Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. ఆదాయం అ'ధర'హో
ADVERTISEMENT 

ఆదాయం అ'ధర'హో

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Nov 19, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
df.jpg

గిరి రైతు క్షేత్రంలో సిరులు

డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగులో నిలకడగా ఆదాయం ఆర్జిస్తున్న గిరి రైతు

అంతర పంటగా బంతి

అనుకూలించిన వాతావరణ పరిస్థితులు

ఎకరాకు రూ.2 లక్షల ఆదాయం పొందుతున్న గిరిజన రైతు నాగేశ్వరరావు 

పశువుల ఎరువు వినియోగంతో నాణ్యమైన దిగుబడి 

స్థానికంగానే మార్కెటింగ్‌ తప్పిన దళారుల సమస్య

డ్రాగన్‌ ప్రూట్‌ సాగులో మంచి ఫలితాలు సాధిస్తున్నారు కొర్రాయి పంచాయతీ శాంతినగర్‌కు చెందిన గిరిజన రైతు గుజ్జెల నాగేశ్వరరావు. ఎకరా విస్తీర్ణంలో సాగు చేపట్టిన ఆయన రూ.2 లక్షల మేర ఆదాయం పొందుతున్నారు. అంతర పంటగా బంతి వేయడం  వల్ల ఆదనంగా ఆదాయం వస్తోందని ఆయన తెలిపారు. దళారులు, వ్యాపారులపై ఆధారపడకుండా స్థానికంగా అందుబాటులో ఉన్న మార్కెటింగ్‌ వనరులను సది్వనియోగం చేసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. 

డుంబ్రిగుడ: మండలంలోని కొర్రాయి పంచాయతీ శాంతినగర్‌కు చెందిన గిరిజన కుటుంబానికి చెందిన గుజ్జెల నాగేశ్వరరావు డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు చేపట్టి మంచి ఆదాయం పొందుతున్నారు. విశాఖ షిప్‌యార్డులో కాంట్రాక్ట్‌ ఉద్యోగం చేస్తున్న ఆయనకు వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం. అయితే అందరిలా కాకుండా ఆయన వినూత్నంగా ఆలోచించారు. ఈ ప్రాంత వాతావరణం అనుకూలంగా ఉన్నందున డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగుపై దృష్టి సారించారు. గతేడాది ట్రెల్లీస్‌ పద్ధతిలో జైన్‌ రకానికి చెందిన రెండు వేల మొక్కలను ఎకరా విస్తీర్ణంలో నాటారు. 
 
ఒకొక్క మొక్క రూ.75.. 
ఒకొక్క మొక్కను గుంటూరులోని ఓ క్షేత్రంలో రూ. 75 చొప్పున కొనుగోలు చేశారు. ట్రెల్లీస్‌ విధానంలో కీలకమైన సిమెంట్‌ స్తంభాలు ఒకొక్కటి రూ.350 చొప్పున 500 కొనుగోలు చేశారు. మొత్తమ్మీద మొక్కలు, సిమెంటు స్తంభాలు, కూలి ఖర్చులు కలిపి ఎకరాకు 1.50 లక్షల వరకు పెట్టుబడి అయిందని రైతు తెలిపారు.  

»  నాటిన తొమ్మిది నెలలకు కాపు మొదలైంది. ఈ ఏడాది పూర్తిగా దిగుబడి వచ్చింది. కిలో రూ.200 చొప్పున విక్రయించగా సుమారు రూ.2 లక్షల వరకు ఆదాయం వచ్చిందని రైతు పేర్కొన్నారు.   

»   భూమిని సారవంతం చేసేందుకు రసాయన ఎరువులకు బదులుగా పశువుల ఎరువు వినియోగించారు. ఎకరాకు ఐదు ట్రాక్టర్లు గెత్తం వాడినట్టు రైతు తెలిపారు. దీనివల్ల దిగుబడి పెరగడంతో పాటు పండు నాణ్యతగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఒకసారి నాటితే సుమారు 30 సంవత్సరాల వరకు నిలకడగా దిగుబడి వస్తుందని ఆయన వివరించారు.  

»  ట్రెల్లీస్‌ విధానంలో సాగు చేపట్టడం వల్ల మొక్కకు గాలి తగిలి ఏపుగా పెరుగుతుంది. మొక్కకు మొక్కకు మధ్య పది అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు దూరం ఉండాలి. ఒక మొక్క నుంచి సుమారు 20 వరకు పండ్ల దిగుబడి వస్తుందని రైతు తెలిపారు. 

»  పర్యాటక ప్రాంతం కావడం వల్ల మార్కెటింగ్‌ స్థానికంగా అందుబాటులో ఉంది. అరకు పైనరీ, గిరిజన మ్యూజియంతో పాటు స్థానిక మార్కె­ట్లో విక్రయించడం వల్ల దళారుల ప్రభావం లేదని రైతు తెలిపారు. దీనివల్ల ఆయన మంచి ఆదాయం పొందగలుగుతున్నారు.  

»  అంతరపంటగా ముద్దబంతి సాగు చేపట్టారు. దీనిపై ఏటా అక్టోబర్, నవంబర్‌లో వచ్చే ఆదాయం తోట నిర్వహణ ఖర్చులకు సరిపోతుందని రైతు తెలిపారు. ఉద్యానవనశాఖ ఎకరాకు రూ.13 వేలు పెట్టుబడి సాయంగా అందజేసిందని రైతు తెలిపారు. ఇంటిల్లపాది కష్టపడి పనిచేయడం వల్ల ఏటా నిర్వహణ ఖర్చులు తగ్గడం వల్ల రెండో ఏడాది మంచి ఆదాయం వచ్చిందని రైతు నాగేశ్వరరావు వివరించారు.

సాగును ప్రోత్సహిస్తాం 
డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు చేపట్టే రైతులకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తున్నాం. ఉద్యానవన శాఖ తరఫున ఎకరాకు రూ.13 వేల చొప్పున ఆర్థిక సాయం పొందవచ్చు. అయితే ఈ ఏడాది ఎటువంటి నిధులు మంజూరు కాలేదు. వ్యవసాయ, ఉద్యానవన శాఖల ద్వారా సాగునీటి బోర్లు మంజూరైతే తప్పనిసరిగా డ్రాగన్‌ ఫ్రూట్‌ రైతులకు కేటాయిస్తాం.         – కె.శిరీష,ఉద్యానవనశాఖ అధికారి, డుంబ్రిగుడ  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Andhra Pradesh
Dragon Fruit
Nageswara Rao
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.