Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. ‘పచ్చ ముఠా’ మట్టి మాఫియా
ADVERTISEMENT 

‘పచ్చ ముఠా’ మట్టి మాఫియా

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Nov 9, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Illegal-mining.jpg

పోలవరం కాలువ గట్టుపై అక్రమాలు

కాలువ గట్టును కొల్లగొట్టి జోరుగా విక్రయాలు  

వివిధ ప్రాంతాలకు టిప్పర్లలో  తరలిపోతున్న గ్రావెల్‌ మట్టి 

ద్వారకాతిరుమల: పోలవరం కాలువ గట్టుపై పచ్చ ముఠా పేట్రేగిపోతోంది. విలువైన గ్రావెల్‌ మట్టిని అక్రమంగా తవ్వి తెలుగు తమ్ముళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఏలూరు జిల్లా  గోపాలపురం నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి అండదండలతో కొందరు సాగిస్తున్న ఈ దందా రోజురోజుకు ఉధృతమవుతోంది. ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లి, లైన్‌ గోపాలపురం, పరిసర ప్రాంతాల్లోని పోలవరం కుడి కాలువ గట్టుపై గ్రావెల్‌ మట్టి అక్రమ తవ్వకాలు గత కొన్నాళ్లుగా యథేచ్ఛగా సాగుతున్నాయి. 

ప్రస్తుతం కాలువకు రెండు పక్కల గట్లపై పొక్లెయిన్లు పెట్టి, రాత్రీ పగలు తేడా లేకుండా యథేచ్ఛగా ఈ తవ్వకాలు జరుపుతున్నారు. టిప్పర్ల రాకపోకలు జరిగే సమయంలో గట్టుపై మట్టి పైకి లేచి, టిప్పర్‌ డ్రైవర్లకు ఇబ్బంది కలుగుతుండటంతో, ఒక వాటర్‌ ట్యాంకర్‌ ద్వారా గట్టును తడుపుతున్నారు. నిత్యం ఇక్కడి నుంచి సుమారు 100 టిప్పర్లకు పైగా మట్టి బయటకు తరలిపోతోంది. ఒక్కో టిప్పర్‌ మట్టిని దూరాన్ని బట్టి రూ.5 వేల నుంచి రూ.11 వేలకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఈ కాలువ మట్టి పొలసానిపల్లి, ఏలూరు, భీమవరం పరిసర ప్రాంతాల్లోని రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు తరలిపోతోంది.  

అనుమతులు ఉన్నాయంటూ దందా.. 
తవ్విన మట్టిని మరో ప్రాంతానికి తరలించాలంటే కచ్చితంగా ఇరిగేషన్, మైనింగ్‌ శాఖల అనుమతులు తప్పనిసరి. ఎం.నాగులపల్లి, లైన్‌ గోపాలపురంలో తవ్వకాలు జరుపుతున్న పచ్చ నేతల్లో ఒకరు సుమారు 5 వేల క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వకాలకు ఇరిగేషన్‌ శాఖ నుంచి అనుమతులు పొందారు. మైనింగ్‌ శాఖ నుంచి అనుమతులు పొందకుండానే తవ్వకాలు జరుపుతున్నారు. ఇదేంటని స్థానికులు ఎవరైనా ప్రశి్నస్తే మాకు అనుమతులు ఉన్నాయంటూ తమ దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు. నియోజకవర్గ స్థాయి ముఖ్య ప్రజాప్రతినిధి అండదండలతో ఎం.నాగులపల్లి, లైన్‌ గోపాలపురంకు చెందిన ఆయన అనుచరులు ఈ దందాకు పాల్పడుతున్నట్టు చెబుతున్నారు.  

తవ్వకాల వైపు కన్నెత్తి చూడని అధికారులు.. 
పట్టపగలు అక్రమ తవ్వకాలు సాగుతున్నా ఆ వైపు అధికారులెవరూ కన్నెత్తి చూడటం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. అనుమతులు ఉన్నాయి మీకెందుకు రిస్క్‌.. మీ పని మీరు చూసుకోండి అని అధికారులు చెబుతున్నారట. అక్రమార్కులకు అధికారులు ఇలా కొమ్ముకాయడం దారుణమని పలువురు అంటున్నారు. ఇరిగేషన్‌ అధికారులు అనుమతులు ఇచ్చిన ప్రాంతంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో, అది కూడా మైనింగ్‌ అధికారుల అనుమతులు లేకుండా తవ్వకాలు జరుపుతున్నారని ధ్వజమెత్తుతున్నారు.  

ఉప ముఖ్యమంత్రికి ఇవి కనబడవా..  
ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఇటీవల ఐఎస్‌ జగన్నాథపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని, అక్కడ జరిగిన గ్రావెల్‌ తవ్వకాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రావెల్‌ తవ్వకాల్లో వైఎస్సార్‌సీపీ నాయకుల పాత్ర ఏమైనా ఉందేమో విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో పోలవరం కాలువ గట్టుపై జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలు ఆయనకు కనబడటం లేదా అని స్థానికులు ప్రశి్నస్తున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
polavaram
Illegal mining
Andhra Pradesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.