Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. భర్తకు బెయిలిప్పించి మరీ.. యమపురికి!
ADVERTISEMENT 

భర్తకు బెయిలిప్పించి మరీ.. యమపురికి!

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Jan 24, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
125.jpg

పెద్దదోర్నాల యువకుడు శ్రీను హత్యలో భార్య, బావమరిది హస్తం 

మరో వ్యక్తితో భార్య సన్నిహితంగా ఉండటాన్ని ప్రశ్నించిన భర్త 

భర్తను హతమార్చేందుకు ఇద్దరికి  రూ.2 లక్షల సుపారీ  

గంజాయి కేసులో జైలుకెళ్లిన భర్తకు  బెయిల్‌ ఇప్పించిన భార్య  

పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు  

హత్య కేసు వివరాలు వెల్లడించిన   మార్కాపురం డీఎస్పీ నాగరాజు  

ప్రకాశం జిల్లా: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణం, ఎక్కడ తనను భర్త అంతమొందిస్తాడోనన్న భయంతో కట్టుకున్నవాడినే కాటికి పంపంది ఆ మహిళ. గంజాయి కేసులో జైలుకెళ్లిన భర్తకు బెయిల్‌ ఇప్పించి మరీ కిరాయి హంతకులతో కలిసి పథకం ప్రకారం హత్యకు పాల్పడింది. ఇందుకు సొంత తమ్ముడితోపాటు సన్నిహితుడి సహకారం తీసుకుంది. పెద్దదోర్నాలకు చెందిన యువకుడు లాలూ శ్రీను మర్డర్‌ మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు చేపట్టిన దర్యాప్తులో ఈ విషయాలు వెలుగుచూశాయి.

 హత్య జరిగిన రెండు రోజుల్లోనే కేసును ఛేదించిన పోలీసులు.. మొత్తం ఐదుగురు నిందితుల్లో ఇద్దరిని కటకటాల్లోకి నెట్టారు. శుక్రవారం పెద్దారవీడు పోలీస్‌ స్టేషన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో హత్య కేసు పూర్వాపరాలను డీఎస్పీ యు.నాగరాజు వెల్లడించారు. డీఎస్పీ కథనం మేరకు.. పెద్దదోర్నాలకు చెందిన అడపాల లాలూ శ్రీను లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో పేకాటకు అటవాటు పడి డబ్బు నష్టపోయాడు. 

పోగొట్టుకున్న సొమ్ము రాబట్టుకునేందుకు గంజాయి వ్యాపారం ప్రారంభించాడు. ఇదిలా ఉండగా పెద్దదోర్నాలో మెకానిక్‌ షాపు నడుపుతున్న మృతుడి బావమరిది అశోక్‌కుమార్‌ వద్దకు సూర్యనారాయణ అనే వ్యక్తి తరచూ వచ్చేవాడు. పక్కనే కూల్‌డ్రింక్‌ పాపు నిర్వహిస్తున్న అశోక్‌ సోదరి ఝాన్సీతోనూ పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరిద్దరి చర్యలను గమనించిన లాలూశ్రీను భార్యతో తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో గంజాయితో పట్టుబడిన లాలూశ్రీను జైలుకు వెళ్లాడు. తనపై కోపంగా ఉన్న భర్త జైలు నుంచి బయటకు వస్తే చంపేస్తాడని ఆందోళన చెందిన ఝాన్సీ, సన్నిహితుడు సూర్యనారాయణ, సోదరుడు అశోక్‌కుమార్‌తో కలిసి హత్యకు పథకం రచించింది. 

భర్తను అంతమొందించేందుకు గుంటూరుకు చెందిన కిరాయి హంతకులు పార్థు, శంకర్‌కు రెండు లక్షల రూపాయలు సుపారీ ఇచ్చింది. ఒంగోలు సబ్‌ జైల్లో రిమాండ్‌లో ఉన్న భర్త లాలూశ్రీనుకు బైయిల్‌ వచ్చేలా చేయడంతోపాటు అతడిని కారులో దోర్నాలకు తెచ్చేలా ఏర్పాట్లు చేశారు. తొలుత చీమకుర్తి వద్ద శ్రీనును హతమార్చాలని చూసినా అక్కడ పరిస్థితులు అనుకూలించలేదు. మార్గమధ్యంలో పెద్దారవీడు సమీపంలోని అంకాలమ్మ గుడి వద్దకు రాగానే మూత్ర విసర్జన వంకతో కారు ఆపారు. ఆ తర్వాత శ్రీను కళ్లల్లో కారం చల్లి, రాళ్లు, కత్తులతో దారుణంగా హతమార్చారు. నిందితులు ఝాన్సీ, అశోక్‌కుమార్‌ను అరెస్టు చేసి కోర్టుకు తరలించనున్నట్లు డీఎస్పీ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని, త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు. సమావేశంలో త్రిపురాంతకం సీఐ హసన్, ఎస్సై సాంబశివయ్య పాల్గొన్నారు.  

 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Prakasam district
extramarital affair
Crime News
Andhra Pradesh
murder case
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

శనగ కూరలో విషం కలిపి తల్లికి పెట్టిన కొడుకు.. ఎందుకో తెలిస్తే షాక్‌

శనగ కూరలో విషం కలిపి తల్లికి పెట్టిన కొడుకు.. ఎందుకో తెలిస్తే షాక్‌

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.