Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. ఆంధ్రప్రదేశ్
  3. ఓటుకు పోటు!
ADVERTISEMENT

ఓటుకు పోటు!

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Nov 7, 2026 04:13 AM IST Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
ap_20banner.jpg

కుతంత్రాలే అస్త్రం.. రిగ్గింగే శస్త్రం..

చంద్రబాబుకు ఎస్‌ఈసీ తొత్తు   

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చిత్తు

‘కనపడదు.. వినపడదు’ అన్న స్థితిలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ 

ఇష్టారాజ్యంగా పేట్రేగిపోయిన పచ్చ కాలకేయుల అక్రమాలపై చర్యలేవీ?

యథేచ్ఛగా పోలింగ్‌ బూత్‌లు ఆక్రమించడం కనిపించడం లేదా?

ప్రత్యర్థి పార్టీ ఏజెంట్లను బయటకు తోసేసి రిగ్గింగ్‌ చేయలేదా?

బాధితులు ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేసినా స్పందించలేదెందుకు?

104.27 శాతం పోలింగ్‌ అంటే ఏం జరిగిందో తెలియదా?   

పోలీసులే దగ్గరుండి దొంగ ఓట్లు వేయించడంపై సర్వత్రా విస్మయం

వందలాది వీడియోలు వైరల్‌ అయినా నిమ్మకు నీరెత్తినట్లున్న ఎస్‌ఈసీ

ఈ దుస్థితి తమ 20–30 ఏళ్ల సర్వీసులో ఎప్పుడూ చూడలేదంటున్న పోలింగ్‌ సిబ్బంది

సాక్షి, అమరావతి: దేశ ఎన్నికల చరిత్రలోనే గతంలో ఎన్నడూ చూడని, వినని రీతిలో రాష్ట్రంలో దౌర్జన్యాలు, దుర్మార్గాలు, అక్రమాలు మితిమీరి­పో­యాయి. గతంలో జరిగిన అక్రమాలన్నింటినీ మించి పచ్చ పార్టీ గూండాల నేతృత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తీవ్ర ఉల్లంఘనలు చోటు­చేసుకుంటున్నాయి. స్థానిక ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి అడుగడుగునా అక్ర­మాలు, దౌర్జన్యాలు, బెదిరింపులతో.. డజన్‌ కుట్ర­లతో అడ్డగోలుగా విజయం సాధించేలా టీడీపీ పెద్దలు కుతంత్రాలు పన్నిన విషయం విదితమే. 

ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామి­నేషన్‌ వేయకుండా ఆదిలోనే అడ్డుకోవడం.. టీడీపీ గూండాలు పత్రాలు లాక్కొని చింపేయ­డం.. ఈ అడ్డంకులు దాటుకుని ఎవరైనా నామి­నేషన్‌ దాఖలు చేసి ఉంటే.. ఏకంగా ఆర్వోల వద్దకే వెళ్లి వారి వద్ద ఉన్న పత్రాలు ఎత్తుకెళ్లడం.. ఆపై ఎవరైనా పోటీలో నిలిచి ఉంటే బెదిరింపులకు గురిచేయడమూ తెలిసిందే. అన్ని అడ్డంకులను అధిగమించి పోలింగ్‌ దాకా వచ్చిన చోట్ల ఏకంగా ప్రత్యర్థి పార్టీ ఏజెంట్లనే గెంటి వేసి.. ఇష్టానుసారం రిగ్గింగ్‌ చేసుకోవడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 

ఇంత జరుగుతున్నా ఎస్‌ఈసీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్‌ఈసీ చంద్రబాబుకు తొత్తుగా మారడం వల్లే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ప్రజలు, విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాలనే ఆక్రమించుకుని, యథేచ్ఛగా ఓట్ల రిగ్గింగ్‌కు పాల్పడుతున్న ఘటనలకు సంబంధించిన వందలాది వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయినా రీ పోలింగ్‌ నిర్వహించడానికి ఎస్‌ఈసీ సిద్ధపడక పోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి తలొగ్గిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠ నిస్సహాయతను ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.  

ఎన్నెన్నో అక్రమాలు.. స్పందనలే నిల్‌
ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ బాయ్స్‌ హైస్కూల్‌ పోలింగ్‌ కేంద్రంతో పాటు, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని కాట్రేనికోన మండలం చిర్రయాణం పోలింగ్‌ బూత్‌లో టీడీపీ మూకలు పోలింగ్‌ కేంద్రాలను ఆక్రమించుకుని యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడుతున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలకు సంబంధించి పదుల సంఖ్యలో వీడియోలు బహిర్గతమయ్యాయి. 

నెల్లూరు జిల్లా చేజర్ల మండలం తూర్పుపల్లి పోలింగ్‌ కేంద్రంలో అక్కడి మొత్తం ఓటర్ల సంఖ్య కంటే అధికంగా ఓట్లు పోలైనట్లు అధికారికంగా ప్రకటించడం సంచలనంగా మారింది. ఏకంగా 104.27 శాతం పోలింగ్‌ నమోదైనట్లు మండల ఎన్నికల అధికారులే వెల్లడించడం విశేషం. ఇది టీవీ మాధ్యమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ వైరల్‌ అయ్యింది. ఒక పోలింగ్‌ కేంద్రంలో నమోదైన ఓట్ల శాతం మొత్తం ఓటర్ల సంఖ్యను మించిపోయాయంటే అక్కడ పక్కాగా రిగ్గింగ్‌ జరిగిందనడానికి ప్రత్యక్ష నిదర్శనం. అయినా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నుంచి కనీస స్పందన లేకపోవడం ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసింది.

అంతా ఒక్కటై.. మాఫియా తరహాలో ఎన్నికల కుట్ర 
సాధారణంగా ఎన్నికల ప్రక్రియలో ఏదైనా పోలింగ్‌ కేంద్రంలో రిగ్గింగ్‌ లేదా ఇతర అక్రమాలు చోటుచేసుకుంటే, వాటిని విధుల్లో ఉన్న పోలింగ్‌ అధికారి (పీవో) తక్షణమే గుర్తించి ఎన్నికల రికార్డుల్లో నమోదు చేయాలి. ఆ స్థాయిలో అక్రమాలను నమోదు చేయకపోయినా, తదుపరి స్థాయిలో ఉండే రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) వాటిని పరిశీలించి తగిన చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. క్షేత్ర స్థాయిలో పనిచేసే అధికారులు అక్రమాలకు వత్తాసు పలికినా, జిల్లా కలెక్టర్లు స్వతంత్రంగా విచారణ జరిపి వాస్తవాలను నిర్ధారించి నివేదికలు సమర్పించాల్సిన బాధ్యత ఉంటుంది. 

ఈ స్థాయిల్లోనూ అధికారులు తమ బాధ్యతలను విస్మరించి, ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి అక్రమాలపై నివేదికలు సమర్పించలేదు. అయినా రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన రాష్ట్ర ఎన్నికల సంఘానికి స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక, పారదర్శక ఎన్నికల నిర్వహణ కోసం తన పరిధిలోని అధికారాలను వినియోగించుకునే అవకాశం ఉంది. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆధారాలు వెలుగులోకి వచ్చినప్పుడు, వాటిని పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఎన్నికల కమిషన్‌పైనే ఉంటుంది. 

శుక్రవారం జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్‌ సందర్భంగా పలు ప్రాంతాల్లో యథేచ్ఛగా రిగ్గింగ్‌ జరిగినట్లు వీడియోలు బహిర్గతమైనా, ఎన్నికల సంఘం నుంచి ఆశించిన స్థాయిలో చర్యలు కనిపించకపోవడం తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది.  ప్రజాస్వామ్యానికి పునాదులైన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంతటి తీవ్ర స్థాయి అక్రమాలు జరుగుతున్నా, వాటిని అడ్డుకోవాల్సిన వ్యవస్థలే మౌనంగా ఉండటం చూస్తుంటే అధికార యంత్రాంగం అంతా ప్రభుత్వ ఒత్తిడికి లొంగిపోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్‌ బూత్‌ల ఆక్రమణలు, రిగ్గింగ్‌ ఆరోపణలు, ఓటర్ల సంఖ్యను మించిన పోలింగ్‌ వంటి అసాధారణ ఘటనలపై కూడా ఎన్నికల సంఘం స్పందించకపోతే, ఆ సంస్థ స్వతంత్రత, నిష్పాక్షికతపై ప్రజలకు నమ్మకం ఎలా కలుగుతుంది?  

బాలెట్‌ బాక్స్‌ల తరలింపులో మతలబు ఏమిటి?
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ అనంతరం బ్యాలెట్‌ బాక్స్‌లను స్ట్రాంగ్‌ రూంలకు తరలించే ప్రక్రియలో జరిగిన పలు సంఘటనలు పలు అనుమానాలు కలిగిస్తున్నాయి. గుంటూరు రూరల్‌ మండలం వెంగళాయపాలెం–1 ఎంపీటీసీ ఎన్నికకు సంబంధించి గురువారం పోలింగ్‌ సమయంలో స్థానికంగా టీడీపీ– వైఎస్సార్‌సీపీ పక్షాల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పోలింగ్‌ అనంతరం బ్యాలెట్‌ బాక్స్‌లను తరలించే క్రమంలో ఆ పోలింగ్‌ బూత్‌ పీవో మార్గం మధ్యలో బాలెట్‌ బాక్స్‌ను పట్టుకుని ఒక వాహనం నుంచి దిగి మరో వాహనం కోసం ఎదురు చూస్తున్నప్పుడు స్థానికులు గుర్తించి నిలదీశారు. 

సాధారణంగా బాలెట్‌ బాక్స్‌ సేకరించిన వాహనంలోనే నేరుగా వాటిని భద్రపరిచే స్ట్రాంగ్‌ రూంకు చేర్చాలని ఎన్నికల నిబంధనలు చెబుతున్నాయి. అనుమానాస్పదంగా పీవో వాహనం మారేందుకు ప్రయత్నించగా, పీవో తీరును నిరశిస్తూ ఆందోళనలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డిపైనే పోలీసులు తిరిగి కేసు పెట్టారు. ఈ అంశంలో పోలీసులు, ఎన్నికలాధికారులు చెబుతున్న కారణాలు వేర్వేరుగా ఉండడం గమనార్హం. ఇదే తరహాలో చాలా నేరుగా స్ట్రాంగ్‌ రూమ్‌లకు బ్యాలెట్‌ బ్యాక్స్‌లను తరలించకుండా మార్గం మధ్యలో వాటిని ఒక చోట చేర్చి, చాలా సేపటి తర్వాత అక్కడి నుంచి వేరే వాహనంలో తరలించారని తెలుస్తోంది. ఫలితంగా మధ్యలో ఏకంగా బ్యాలెట్‌ బాక్స్‌లనే తారుమారు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే బీహార్‌ కంటే అత్యంత దారుణంగా ఉందని ఓ రిటైర్డు సీఎస్‌ వ్యాఖ్యానించడం గమనార్హం. ఇంతటి అరాచకం, దౌర్జన్యం తమ 20–30 ఏళ్ల సర్వీసులో ఎన్నడూ చూడలేదని పోలింగ్‌ విధులు నిర్వహించిన ఉద్యోగులు బాహాటంగా చెబుతున్నారు. 40 ఏళ్ల తన రాజకీయ జీవితమంతా రక్తపాతం, రిగ్గింగ్, వెన్నుపోటే అని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారని ఓ సీనియర్‌ రాజకీయ నేత వ్యాఖ్యానించారు. 

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Andhra Pradesh
Chandrababu Naidu
Rigging
state election commission
fake votes
ap local body elections 2026
YSRCP
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘చంద్రబాబు దాన్ని తన గొప్పతనంగా చెప్పుకుంటున్నారు’

‘చంద్రబాబు దాన్ని తన గొప్పతనంగా చెప్పుకుంటున్నారు’

విషాదం.. పదవ తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి?

విషాదం.. పదవ తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి?

‘అలా టీడీపీ గెలిస్తే.. రాజకీయ సన్యాసం చేస్తా’

‘అలా టీడీపీ గెలిస్తే.. రాజకీయ సన్యాసం చేస్తా’

పచ్చమూకల దాష్టీకాలకు ఎదురొడ్డి గెలుపు

పచ్చమూకల దాష్టీకాలకు ఎదురొడ్డి గెలుపు

వెయ్యి ఓట్ల మెజార్టీతో గెలిస్తే.. 979 ఓట్లు చెల్లనివట..!

వెయ్యి ఓట్ల మెజార్టీతో గెలిస్తే.. 979 ఓట్లు చెల్లనివట..!

పరిషత్‌ ఎన్నికల్లో మంత్రికి షాక్‌

పరిషత్‌ ఎన్నికల్లో మంత్రికి షాక్‌

మరిన్ని వార్తలు

‘చంద్రబాబు దాన్ని తన గొప్పతనంగా చెప్పుకుంటున్నారు’

‘చంద్రబాబు దాన్ని తన గొప్పతనంగా చెప్పుకుంటున్నారు’

కూటమికి భారీ షాక్‌.. పరిషత్ పోరులో వైఎస్సార్‌సీపీ జోరు

కూటమికి భారీ షాక్‌.. పరిషత్ పోరులో వైఎస్సార్‌సీపీ జోరు

వైఎస్సార్‌సీపీ ఘన విజయం.. తిరుపతిలో చెవిరెడ్డి విక్టరీ

వైఎస్సార్‌సీపీ ఘన విజయం.. తిరుపతిలో చెవిరెడ్డి విక్టరీ

తల్లిపాలే దివ్య ఔషధం

తల్లిపాలే దివ్య ఔషధం

అల్లూరి జిల్లా పరిషత్‌ పీఠంపై వైఎస్సార్‌సీపీ జెండా!

అల్లూరి జిల్లా పరిషత్‌ పీఠంపై వైఎస్సార్‌సీపీ జెండా!

రాష్ట్ర ప్రజల నెత్తిన బాబు అప్పుల బండ

రాష్ట్ర ప్రజల నెత్తిన బాబు అప్పుల బండ

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft