Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. వైఎస్‌ జగన్‌ పేరు చెప్పాలని రఘురామ టార్చర్‌!
ADVERTISEMENT 

వైఎస్‌ జగన్‌ పేరు చెప్పాలని రఘురామ టార్చర్‌!

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Feb 25, 2026 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
bihar_20police.jpg

బిహార్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ సునీల్‌ నాయక్‌ సంచలన ట్వీట్‌ 

లేదంటే నన్ను నిందితుడిగా చేర్చి అక్రమ కేసు పెడతామని బెదిరించారు 

అప్పటి సీఐడీ చీఫ్‌ పీవీ సునీల్‌ పేరు కూడా చెప్పాలని తీవ్ర ఒత్తిడి తెచ్చారు 

అవాస్తవాలు చెప్పేందుకు నేను నిరాకరించడం వల్లే నాపై అక్రమ కేసులు  

నేను చెప్పేవాటికి అన్ని ఆధారాలున్నాయ్‌.. సరైన సమయంలో బయటపెడతా 

ఎస్టీగా పుట్టడమే నా నేరమా..! ఉన్నతస్థానాల్లో ఉంటే జీర్ణించుకోలేరా? 

ఎస్పీ దామోదర్‌ భూ దందాలు, ఇసుక, మైనింగ్‌ దందాలపై విచారణ ఏది? 

నా తల్లి పట్ల అసభ్యంగా, అవమానకరంగా వ్యవహరించారు 

అవమానించిన అందరినీ చట్టం ముందు దోషులుగా నిలబెడతా 

సాక్షి, అమరావతి: డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణ­రాజు ఫిర్యాదు మేరకు తనపై బనాయించిన అక్రమ కేసులో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, సీఐడీ చీఫ్‌ పీవీ సునీల్‌ కుమార్‌ పేర్లు చెప్పాలని తనపై తీవ్ర ఒత్తిళ్లు వచ్చినట్లు బిహార్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి సునీల్‌ నాయక్‌ సంచలన వాస్తవాలను బహిర్గతం చేశారు. రఘురామకృష్ణరాజు తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని.. ఆయన ఫోన్‌ చేస్తే స్పందించకపోవడంతో ఫోన్‌కు మెస్సేజ్‌ చేశారని వెల్లడించారు. 

‘వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, పీవీ సునీల్‌ కుమార్‌ పేర్లు చెప్పకపోతే నిన్ను నిందితుడిగా చేరుస్తాం..’ అని ఆ మెస్సేజ్‌లో బెదిరించారని పేర్కొన్నారు. అవాస్తవాలను చెప్పేందుకు సమ్మతించకపోవడం వల్లే తనపై అక్రమ కేసు నమోదు చేశారని స్పష్టం చేశారు. రఘురామకృష్ణ­రాజు కాల్‌ డేటా తీస్తే అవన్నీ బయటపడతాయని, చాలా­మందిని ఈ కేసులో అక్రమంగా ఇరికించారన్నది వెల్లడవుతుందన్నారు. సందర్భం వచ్చినప్పుడు అన్ని ఆధారాలు చూపిస్తానని ప్రకటించారు. 


ఈ కేసులో విచారణ అధికారిగా ఉన్న ఎస్పీ దామోదర్‌ తన తల్లి పట్ల అసభ్యంగా, అవమానకరంగా వ్యవహరించారని సునీల్‌ నాయక్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఎస్టీగా పుట్టడమే నేను చేసిన నేరమా..? చిన్న కులాల వారు కష్టపడి చదివి ఐపీఎస్‌ లాంటి ఉన్నత స్థానాలకు చేరితే జీర్ణించుకోలేరా?..’ అని సునీల్‌ నాయక్‌ చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  

ప్రస్తుతం బిహార్‌లో అగ్నిమాపక శాఖ, హోంగార్డ్స్‌ విభాగం ఐజీగా ఉన్న సునీల్‌ నాయక్‌ను అక్రమంగా అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు పట్నాలో సో­మవారం హల్‌చల్‌ చేసిన విషయం విదితమే. గతంలో డిప్యూటేషన్‌పై ఏపీలో పనిచేసిన సునీల్‌ నాయక్‌పై అక్రమంగా బనాయించిన కేసులో కనీసం అరెస్టు వారెంట్, కేసు డైరీ లేకుండా అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు యత్నించారు. అయితే ఎస్పీ దామోదర్‌ నేతృత్వంలో ఏపీ పోలీసుల అరాచకాన్ని బిహార్‌ పోలీసులు మూకుమ్మడిగా అడ్డుకున్నారు. 

ఏపీ పోలీసుల తీరుపై పట్నా కోర్టు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో ఏపీ పోలీసులు అవమాన భారంతో తిరుగుముఖం పట్టారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తనపట్ల వ్యవహరించిన తీరుపై సునీల్‌ నాయక్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ తన ఎక్స్‌ ఖాతాలో మంగళవారం సంచలన పోస్టు పెట్టారు. అందులో ఏమన్నారంటే.. 

» ఎస్టీగా పుట్టడమే నేను చేసిన నేరమా..? గిరిజన లంబాడి కుటుంబంలో పుట్టి చెన్నై ఐఐటీలో గ్రాడ్యుయేషన్‌ చేసిన తరువాత ఐపీఎస్‌కు సెలెక్ట్‌ అయ్యా. చిన్న కులాల వాళ్లు ఉన్నత స్థానంలో ఉంటే జీరి్ణంచుకోలేరా..? రఘురామకృష్ణరాజు కేసులో నన్ను అక్రమంగా ఇరికించారు. 2021లో జరిగినట్లు చెబుతున్న సంఘటనపై 2024లో కేసు నమోదు చేశారు. అందులో నా పాత్ర ఏమాత్రం లేకపోయినా ఇరికించారు.  


»  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మహిళా మేనేజర్‌ను అడ్డు పెట్టుకుని ఆయన (ఎస్పీ దామోదర్‌) ఎన్నో భూ దందాలకు పాల్పడితే ఇప్పటికీ విచారణ లేదు. ఇసుక, గ్రానైట్, మైనింగ్‌ దందాలకు పాల్పడితే విచారణ లేదు. ధోతీ కార్యక్రమం నిర్వహించి రూ.4 కోట్లు విలువైన బంగారం, బహుమతులు పొందితే నేటికీ విచారణ లేదు. 

కానీ లంబాడీ కులంలో పుట్టిన నేను ఐపీఎస్‌ అధికారిని కావడమే నేను  చేసిన నేరమా..? అందుకే నాపై అక్రమ కేసు పెట్టారా? అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, సీఐడీ చీఫ్‌ పీవీ సునీల్‌కుమార్‌ పేర్లు చెప్పమని ఎంతోమంది నాపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. నాతో మాట్లాడిన ఫోన్‌ కాల్‌ రికార్డులు, ఇతర ఆధారాలన్నీ నా వద్ద ఉన్నాయి. ప్రస్తుతం ఆ కేసు న్యాయస్థానం పరిధిలో ఉంది. తగిన సమయంలో ఆ ఆధారాలన్నీ బయటపెడతా.  లంబాడీ కులంలో పుట్టిన నాకు మాట్లాడే హక్కు ఉండదనే అహంకారంతో వారు అలా వ్యవహరించారు.  

»  పట్నాలో నా నివాసంలోకి అక్రమంగా ప్రవేశించిన ఏపీ పోలీసు అధికారి (ఎస్పీ దామోదర్‌) నిబంధనలకు విరుద్ధంగా, దురుసుగా వ్యవహరించారు. తన దగ్గర బాడీ కెమెరా ఉందంటూ మా ఇంట్లో అల్లరి చేశారు. ఆయనతో వచ్చిన పోలీసు అధికారులు నా తల్లి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ అవమానపరిచారు. నా తల్లిని అవమానించిన అందరినీ చట్టం ముందు దోషులుగా నిలబెడతా.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
raghurama krishnam raju
illegal case
YS Jagan Mohan Reddy
Sunil Kumar
Sunil
Nayak
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

టెట్‌లో వీళ్లూ పాస్‌ కావాలనడం ఎంతవరకు కరెక్టు?: వైఎస్‌ జగన్‌

టెట్‌లో వీళ్లూ పాస్‌ కావాలనడం ఎంతవరకు కరెక్టు?: వైఎస్‌ జగన్‌

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

రేపు, ఎల్లుండి వైఎస్సార్‌ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన

రేపు, ఎల్లుండి వైఎస్సార్‌ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.