Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. టీడీపీ కీలక నేత.. నోరు విప్పితే బూతు పురాణం!
ADVERTISEMENT 

టీడీపీ కీలక నేత.. నోరు విప్పితే బూతు పురాణం!

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Mar 12, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
555.jpg
  • శ్రీకాకుళం కార్పొరేషన్‌లో మరో ఇంజనీరింగ్‌ అధికారి అవుట్‌. మున్సిపల్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న పి.కమలాకర్‌ కీలక నేత టార్చర్‌ భరించలేక సెలవు పెట్టేసినట్టు తెలిసింది. చెప్పిన పనులన్నీ చేయలేక చేతులెత్తేశారు. అడ్డగోలుగా బిల్లులు చెల్లించలేక తప్పుకుంటున్నారు. కీలక నేత నోటి దురుసును తట్టుకోలేక వెళ్లిపోవడమే మంచిదంటూ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అనారోగ్య సమస్యలు చూపించి సెలవు కోసం దరఖాస్తు చేశారు. అంతకుముందే వీఆర్‌ కోసం కూడా దరఖాస్తు చేశారు. ఎంతవేగంగా తనను వదిలేస్తే అంత మంచిదని కోరుకుంటున్నారు. 
     
    గార తహసీల్దార్‌గా పనిచేస్తున్న చక్రవర్తి కూడా సెలవుపై వెళ్లిపోయారు. ఈయన కూడా కీలక నేత, అనుచరుల సతాయింపు భరించలేక సెలవు పెట్టేసి ఆఫీసుకు రావడం మానేశారు. అంపోలులో వివాదాస్పద భూములను పచ్చ నేతలకు రాసిచ్చేయాలని ఒత్తిడి చేయడమే కాకుండా అందరి మధ్య నోటికొచ్చినట్టు బూతులు తిట్టడంతో మనస్థాపానికి గురై సెలవుపై వెళ్లిపోయినట్టు తెలిసింది.  

  • జిల్లా పౌరసరఫరాల అధికారులు సైతం ఇదే రకమైన సతాయింపునకు గురవుతున్నారు. కీలక నేత మాటలు తట్టుకోలేక, ఆయన చెప్పినదల్లా చేయలేక ఎంత వేగంగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలా? అని చూస్తున్నారు. గ్రామాల్లో ఉన్న రేషన్‌ డీలర్లను తీసేయమని, సస్పెండ్‌ చేయమని ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. ఆ నేత చెప్పినట్టు చర్యలు తీసుకుంటే సదరు డీలర్లు హైకోర్టుకు వెళ్లి అనుకూల ఆర్డర్లు తెచ్చుకోవడంతో తప్పని పరిస్థితుల్లో చర్యలు ఉపసంహరించుకోవల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దానికి కారణం అధికారులే అంటూ ఒంటికాలిపై లేచి వారిని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నట్టు సమాచారం.    

  • సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం నియోజకవర్గంలో కీలక నేత టార్చర్‌ భరించలేక అధికారులు భయపడుతున్నారు. చెప్పినట్టు చేయాలని, సూచించినట్టు బిల్లులు చేయాలని, ఆదేశించిన వారిపై చర్యలు తీసుకోవాలని పీకమీద కత్తి మీద పెడుతుండటంతో  హడలెత్తిపోతున్నారు. చర్యలు తీసుకోకపోతే కీలక నేత ఒత్తిడి.. చర్యలు తీసుకుంటే కోర్టుల నుంచి అక్షింతలు.. వెరసి ముందుకెళ్లితే నుయ్యి వెనక్కి వెళ్లితే గొయ్యి అన్న చందంగా అధికారుల పరిస్థితి తయారైంది. దీపం ఉండగా ఇళ్లు చక్క దిద్దుకోవాలన్న ఆలోచనతో సంపాదించడమే పనిగా పెట్టుకున్న సదరు కీలక నేత దాని కోసం అడ్డదారులు తొక్కుతూ అధికారులను ఒత్తిడికి గురి చేస్తున్నారు.  

    నోరు విప్పితే బూతులే..  
    ఆ కీలక నేత నోరు విప్పితే చాలు బూతులే వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఏకంగా ఉద్యోగుల పైకే వచ్చేస్తూ పరుష పదజాలంతో దూషిస్తున్నారు. ఇలాగే, గతంలో ఓ జిల్లా అధికారిని నోటికొచ్చినట్టు మాట్లాడితే ఆయన తిరగబడ్డాడు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అధికారి కావడంతో వ్యవహారం పెద్దదైపోతుందని రాజీ ధోరణికి వచ్చారు. ఆ తర్వాత కార్పొరేషన్‌లో దక్షిణామూర్తి అనే అధికారి కూడా కీలక నేత బూతులు భరించలేక వెళ్లిపోయారు. 

    తాజాగా మరో ఇద్దరు బాధితులు..  
    డయేరియాకు ముందు కమిషనర్‌గా వచ్చిన హనుమంతు కూర్మారావు సస్పెన్షన్‌ వెనక కూడా కీలక నేత హస్తం ఉందని ఆరోపణలు ఉన్నాయి. చేసిందంతా చేసి తిరిగి ఇంటికి వెళ్లి పరామర్శించి, తనకేమి సంబంధం లేదన్నట్టుగా కలరింగ్‌ ఇచ్చుకున్నారు. తాజాగా మున్సిపల్‌ ఇంజనీర్‌ కమలాకర్‌ కూడా ఈయన బాధితుడయ్యారని అంటున్నారు. సతాయింపుతో పాటు అడ్డగోలుగా బిల్లులు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో రిటైర్‌మెంట్‌ దగ్గరకు వచ్చే వేళ తప్పు చేస్తే తనకు రావాల్సిన బెనిఫిట్స్‌కు గండి పడుతుందన్న ఉద్దేశంతో  ముందస్తు అప్రమత్తతతో సెలవుపై వెళ్లేందుకు దరఖాస్తు పెట్టుకున్నట్టు చర్చ జరుగుతోంది. ఈయన్నే కాదు కార్పొరేషన్‌ పనిచేస్తున్న అనేక మంది అధికారులను కీలక నేత నోటికొచ్చినట్టు మాట్లాడటమే కాకుండా బూతు పురాణం విప్పుతున్నట్టు ఎప్పటి నుంచో విని్పస్తోంది. 

    అన్నింటా అదే తీరు.. 
    మున్సిపల్‌ కార్పొరేషన్, రిమ్స్, తహసీల్దార్, మండల పరిషత్‌ కార్యాలయాలతో పాటు ఇతర కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులపైన సదరు కీలక నేత జులుం ప్రదర్శిస్తున్నారు. కొందరు అధికారులు జీ హుజూర్‌ అంటుండగా.. తమకు ఎప్పటికైనా ముప్పు తప్పదనే వారు సెలవుపై వెళ్లిపోతున్నారు.   

     

     

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Srikakulam
TDP
Leader
Pressure
Andhra Pradesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.