Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. ఐరాసలో జగన్‌ విజన్‌
ADVERTISEMENT 

ఐరాసలో జగన్‌ విజన్‌

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time May 5, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
International_20Platform_2C.jpg

అంతర్జాతీయ వేదికపై రాష్ట్ర ప్రభుత్వ పథకాలను వినిపించిన పశ్చిమ గోదావరి జిల్లా సర్పంచ్‌

సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: పక్షపాతం, పైరవీలకు, అవినీతికి తావులేకుండా ప్రజల ఇళ్ల వద్దకే ప్రభుత్వ సేవలను తీసుకెళ్లే విప్లవాత్మక పాలనా సంస్కరణలతో పాటు మహిళా సాధికారత లక్ష్యంగా గత ఐదేళ్లుగా రాష్ట్రంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అమెరికాలోని ఐక్యరాజ్య సమితి వేదికపై మరోసారి ఆవిష్కృతమయ్యాయి.

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు కల్పించడం.. మహిళా సాధికారిత కోసం ఆయా దేశాల్లో కొనసాగుతున్న కార్యక్రమాలపై ఐరాస ప్రధాన కార్యాలయంలో శుక్రవారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) జరిగిన సదస్సుకు పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామ పంచాయతీ సర్పంచ్‌ కునుకు హేమకుమారి హాజరయ్యారు. ఈమెతోపాటు త్రిపురకు చెందిన జెడ్పీ చైర్‌పర్సన్‌ సుప్రియ దాస్‌ దత్తా, రాజస్థాన్‌కు చెందిన మరో సర్పంచ్‌ నీరూ యాదవ్‌లు ‘లోకలైజింగ్‌ ది ఎస్‌డీజీ–‘విమెన్‌ ఇన్‌ లోకల్‌ గవర్నెన్స్‌ ఇన్‌ ఇండియా లీడ్‌ ది వే’ పేరుతో జరిగిన సదస్సులో మహిళా సాధికారిత కోసం భారత్‌లో జరుగుతున్న కార్యక్రమాలపై వీరు తమ ప్రజంటేషన్‌ ఇచ్చారు.

ఈ సందర్భంగా కుసుమ హేమకుమారి ఏపీలో మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించే దిశగా సీఎం జగన్‌ అమలుచేసిన వైఎస్సార్‌ ఆసరా పథకాన్ని ప్రస్తావించారు. 2019 ఎన్నికల నాటికి రాష్ట్రవ్యాప్తంగా పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉన్న మహిళల అప్పు మొత్తం రూ.25,570.79 కోట్లను నాలుగు విడతల్లో వైఎస్సార్‌ ఆసరా పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఆయా మహిళలకు అందజేసిందని చెప్పారు. దీంతోపాటు పొదుపు సంఘాల మహిళలు బ్యాంకు రుణాలను సకాలంలో చెల్లించే వారికి వారి వడ్డీ డబ్బులను ప్రభుత్వమే భరించే సున్నావడ్డీ పథకాన్ని  కూడా ఆమె ఈ అంతర్జాతీయ వేదికపై ప్రస్తావించారు.

పేద మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించేలా..
ఇక సొంతంగా వ్యాపార అవకాశాలు మెరుగుపరుచుకోవడం ద్వారా పేద మహిళలు తమ కలలను సాకారం చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నట్లు ఆమె వివరించారు. మరోవైపు.. మహిళలు ఉన్నత చదువులు చదువుకునేందుకు వీలుగా విద్యాదీవెన వంటి కార్యక్రమాలు అమలుచేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సైతం లక్‌పతీ దీదీ లాంటి కార్యక్రమాలు చేపట్టిందని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తోడ్పాటుతో తమ గ్రామంలో ఈ కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నట్లు హేమకుమారి వివరించారు.

అలాగే, పౌష్టికాహరంపై గర్భిణీలకు అవగాహన కలిగిస్తూ, ప్రభుత్వమే వారికి పోషకాçహారం అందిస్తూ మాతా, శిశు మరణాల నివారణకు చేపట్టిన కార్యక్రమాలను ఆమె చెప్పారు. ఆర్నెల్ల క్రితం 2023 సెప్టెంబరులో ఇదే వేదికపై జరిగిన హైలెవల్‌ పొలిటికల్‌ ఫోరం (సదస్సు)లో మన రాష్ట్రానికి చెందిన వివిధ ప్రభుత్వ పాఠశాలల పేద పిల్లలు హాజరైన విషయం తెలిసిందే. వీరు కూడా రాష్ట్రంలో సీఎం జగన్‌  ప్రభుత్వ బడుల బలోపేతానికి చేపట్టిన కార్యక్రమాలను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లారు.

‘స్థానిక’ ప్రభుత్వాల్లో 46 శాతం మంది మహిళలే.. 
ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర పంచాయితీ రాజ్‌ శాఖ కార్యదర్శి వివేక్‌ భరద్వాజ్‌ మాట్లా డుతూ.. భారత్‌లో స్థానిక ప్రభుత్వాల స్థాయిలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల్లో 46 శాతం మంది మహిళలేనని తెలిపారు. అలాగే, దేశంలో బాల్య వివాహాలను నిరోధించడం, విద్యను ప్రోత్సహించడం, ఆర్థికంగా నిలదక్కుకోవడం.. జీవనోపాధి అవకాశాలు కల్పించడం.. పర్యావరణ సుస్థిరత.. క్రీడలు వంటి కార్యక్రమాల ద్వారా స్థానిక ప్రభుత్వాల స్థాయిలో కూడా మహిళలు, బాలికలకు సాధికారత కల్పించే కార్యక్రమాలను త్రిపుర, రాజస్థాన్‌ నుంచి హాజరైన ప్రతినిధులు వివరించారు. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
State government schemes
west godavari district
sarpanch
YS Jagan Mohan Reddy
International Platform
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

టెట్‌లో వీళ్లూ పాస్‌ కావాలనడం ఎంతవరకు కరెక్టు?: వైఎస్‌ జగన్‌

టెట్‌లో వీళ్లూ పాస్‌ కావాలనడం ఎంతవరకు కరెక్టు?: వైఎస్‌ జగన్‌

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

రేపు, ఎల్లుండి వైఎస్సార్‌ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన

రేపు, ఎల్లుండి వైఎస్సార్‌ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.