Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. తల్లి త్యాగాలను వెలకట్టలేం
ADVERTISEMENT 

తల్లి త్యాగాలను వెలకట్టలేం

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Mar 24, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
mother.jpg

పురుషుల కన్నా మహిళలే మానసికంగా దృఢమైనవారు     

నేనీస్థాయిలో ఉండటానికి తల్లి, సోదరి, భార్యే కారణం 

ఏపీకి చెందిన వాడిని కావడం వల్లే సుప్రీంకోర్టు జడ్జినయ్యా

హైకోర్టులో సన్మాన కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ భట్టీ 

మహిళా న్యాయమూర్తులు, సీనియర్‌ మహిళా న్యాయవాదులకు ఘన సన్మానం

సాక్షి, అమరావతి: పురుషులు కన్నా మహిళలు మానసికంగా దృఢవంతులని, తన బిడ్డలను ప్రయో­జకులుగా చేసేందుకు తల్లి ఎన్నో త్యాగా­లు చేస్తుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సరసి వెంకట నారాయణ భట్టీ అన్నారు. తల్లి త్యాగాలను వేటితోనూ వెలకట్టలేమన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకు­ని హైకోర్టు న్యాయవాదుల సంఘం, మహిళా న్యాయవాదుల సమాఖ్య సంయుక్తంగా శనివారం హైకోర్టు మహిళా న్యాయమూర్తులను, మహిళా సీనియర్‌ న్యాయవాదులను సన్మానించింది. హైకోర్టులో జరిగిన ఈ కార్యక్రమానికి జస్టిస్‌ భట్టీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్, సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయిలతో కలిసి హైకోర్టు మహిళా న్యాయమూర్తులయిన జస్టిస్‌ బి.శ్రీభానుమతి, జస్టిస్‌ ప్రతాప వెంకట జ్యోతిర్మయి, జస్టిస్‌ మండవ కిరణ్మయి, జస్టిస్‌ జగడం సుమతి, ఉపలోకాయుక్త పి.రజనీరెడ్డి, సీనియర్‌ న్యాయవాదులు కేఎన్‌ విజయలక్ష్మి, ప్రేమలత, అచ్చెమ్మలను జస్టిస్‌ భట్టీ శాలువాలతో సన్మానించి, జ్ఞాపికలు బహూకరించారు.

అనంతరం జస్టిస్‌ భట్టీ, ఆయన సతీమణి అనుపమలను హైకోర్టు న్యాయవాదుల సంఘం, మహిళా న్యాయవాదుల సమాఖ్య, ఇతర న్యాయవాదులు గజమాలతో, శాలువాలతో వేదమంత్రోచ్చరణ మధ్య ఘనంగా సన్మానించి జ్ఞాపికలు బహూకరించారు. అలాగే హైకోర్టు ఉద్యోగుల సంఘం, న్యాయవాద పరిషత్‌ తదితర సంఘాలు కూడా జస్టిస్‌ భట్టీని సన్మానించాయి. 



మదనపల్లి మాణిక్యం.. 

జస్టిస్‌ శేషసాయి మాట్లాడుతూ, జస్టిస్‌ భట్టీని ‘మదనపల్లి మాణిక్యం’గా అభివర్ణించారు. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబంలో తల్లి పాత్ర కీలకంగా మారిందన్నారు. విజయవాడ రామవరప్పాడు రైల్వేస్టేషన్‌ గతంలో అసాంఘిక శక్తులకు చిరునామాగా ఉండేదని, ఆ స్టేషన్‌ బాధ్యతలను మహిళలకు అప్పగించిన తరువాత దేశంలోనే అత్యుత్తమ స్టేషన్‌గా మారిందన్నారు.

మహిళా శక్తికి ఇదో నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.జానకిరామిరెడ్డి, మహిళా న్యాయవాదుల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు భాస్కరలక్ష్మి, అధ్యక్షురాలు కె.అరుణ, బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ గంటా రామారావు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ యర్రంరెడ్డి నాగిరెడ్డి ప్రసంగించారు. హైకోర్టు న్యాయమూర్తులు, పెద్ద సంఖ్యలో న్యాయవాదులు,  రిజిస్ట్రార్లు, సిబ్బంది పాల్గొన్నారు.



సమర్థత వల్లే జస్టిస్‌ భట్టీ సుప్రీంకోర్టు జడ్జి అయ్యారు 

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ, వృత్తిపట్ల నిబద్ధత, నిజాయితీ, సమర్థత, కష్టపడేతత్వం వల్లే జస్టిస్‌ భట్టీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కాగలిగారని తెలిపారు. మహిళలు ఎదుర్కొంటున్న అసమానత్వాన్ని రూపుమాపేందుకు నిర్మాణాత్మక చర్యలు అవసరమన్నారు. మహిళల రక్షణ కోసం రాజ్యాంగంలో పలు అధికరణలున్నాయని, అవి సమర్థవంతంగా అమలయ్యేందుకు న్యాయస్థానాలు ఎప్పటికప్పుడు ఉత్తర్వులిస్తున్నాయన్నారు.



సమాజ నిర్మాణంలో మహిళలది కీలకపాత్ర

ఈ సందర్భంగా జస్టిస్‌ భట్టీ మాట్లాడుతూ, సమాజ నిర్మాణంలో మహిళలదే కీలక పాత్ర అని చెప్పారు. తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి తన తల్లి, సోదరి, భార్యే కారణమన్నారు. తన తల్లి ఇచ్చిన ధైర్యం, తన సోదరి ఇచ్చిన సలహాలు, తన సతీమణి ఇచ్చిన మద్దతు కారణంగానే తాను ఈ స్థాయిలో ఉన్నానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాడిని కావడం వల్లే తాను సుప్రీంకోర్టు న్యాయమూర్తిని అయ్యానని చెప్పారు.

ఏపీ హైకోర్టుకు సదా రుణపడి ఉంటానని, ఎల్లవేళలా ఈ హైకోర్టుకు అండగా ఉంటానని చెప్పారు. ఉద్యోగాల పేరుతో అమాయక యువతులను మానవ అక్రమ రవాణా ఉచ్చులో దించుతున్నారని, ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రజలను చైతన్యపరిచే దిశగా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన మహిళా న్యాయవాదుల సమాఖ్య, రాష్ట్ర న్యా యసేవాధికార సంస్థలను కోరారు. ఇందుకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Supreme court of India
Justice
venkata narayana
Felicitation
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

లైంగిక నేరాల కేసుల్లో న్యాయ సున్నితత్వం అవసరం: సుప్రీం కోర్టు

లైంగిక నేరాల కేసుల్లో న్యాయ సున్నితత్వం అవసరం: సుప్రీం కోర్టు

సోనమ్‌ బెయిల్‌పై సుప్రీం కోర్టు అనుమానాలు!

సోనమ్‌ బెయిల్‌పై సుప్రీం కోర్టు అనుమానాలు!

కొలీజియం నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం! 

కొలీజియం నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం! 

నడకదారి ఇక పౌరుల హక్కు

నడకదారి ఇక పౌరుల హక్కు

ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఆరోపణల పిల్‌ కొట్టివేత 

ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఆరోపణల పిల్‌ కొట్టివేత 

సుప్రీం కోర్టులో మీనాక్షి నటరాజన్‌కు ఎదురుదెబ్బ

సుప్రీం కోర్టులో మీనాక్షి నటరాజన్‌కు ఎదురుదెబ్బ

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.