Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. 3 జిల్లాల ఎస్పీలు వివరణ ఇచ్చారు 
ADVERTISEMENT 

3 జిల్లాల ఎస్పీలు వివరణ ఇచ్చారు 

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Mar 22, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
elect.jpg

వారి నివేదికలను కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తాం 

నారా భువనేశ్వరి చెక్కుల పంపిణీపై కలెక్టర్ల నివేదిక కోరాం 

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా 

సాక్షి, అమరావతి: నంద్యాల, ప్రకాశం జిల్లాల్లో జరిగిన హత్యలు, పల్నాడు జిల్లాలో కారు దహనంపై ఆ మూడు జిల్లాల ఎస్పీలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముఖేష్‌ కుమార్‌ మీనాకు వివరణ ఇచ్చారు. సీఈవో మీనా ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీరా రెడ్డి, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌ రెడ్డి, పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్‌ రెడ్డి గురువారం సాయంత్రం సచివాలయంలోని సీఈవో కార్యాలయానికి వచ్చారు.

అక్కడ సీఈవో ముఖేష్‌ కుమార్‌ మీనా, అదనపు డీజీపీ (లా అండ్‌ ఆర్డర్‌) శంకబ్రత్‌ బాగ్చీ ఎదుట హాజరై ఆ సంఘటనలకు దారి తీసిన పరిస్థితులు, అనంతరం తాము చేపట్టిన చర్యలపై నివేదికలు అందజేశారు. అనంతరం సీఈవో మీనా విలేకరులతో మాట్లాడుతూ గిద్దలూరులో జరిగినది రాజకీయ హింసేనని ఎస్పీ నివేదిక ఇచ్చారని తెలిపారు.

ఆళ్లగడ్డలో జరిగిన హత్య కుటుంబ కక్షల వల్ల జరిగిందని ఆ జిల్లా ఎస్పీ వివరించారన్నారు. మాచర్లలో రెండు వర్గాల ఘర్షణ సందర్భంగా కారు దహనం జరిగిందని, గురువారం రాత్రిలోగా నిందితులను అరెస్ట్‌ చేస్తామని పల్నాడు ఎస్పీ చెప్పినట్లు తెలిపారు. ఎస్పీలు ఇచ్చిన నివేదికలను కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీకి) సమర్పిస్తామని తెలిపారు. ఎన్నికల్లో ఎటువంటి హింసాత్మక ఘటనలు, రీపోలింగ్‌ లేకుండా నిర్వహించాలనేది తమ లక్ష్యమని చెప్పారు. రాజకీయ హింసను నిరోధించేలా కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. 



చెక్కులు పంపిణీ చేస్తే కోడ్‌ ఉల్లంఘనే 

నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమంలో చెక్కులు పంపిణీ చేసినట్లు వచ్చిన ఫిర్యాదులపై ఆ జిల్లాల కలెక్టర్ల నుంచి నివేదికలు కోరినట్లు మీనా తెలిపారు. డబ్బులు పంపిణీ కోడ్‌ ఉల్లంఘన కిందకే వస్తుందని స్పష్టం చేశారు. నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో చేపట్టిన పరామర్శ యాత్ర కొనసాగించవచ్చని, కానీ చెక్కులు పంపిణీ చేయకూడదని ఆయన స్పష్టం చేశారు. 



ప్రధాని సభలో భద్రత వైఫల్యంపై ఈసీ నివేదిక కోరింది 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న చిలకలూరిపేట బహిరంగ సభలో భద్రత వైఫల్యంపై ఈసీ నివేదిక కోరిందని మీనా తెలిపారు. ఈ సభలో భద్రత వైఫల్యంపై వివిధ రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ సభలో జరిగిన సంఘటనలపై వాస్తవాలను సమర్పించాలని ఈసీ కోరిందని, త్వరలోనే పూర్తి వివరాలను తెప్పించుకొని నివేదిక పంపుతామని తెలిపారు.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Mukesh Kumar Meena
murder case
car
Burning
SP
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

తేజ్ ప్రతాప్ యాదవ్ హత్యకు కుట్ర?

తేజ్ ప్రతాప్ యాదవ్ హత్యకు కుట్ర?

సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.. సీఐ నాగరాజుపై మర్డర్ కేసు..!

సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.. సీఐ నాగరాజుపై మర్డర్ కేసు..!

సీక్రెట్‌ పెళ్లి, ఫస్ట్‌ యానివర్శరీ ఇన్‌స్టా స్టోరీ: తీరా ఆరా తీస్తే..!

సీక్రెట్‌ పెళ్లి, ఫస్ట్‌ యానివర్శరీ ఇన్‌స్టా స్టోరీ: తీరా ఆరా తీస్తే..!

వాట్సాప్‌ స్టేటస్‌ విప్పిన గుట్టు!

వాట్సాప్‌ స్టేటస్‌ విప్పిన గుట్టు!

మీ ఎస్పీని బీఆర్‌ఎస్‌లో చేరమను!

మీ ఎస్పీని బీఆర్‌ఎస్‌లో చేరమను!

కత్తితో పొడిచి.. డంబెల్‌తో మోది

కత్తితో పొడిచి.. డంబెల్‌తో మోది

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.