Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. ఆత్రేయపురం పూతరేకులకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?
ADVERTISEMENT 

ఆత్రేయపురం పూతరేకులకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Feb 26, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
putha1.jpg

రాజమహేంద్రవరం డెస్క్‌: ఆత్రేయపురం.. ఈ పేరు వినగానే ఠక్కున గుర్తుకు వచ్చేది పూతరేకు. ఈ పేరు వింటేనే నోరూరుతుంది. రుచిలో.. రూపంలో దీనికేదీ సాటి రాదు. ఆత్రేయపురంలో పుట్టి ఆ ప్రాంతానికి ఓ బ్రాండ్‌ ఇమేజిని తెచ్చిపెట్టింది అందుకే. వందేళ్లకు పైబడిన చరిత్రను సొంతం చేసుకున్న ఆత్రేయపురం పూతరేకులకు జియోగ్రాఫికల్‌ ఐడెంటిఫికేషన్‌ (జీఐ) ఇచ్చేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.

ఇందుకోసం విశాఖలోని దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వ విద్యాలయం సహకారంతో సర్‌ ఆర్థర్‌ కాటన్‌ పూతరేకుల సహకార సంఘం ఇప్పటికే దరఖాస్తు చేసింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఈ నెల 13న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం కాకపోతే మూడు నెలల్లోనే చెన్నైలోని జీఐ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం నుంచి ఆత్రేయపురం పూతరేకులకు గుర్తింపు జారీ అవుతుంది. దీంతో ఇక్కడి ప్రజల చిరకాల కోరిక నెరవేరుతుంది.

పూతరేకులకు స్ఫూర్తి

పూర్వం మైసూరుకు చెందిన ఒక మహిళ ఆత్రేయపురం కోడలిగా వచ్చింది. అప్పట్లో అన్నం వారుస్తుండగా వచ్చిన గంజి కుండపై పడి, రేకుగా వచ్చింది. దానిని చూసి విస్తుపోయిన ఆమె సరదాగా పంచదారతో కలిపి తిని ముచ్చట పడింది. అలా ఆవిర్భవించిందే పూతరేకు.

తొలినాళ్లలో క్షత్రియ మహిళలు ఈ రేకు తయారు చేసి, పంచదార అద్దేవారు. కాలక్రమంలో ఇతర వర్గాల మహిళలు కూడా ఈ రేకు తయారీ నేర్చుకున్నారు. ఉపాధిగా మార్చుకున్నారు. ఒక్క ఆత్రేయపురంలోనే సుమారు 400 కుటుంబాలు పూతరేకుల తయారీపై ఆధారపడ్డాయి. ఇతర ప్రాంతాలతో కలుపుకొంటే రెండు వేల మందికి పైగా మహిళలు ఈ రేకుల తయారీలో ఆరితేరిపోయారు. మనం ఎక్కడ పూతరేకు తిన్నా ఆ రేకు ఆత్రేయపురానిదేనని ఘంటాపథంగా చెప్పొచ్చు.

కాలానుగుణంగా ఎన్ని సోకులో.. 

తొలినాళ్లలో ఒక్క పంచదారతోనే పూతరేకులు తయారు చేసేవారు. ఇవి తెల్లగా మెరిసిపోతూ.. నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేవి. కాలానుగుణంగా మారుతున్న అభిరుచులకు అనుగుణంగా ఇందులోనూ అనేక రకాలు వచ్చేశాయి. బెల్లంతో తయారు చేస్తున్నారు. మధుమేహ బాధితుల కోసం షుగర్‌ ఫ్రీగా అమ్ముతున్నారు. కొందరు మరో అడుగు ముందుకేసి డ్రైఫూట్స్‌నూ కలుపుతున్నారు. అసలు రుచి మారినా.. కొత్త రుచితో ఉన్న పూతరేకులను ఎక్కువ మంది ఆదరిస్తున్నారు. ఈ రుచులను ఆస్వాదిస్తున్నారు. స్వీట్స్‌ ప్రియులను ఆకట్టుకోవడానికి బోర్న్‌విటా, హార్లిక్స్‌ వంటివి చల్లుతూ కొత్త ఫ్లేవర్లు తయారు చేస్తున్నారు.

రేకుల వెనుక రెక్కల కష్టం

సాధారణంగా మనం స్వీట్‌స్టాల్‌లో పూ తరేకుల ప్యాకెట్‌ రేటు అడగ్గానే కొంచెం ఎక్కువే ఉంటుంది. కానీ రేకుల తయారీదారుల మాటలు వింటే వా రికి పెద్దగా గిట్టుబాటు కావడం లేదు. గట్టిగా రోజంతా కష్టపడితే రూ.300 సంపాదిస్తున్నానని ఆత్రేయపురానికి చెందిన ఓ మహిళ చెప్పింది. మరికొందరు కూడా ఇదే తరహా ఆవేదన వ్యక్తం చేశారు.

కొందరు వ్యాపారులు వీరికి కొద్దోగొప్పో రుణం ఇచ్చి, తక్కువ కూలికే రేకులు తయారు చేయించుకుంటున్న వైనాలూ ఉంటున్నాయి. రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా తయారీ మహిళల నోట తీపి మాటలు మాత్రం వినిపించకపోవడం కొంత బాధ కలుగుతుంది. వీరందరినీ ఒక తాటి మీదకు తీసుకువస్తే మార్కెట్‌నూ శాసించగలుగుతారు. ఒకే తరహా రేటూ పొందగలుగుతారు.

పూతరేకుల కబుర్లు

♦దివంగత లోక్‌సభ మాజీ స్పీకర్‌ జీఎంసీ బాలయోగి కోనసీమలో తయారైన పిండి వంటలతో పాటు ఆత్రేయపురం పూతరేకులను అప్పటి ప్రధాని వాజ్‌పేయ్‌కు రుచి చూపించారని ఇక్కడి ప్రజలు గర్వంగా చెబుతారు. ఆత్రేయపురం పూతరేకుల ఖ్యాతిని మరింత వ్యాప్తి చేసేలా తపాలా శాఖ గత ఏడాది ప్రత్యేక తపాలా కవరు విడుదల చేసింది.

♦రాష్ట్ర పర్యాటక ప్రాధికార సంస్థ, భవానీ ల్యాండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (బీఐటీసీ) నేతృత్వంలో ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డు కోసం 10 మీటర్ల పూతరేకు తయారు చేసింది. ఇది ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డు సంపాదించినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. త్వరలో అధికారికంగా సర్టిఫికెట్‌ జారీ కానుంది.

♦చాలా సినిమాల్లో పూతరేకుల ప్రస్తావన కనిపిస్తుంది. దిగ్గజ బాలీవుడ్‌ నటుడు అమ్రీష్‌పురీకి అత్యంత ఇష్టమైన వాటిలో పేపర్‌ స్వీట్‌ (పూతరేకును ఆయన ముద్దుగా పిలుచుకునే పేరు) ఒకటని చెబుతారు.

ఏకతాటి మీదకు రావాలి

ఆత్రేయపురానికి విశిష్ట ఖ్యాతి ఆర్జించి పెడుతున్న పూతరేకుల తయారీలో మహిళలదే కీలక పాత్ర. ప్రస్తుతం అసంఘటితంగా ఉన్న వీరందరూ ఒకే తాటి పైకి రావాల్సిన అవసరముంది. నాణ్యత, మార్కెట్‌ విషయంలో ఏకాభిప్రాయానికి రావాలి. అప్పుడే వీరికి శ్రమకు తగ్గ ప్రతిఫలం వస్తుంది. తలోదారిలో తయారు చేసుకుంటూ పోతే మార్కెట్‌ను శాసించలేని పరిస్థితి ఉంటుంది. ఈ విషయంలో మార్పు రావాలి.

– గాదిరాజు ప్రసాదరాజు, ఆత్రేయపురం 

ప్రోత్సాహం అందించాలి

చాలా కాలం నుంచి పూత రేకులు తయారు చేస్తున్నాం. మా ముందు తరాల నుంచీ ఇదే చేస్తున్నాం. పేద మహిళలు చాలా మంది రేకులు తయారు చేస్తున్నారు. సరైన కూలి కూడా రావడం లేదు. ఎంతో ఓపికగా చేయాల్సిన పని ఇది. బ్యాంకులు ముందుకొచ్చి రుణాలు మంజూరు చేయాలి. ప్రోత్సాహం అందించాలి.

– జి. నాగమణి, ఆత్రేయపురం 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Atreyapuram Pootharekulu
special story
East godavari
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

రోకటిపాట కాదు రహస్య గీతం!

రోకటిపాట కాదు రహస్య గీతం!

ఫీజు కోసం ఎద్దుని అమ్మి...

ఫీజు కోసం ఎద్దుని అమ్మి...

మీరు నమ్మలేరు!! రష్యాలో ఉన్న ఆ రంధ్రం నరకానికి ద్వారం, ఇది నిజం!

మీరు నమ్మలేరు!! రష్యాలో ఉన్న ఆ రంధ్రం నరకానికి ద్వారం, ఇది నిజం!

ది డివోర్స్‌

ది డివోర్స్‌

రక్తదానం ప్రాణదానమే

రక్తదానం ప్రాణదానమే

పవన్ కల్యాణ్‌కు కర్మ ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ ఏంటి ?

పవన్ కల్యాణ్‌కు కర్మ ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ ఏంటి ?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.