Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. పెద్ద కష్టం తీరింది.. సర్వీస్‌ ఈనాం భూములపై సర్వ హక్కులు
ADVERTISEMENT 

పెద్ద కష్టం తీరింది.. సర్వీస్‌ ఈనాం భూములపై సర్వ హక్కులు

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Jul 18, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
removal-one-and-half-lakh-acres-prohibited-list-ap-govt-02.jpg

సర్వీసు ఈనాం అంటే?

శతాబ్దాలు.. దశాబ్దాల క్రితం కుల వృత్తులు చేసే వారికి గ్రామాల్లో భూములను ఈనాంగా ఇచ్చారు. వారి వారి వృత్తుల పరంగా ఆల యాల నిర్వహణలో, ప్రజావసరాల్లో వారి భాగస్వామ్యం ఉండేది. ఈ క్రమంలో రజక, కుమ్మరి, కమ్మరి, మాదిగ, మాల, షరబి, భజంత్రి, పూజారి, వడ్రంగి తదితరుల భుక్తి కోసం అప్పట్లో భూములు ఇచ్చారు. వాటిని అనుభవిస్తూ సేవలు అందించేవారు.

సాక్షి, అమరావతి: సర్వీసు ఈనాం భూమి రైతుల కష్టాలకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చరమగీతం పాడింది. భూముల సమస్యలన్నింటినీ సానుకూ­లంగా కొలిక్కి తెచ్చే క్రమంలో సర్వీసు ఈనాం భూముల సమస్యను పరిష్కరించింది. నిషేధిత ఆస్తుల జాబితా 22(ఎ) నుంచి 1.68 లక్షల ఎకరా­లను తొలగించడానికి మంత్రివర్గం ఆమోదం తెలి­పింది. దీంతో 25 జిల్లాల్లో 1.13 లక్షల మంది కుల వృత్తులు చేసుకునే రైతుల కుటుంబాలకు ప్రయో­జనం చేకూరనుంది.

ఇప్పటికే 2.08 లక్షల ఎకరాల చుక్కల భూములు, 33 వేల ఎకరాల షరతుల గల పట్టా భూములు, ఇవే తరహాలోని మరో 60 వేల ఎకరాలకుపైగా భూముల్ని 22 (ఎ) జాబితా నుంచి తొలగించింది. మొత్తం 3 లక్షల ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించి, దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్న లక్షల మంది రైతుల జీవితాల్లో వెలుగులు తీసుకువచ్చింది. తాజాగా 1.68 లక్షల సర్వీస్‌ ఈనాం భూములను 22 (ఎ) జాబితా నుంచి తొలగించడం ద్వారా తాను పేద రైతుల పక్షపాతినని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి నిరూపించారు. 

2013లో పొరపాటున 22(ఎ)లోకి

1956లో ఈనాం చట్టం రావడంతో ఈనాం భూములను రద్దు చేసి, వారికి రైత్వారీ పట్టాలు ఇచ్చారు. దాని ప్రకారం చాలా మంది రైతులు పట్టాలు పొందారు. కొందరు రైతులు తమ అవసరాల కోసం అమ్ముకోగా, మరికొందరు వారసులకు ఇచ్చారు. 2013 వరకు ఈ రైత్వారీ పట్టాలను పట్టా భూములుగానే పరిగణించడంతో పట్టాదారులు సకల హక్కులు అనుభవించేవారు. 2013లో ఈ చట్టానికి సవరణ చేశారు. దేవాలయాలు, ధార్మిక సంస్థలకు ఇచ్చిన సర్వీసు ఇనాం భూములను ఉద్ధేశించి ఈ సవరణ జరిగింది.



ఆ సంస్థల్లో పని చేసే వారు ఆ సర్వీసును అందించినంత కాలం ఆ భూమిపైన వచ్చే ఫలసాయాన్ని అనుభవించడమే తప్ప అమ్ముకునేందుకు వీలు లేదని స్పష్టం చేశారు. ఇందుకు అనుగణంగా దేవాదాయ, ధార్మిక సంస్థలకు సంబంధించిన ఈనాం భూములను 22(ఎ)లో పెట్టారు. ఆ సమయంలో వాటితోపాటు గ్రామాల్లో చేతి వృత్తుల వారు అనుభవిస్తున్న ఈనాం భూములను కూడా 22(ఎ)లో చేర్చారు. 

ఒడ్డున పడేసిన జగన్‌ ప్రభుత్వం 

2013 వరకు ఆ భూములపై సర్వ హక్కులు అనుభవించిన రైతులు ఒక్కసారిగా తమ హక్కులను కోల్పోయినట్లయింది. ఈ తప్పును సరిచేసే అవకాశం ఉన్నా, గత ప్రభుత్వం దీని గురించి పట్టించుకోలేదు. అప్పటి నుంచి తమకు న్యాయం చేయాలని బాధిత రైతులు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. లక్షలాది మంది రైతులతో ముడిపడి ఉన్న ఈ సమస్యను పరిష్కరించాలనే ఆలోచన  గత ప్రభుత్వం చేయలేదు.



ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి ఈ సమస్య రావడంతో పరిష్కారానికి చర్యలు ప్రారంభించారు. అందులో భాగంగానే సర్వీసు ఈనాం భూములను 22 (ఎ) జాబితా నుంచి తొలగించి 2013కు ముందున్న సర్వ హక్కులు కల్పించడానికి మంత్రివర్గం ఆమోదించింది. దీనివల్ల  వివిధ కుల వృత్తుల్లోని 1,13,610 మందికి చెందిన 1,68,604 ఎకరాల భూములకు విముక్తి లభించింది. తద్వారా ఆ రైతుల కుటుంబాలకు మేలు జరగనుంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Lands
Farmers
YS Jagan Mohan Reddy
Government of Andhra Pradesh
inam lands
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

టెట్‌లో వీళ్లూ పాస్‌ కావాలనడం ఎంతవరకు కరెక్టు?: వైఎస్‌ జగన్‌

టెట్‌లో వీళ్లూ పాస్‌ కావాలనడం ఎంతవరకు కరెక్టు?: వైఎస్‌ జగన్‌

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

రేపు, ఎల్లుండి వైఎస్సార్‌ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన

రేపు, ఎల్లుండి వైఎస్సార్‌ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.