రశేఖర్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు లోనై అక్కడే కుప్పకూలి ప్రాణాపాయ స్థితిలోకి  వెళ్లారు.  

వెంటనే సీఐ ఇమ్రాన్‌ బాషా తన సిబ్బందితో కలసి పోలీసు వాహనంలో ఆయనను తిరుపతి రుయాకు తరలించారు. ఈ సమాచారంతో చంద్రశేఖర్‌రెడ్డి కుటుంబ సభ్యులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున రుయాకు చేరుకున్నాయి. ఆయనను  మెరుగైన వైద్యం కోసం  తిరుపతిలోని నారాయణాద్రి ఆసుపత్రికి తరలించారు. 

ఐసీయూలో అత్యవసర వైద్య సేవలు అందించడంతో చంద్రశేఖర్‌రెడ్డి  ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు.  ఐసీయూలో చికిత్స పొందుతున్న  చంద్రశేఖర్‌ రెడ్డిని వైఎస్సార్‌సీపీ చంద్రగిరి ఇన్‌చార్జి చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్‌ రెడ్డి తదితర పార్టీ నాయకులు పరామర్శించారు. టీడీపీ రెడ్‌బుక్,  ప్రజావ్యతిరేక చర్యలపై పోరులో వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Andhra Pradesh
YSRCP
chandrasekhar reddy
Panchayat Sarpanch
Telugu Desam Party
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.