Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. Fact Check: అప్పులపై అబద్ధాల డప్పు..
ADVERTISEMENT 

Fact Check: అప్పులపై అబద్ధాల డప్పు..

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Jan 24, 2024 Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
fake.jpg

సాక్షి, అమరావతి : చెప్పిందే చెప్పరా పాచిపళ్ల దాసరా.. అన్నట్లుగా ఉంది ఈనాడు రామోజీ తీరు. తన ఆత్మబంధువు చంద్రబాబు మీద ఎక్కడలేని పిచ్చి ప్రేమ.. సీఎం జగన్‌పై అర్థంపర్థంలేని అక్కసు, అసూయ, ద్వేషంతో ఆయన నిత్యం అసత్యాల వ్రతం చేస్తూ తన విషపుత్రిక ఈనాడులో అశుద్ధ కథనాలు వండివార్చడమే పనిగా పెట్టుకున్నారు.

చెప్పిందే చెప్పి.. రాసిందే రాస్తూ జగన్‌పై తన కడుపుమంటను చాటుకుంటున్నారు. ఇందులో భాగమే తాజాగా ఆదివారం ఈనాడులో రామోజీ తన విలువల వలువలన్నీ విడిచేసి సిగ్గూఎగ్గూ లేకుండా రాష్ట్ర అప్పులపై పచ్చి అబద్ధాలతో ‘వారం వారం రుణ పురాణం’.. పేరుతో జగన్‌ సర్కారుపై మళ్లీమళ్లీ పిచ్చి ప్రేలాపనలు పేలారు. 



అనధికార అప్పులుండవని తెలిసినా..

నిజానికి.. ప్రభుత్వాలకు అనధికార అప్పులుండవని తెలిసినా సరే అనధికార అప్పులంటూ తన పాఠకులను రామోజీ ఉద్దేశపూర్వకంగా మోసం చేస్తున్నారు. ఒక అబద్ధాన్ని పదేపదే చెబితే ప్రజలు నమ్ముతారనుకునే చంద్రబాబు సిద్ధాంతాన్ని రామోజీ తూచా తప్పకుండా పాటిస్తూ అబద్ధాలను అచ్చేస్తున్నారు. చట్టాలు, నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి పేరుతో అనధికారికంగా డిపాజిట్లు సేకరించడం ఈనాడు రామోజీకి చెల్లుతుంది తప్ప ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వానికి గానీ ఏ రాష్ట్ర ప్రభుత్వానికి గానీ అనధికార అప్పులనేవి ఉండనే ఉండవు. ఈ విషయం తెలిసినా సరే రామోజీ పదేపదే జగన్‌ సర్కారుపై విషప్రచారానికి తెగబడుతూనే ఉన్నారు. ఆయన తాజా కథనంలో అక్కసు, కక్ష, అసూయ తప్ప ఒక్క వాస్తవం కూడా లేదు.

గత చంద్రబాబు హయాం నుంచి రాష్ట్రాల అప్పులకు ఏ నెలలో ఏ తేదీన సెక్యురిటీల విక్రయం చేయాలనేది ఆర్‌బీఐ నిర్ణయిస్తోంది. అందుకనుగుణంగా గత చంద్రబాబు ప్రభుత్వంతో పాటు మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతీనెలా ఆయా తేదీల్లో సెక్యూరిటీల విక్రయం ద్వారా అప్పులు చేస్తూ వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా వారం వారం జగన్‌ సర్కారు ఒక్కటే అప్పులు చేయడంలేదు. ఇక మంగళవారం ఏపీతో సహా మొత్తం 13 రాష్ట్రాలు రూ.24,280 కోట్ల మేర అప్పులు చేయనున్నాయి. దాన్ని వక్రీకరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ఒక్కటే మంగళవారం రూ.1,100 కోట్లు అప్పు చేస్తోందంటూ ఈనాడు రామోజీ చేతికొచ్చింది ఇష్టారాజ్యంగా రాసిపారేశారు. 



తప్పుడు రాతలు.. దొంగ లెక్కలు..

నిజానికి.. చంద్రబాబు గత ఎన్నికల ముందు ఏప్రిల్‌ 5న, ఏప్రిల్‌ 30న ఏకంగా రూ.5,500 కోట్లు అప్పుచేశారు. ఆ అప్పు కూడా 16 నుంచి 20 ఏళ్లలో తీర్చేలా చేశారు. ఇది ఈనాడు రామోజీకి తప్పుగా కనిపించలేదు. ఎందుకంటే చంద్రబాబు అంటే రామోజీకి ఎక్కడలేని ప్రేమ. ఇప్పుడు జగన్‌ అంటే నచ్చదు కాబట్టి నిబంధనల మేరకు అప్పులు చేస్తున్నా తప్పుగా కనిపిస్తాయి. రాష్ట్ర రుణాల మొత్తం, వడ్డీలు కలిపి చెల్లింపు భారం రూ.10 లక్షల కోట్లకు చేరిందంటూ పచ్చి అబద్ధాలను రామోజీ గుడ్డిగా అచ్చేశారు. దానికి కార్పొరేషన్‌ అప్పులను కూడా కలిపితే ఇలా ఉండవచ్చు అంటూ సొంత పైత్యాన్ని జోడించారు.

రాష్ట్ర అప్పులకు సంబంధించి భవిష్యత్తు చెల్లింపుల భారం గురించి కాగ్‌ నివేదికలో వాస్తవాలున్నా సరే అనధికారం, అంచనాల పేరుతో రామోజీ ఊహాగాన అంకెలతో నిస్సిగ్గుగా అచ్చేశారు. గత చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులను కూడా ఇప్పుడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ తీరుస్తోంది. ఇదే విషయాన్ని కాగ్‌ చెప్పినా ఆయనకు కనిపించదు. ఎందుకంటే అది చంద్రబాబుకు ఇబ్బంది  కాబట్టి. 2019 మార్చి 31 నాటికి చేసిన అప్పుల్లో వచ్చే ఏడేళ్లలో రూ,1,03,550 కోట్లు అంటే 53.51 శాతం చెల్లించాల్సి వస్తుందని కాగ్‌ నివేదిక స్పష్టంగా పేర్కొంది.

ఇంత మొత్తంలో చెల్లింపుల భారం ఉన్నందున అందుకు తగిన ప్రణాళికతో అదనపు రెవెన్యూ వనరులను సమీకరించుకోవాల్సి ఉందని, లేదంటే అభివృద్ధికి నిధులుండవని కాగ్‌ పేర్కొంది. వాస్తవాలిలా ఉంటే.. ఈనాడు రామోజీ జగన్‌ సర్కారుపై ఈర‡్ష్యతో అవాస్తవ గణాంకాలతో విషప్రచారానికి తెగబడుతున్నారు. 2022 మార్చి వరకు కాగ్‌ ఇచ్చిన నివేదికలో కూడా వచ్చే పదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అసలు అప్పులు, వడ్డీ కలిపి రూ.3.36 లక్షల కోట్లు మాత్రమే ఉందని కాగ్‌ స్పష్టంచేసినా, చెల్లింపుల భారం రూ.పది లక్షల కోట్లకు పెరిగిదంటూ రామోజీ పచ్చి అబద్ధాలతో పేట్రేగిపోయారు.

 

వడ్డీ శాతంపైనా వంకర రాతలు..

ఇక 2017–18 చంద్రబాబు హయాంలో రాష్ట్ర అప్పులపై సగటు వడ్డీ 6.52 శాతం ఉందని, అదే 2021–22లో అప్పులపై సగటు వడ్డీ 6.15 శాతమేనని కాగ్‌ నివేదిక స్పష్టంచేసింది. అయినా సరే.. రామోజీ ఈ వాస్తవాలను పట్టించుకోకుండా సొంత గణాంకాలతో జగన్‌ సర్కారుపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు. మూలధన వ్యయం కూడా గత చంద్రబాబు ఐదేళ్లలో కన్నా ఇప్పటి జగన్‌ సర్కారులో ఎక్కువగా ఉన్నప్పటికీ తప్పుడు గణాంకాలను ఈనాడు రాసింది.

చంద్రబాబు ఐదేళ్ల పాలనలో సగటు మూలధన వ్యయం రూ.15,227.80 కోట్లు ఉండగా.. వైఎస్‌ జగన్‌ సర్కారులో అది  రూ.17,991.21 కోట్లుగా ఉంది. ఇక రెవెన్యూ రాబడులు కూడా పెరగడం లేదంటూ రామోజీ మరో అబద్ధాన్ని రంగరించారు. చంద్రబాబు హయాంలో 2014 నుంచి 2019 వరకు రెవెన్యూ రాబడి కేవలం 6 శాతమే పెరిగింది. అదే వైఎస్‌ జగన్‌ నాలుగేళ్ల పాలనలో రెవెన్యూ రాబడి 16.7 శాతం పెరిగింది.

కోవిడ్‌ సంక్షోభం లేకున్నా బాబు హయాంలో రాబడి పెరగకపోయినా పెన్నెత్తని రామోజీ.. ఇప్పుడు కోవిడ్‌ సంక్షోభంలోనూ రాబడి పెరిగినా సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. మరో­వైపు.. అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు ప్రభుత్వం బాండ్లు, బ్యాంకులు నుంచి 10.32 నుంచి 10.45 శాతం వరకు అధిక వడ్డీలతో అప్పులుచేసి రాష్ట్రంపై భారం మోపినా రామోజీ కిమ్మనలేదు. ఇప్పుడు జగన్‌ సర్కారు తక్కువ వడ్డీలకే అప్పులు పుడుతున్నా ఆయనకు తప్పుగా కనిపిస్తోంది.

టీడీపీ అప్పులకు ఈ ఏడాది కట్టాల్సిన వడ్డీ రూ.17వేల కోట్లు..

2023–24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో వడ్డీల చెల్లింపులకు కేటాయించిన రూ.28,6p73.71 కోట్లలో టీడీపీ హయాంలో చేసిన అప్పులకే రూ.17,142.71 కోట్లు కట్టాల్సి వస్తోంది. అదే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకున్న అప్పులకు వడ్డీ చెల్లింపులు రూ.11,531 కోట్లే. వాస్తవాలిలా ఉంటే.. మొత్తం రూ.28,673.71 కోట్ల వడ్డీ ఈ ప్రభుత్వం తీసుకున్న అప్పులపైనే చెల్లిస్తున్నట్లు ఈనాడు వక్రీకరిస్తూ ప్రజలకు తప్పుడు సమాచారం అందించింది.

నిజానికి.. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైన గత ప్రభుత్వాలు చేసిన అప్పులకు అసలు, వడ్డీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ వాస్తవాలేమీ చెప్పకుండా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన అప్పులకే అసలు, వడ్డీలు రూ.10 లక్షల కోట్లు చెల్లించాలంటూ రామోజీ ఇష్టమొచ్చినట్లు రాసిపారేశారు.

ఇవేవీ రామోజీకి కనిపించవా?

రాష్ట్రంలో అభివృద్ధి లేదంటూ గగ్గోలు పెడుతున్న  రామోజీకి వైఎస్‌ జగన్‌ సర్కారు కొత్తగా నిర్మిస్తున్న 17 మెడికల్‌ కాలేజీలు, నాలుగు పోర్టులు, పది ఫిషింగ్‌ హార్బర్లు, రెండు విమానాశ్రయాలు, అలాగే.. గ్రామాల్లో 15 వేల సచివాలయాలు, 10,778 రైతుభరోసా కేంద్రాలు, 10,032 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్, 542 అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్‌ కనిపించడంలేదా.

వైద్య రంగంలో నాడు–నేడు పేరుతో 16 వేల కోట్లతో ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన, మనబడి నాడు–నేడు పేరుతో ప్రభుత్వ స్కూళ్లలో 16 వేల కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన కనిపించడంలేదా? చంద్రబాబు హయాంలో ఒక్క మెడికల్‌ కాలేజీగానీ, ఒక్క ప్రభుత్వ ఆస్పత్రిగానీ కట్టకపోయినా రామోజీ కళ్లకు అప్పుడంతా లేని అభివృద్ధి కలర్‌ఫుల్‌గా కనిపించింది. ఎందుకంటే బాబు అంటే ఇష్టం.. జగన్‌ అంటే కోపం.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Ramoji Rao
Fact Check
RBI
caag
Chandrababu Naidu
YS Jagan Mohan Reddy
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

టెట్‌లో వీళ్లూ పాస్‌ కావాలనడం ఎంతవరకు కరెక్టు?: వైఎస్‌ జగన్‌

టెట్‌లో వీళ్లూ పాస్‌ కావాలనడం ఎంతవరకు కరెక్టు?: వైఎస్‌ జగన్‌

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

రేపు, ఎల్లుండి వైఎస్సార్‌ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన

రేపు, ఎల్లుండి వైఎస్సార్‌ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.