Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. పంట నష్టం అంచనాకు ప్రత్యేక బృందాలు
ADVERTISEMENT 

పంట నష్టం అంచనాకు ప్రత్యేక బృందాలు

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Dec 7, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
panta_20loss.jpg

సాక్షి, అమరావతి: మిచాంగ్‌ తుపానుతో నష్టపోయిన రైతన్నలకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కొండంత భరోసానిస్తోంది. తుపాను కారణంగా కురిసిన వర్షాలకు తడిసి, తేమ శాతం, రంగు మారిన ధాన్యాన్ని సాంకేతిక కారణాలను పట్టించుకోకుండా, నిబంధనలు సడలించి మరీ ప్రభుత్వమే కొనుగోలు చేసింది. అదీ రైతులకు ఏమాత్రం నష్టం రాకుండా మద్దతు ధరకే కొని, మిల్లులకు తరలించింది.

మరోవైపు సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు పంట నష్టం అంచనా వేసేందుకు వ్యవసాయ, ఉద్యాన శాఖలు సన్నద్ధమయ్యాయి. రెవెన్యూ శాఖతో కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాయి. ఒకటి రెండ్రోజుల్లో ముంపు నీరు దిగిపోయిన వెంటనే క్షేత్రస్థాయి పర్యటనలకు ఈ బృందాలు సిద్ధమవుతున్నాయి. ఈ నెల మూడో వారంలోగా పంట నష్టం అంచనాలు కొలిక్కి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. నెలాఖరులోగా లేదా జనవరి మొదటి వారంలో పరిహారం పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 



సీఎం జగన్‌ ఆదేశాలతో రంగంలోకి 

ఖరీఫ్‌ సీజన్‌లో 64.35 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, 28.94 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగయ్యాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల ఏడు జిల్లాల్లో 14.91 లక్షల ఎకరాల్లో పంటలు ఇప్పటికే దెబ్బతిన్నట్టుగా గుర్తించారు. ఇక మిగిలిన విస్తీర్ణంలో 17 లక్షల ఎకరాల్లో పంటలు కోతలు పూర్తయ్యాయి. మరో 14.37 లక్షల ఎకరాల్లో కోతలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ దశలో మిచాంగ్‌ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేసాయి. ప్రాథమికంగా సుమారు 80 వేల ఎకరాల్లో పంటలు ముంపునకు గురి కాగా, మరో లక్ష ఎకరాలకు పైగా కోతకు సిద్ధంగా ఉన్న పంట నేల కొరిగినట్టు అంచనా వేశారు.

వరితో పాటు మిరప, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ పంటలపై ప్రభావం చూపినట్టుగా గుర్తించారు. అయితే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తుపాను ప్రారంభమైంది మొదలు ఎప్పటిక­ప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అధికారులను అప్ర­మత్తం చేశారు. రైతులకు అన్ని విధాలుగా అండగా నిలవాలని ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా కుండపోత వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు ఆర్బీకే సిబ్బందితో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా ఆర్బీకే సిబ్బంది రైతులతో నిత్యం మమేకమవుతూ వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారు.

స్వయంగా చేలకు వెళ్లి నష్ట నివారణకు తీసుకోవల్సిన చర్యలపై సూచనలు చేశారు. కోతలు పూర్తయిన పంటను కల్లాల నుంచే కొనుగోలు చేశారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటను కాపాడుకునేలా రైతులకు వెన్నుదన్నుగా నిలిచారు. ముంపునకు గురైన పొలాల్లో నీరు నిలవకుండా యుద్ధ ప్రాతిపదికన తీసుకున్న చర్యలు ఫలితాన్నిచ్చాయి. వర్షాలు తెరిపినిచ్చిన కొద్ది గంటల్లోనే చేలల్లోని నీరు కిందకు దిగిపోవడం మొదలైంది.

మరో వైపు నేలకొరిగిన వరి, ఇతర పంటలను కాపాడుకునేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. వరి పంటను కోయకుండా రైతులను అప్రమత్తం చేశారు. నేలకొరిగిన వరిచేలలో కూడా ఉప్పు ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నారు. వేరుశనగ, పత్తి, మిరప, శనగ, మిను­ము, పెసర తదితర పంటలు సాగు చేసిన రైతులను కూడా ఇదే రీతిలో అప్రమత్తం చేశారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
crop loss
storm
Farmers
YS Jagan Mohan Reddy
Rains affect
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

టెట్‌లో వీళ్లూ పాస్‌ కావాలనడం ఎంతవరకు కరెక్టు?: వైఎస్‌ జగన్‌

టెట్‌లో వీళ్లూ పాస్‌ కావాలనడం ఎంతవరకు కరెక్టు?: వైఎస్‌ జగన్‌

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

రేపు, ఎల్లుండి వైఎస్సార్‌ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన

రేపు, ఎల్లుండి వైఎస్సార్‌ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.