Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. వైఎస్‌ జగన్‌పై అభిమానం ఉంటే అరెస్టు చేస్తారా?: నాగలక్ష్మి
ADVERTISEMENT 

వైఎస్‌ జగన్‌పై అభిమానం ఉంటే అరెస్టు చేస్తారా?: నాగలక్ష్మి

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Jan 18, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Tanuku.jpg

సాక్షి, పశ్చిమగోదావరి: ఏపీలో కూటమి సర్కార్‌ పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఓ ఆటోపై వైఎస్‌ జగన్‌ ఫొటో ఉందని, సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నాడనే కారణంతో కూటమి ఎమ్మెల్యే ఉడికిపోయారు. అనంతరం, రంగంలోకి దిగిన పోలీసులు.. వైఎ‍‍స్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తను అరెస్ట్‌ చేసి.. ఆటోను సీజ్‌ చేశారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకులో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్త పంజా దుర్గారావుపై తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చేసిన దౌర్జన్యకాండ శుక్రవారం తణుకులో సంచలనం రేకెత్తించింది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న అభిమానంతో వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా, అధికార పార్టీ చేస్తున్న అక్రమాలను సోషల్‌ మీడియా ద్వారా ఎండగడుతున్న దుర్గారావును టార్గెట్‌ చేసిన ఎమ్మెల్యే నడిరోడ్డుపై ఒక సామాన్య ఆటో డ్రైవర్‌ అని కూడా చూడకుండా వెంటాడి వీరంగం చేసిన ఘటనను ప్రజలు చీదరించుకుంటున్నారు. బెదిరించి, ఇష్టానుసారంగా దూషించిన తర్వాత పోలీసులకు అప్పగించడం, ఆపై స్టేషన్‌లో నడిచిన హైడ్రామాపై పలువురు విమర్శిస్తున్నారు. ఉదయం 12 గంటల నుంచి తణుకు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో హై డ్రామా నడిచింది. 

ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్న దుర్గారావును స్టేషన్‌లో ఎవరూ కలవకుండా నిర్బంధించడం, వ్యవహారాన్ని గుట్టుగా ఉంచడం అనుమానాలకు తావిస్తోంది. టీడీపీకి చెందిన ప్రముఖులు స్టేషన్‌కు రావడం, అధికారులతో మంతనాలు జరపడం, లీగల్‌ బృందంతో సంప్రదింపులు జరపడం వెనుక భారీ కుట్రపూరిత వ్యవహారం నడుస్తోందని వైఎస్సార్‌సీపీ శ్రేణులు, కుటుంబసభ్యులు భయాందోళనలు వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఒత్తిడితో పోలీసులు ఏ కేసులు నమోదు చేస్తారో, ఎక్కడికి తీసుకువెళ్తారోననే ఉత్కంఠ నడిచింది. రాత్రి 10.30 గంటలు గడిచినా దుర్గారావును స్టేషన్‌లోనే ఉంచడం, సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టులపై విచారణ చేయాల్సి ఉందని పోలీసు అధికారులు చెబుతుండటం వంటి అంశాలు అనుమానాస్పదంగా మారాయి.

కన్నీరుమున్నీరవుతున్న భార్య, పిల్లలు
తన భర్త దుర్గారావును చూసేందుకు తణుకు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన భార్య నాగలక్ష్మి, కుమార్తెలు కన్నీరుమున్నీరయ్యారు. ముఖ్యంగా ఆడబిడ్డల రోదనలు తణుకువాసులను కదిలించాయి. తాజాగా దుర్గారవు భార్య పంజా నాగలక్ష్మి మాట్లాడుతూ..‘ఆటో నడుపుకుంటూ మేము జీవనం సాగిస్తున్నాము. నిన్న నా భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. నా భర్త ఎవరి​కి అన్యాయం చేశాఆడని పోలీసులు తీసుకువెళ్లారు?. ఏం పోస్టులు పెట్టాడని తీసుకువెళ్లారు?. ఆటో తీసుకెళ్లి నా భర్తపై అక్రమ కేసులు పెడుతున్నారు. మేము మధ్యతరగతి ప్రజలం.. ఎలా బతకాలి?. మాకు వైఎస్‌ జగన్ అంటే అభిమానం. వైఎస్‌ జగన్‌పై అభిమానం ఉంటే అరెస్టులు చేస్తారా?. నా భర్తకు ఏమైనా జరిగితే ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ బాధ్యుడు అవుతాడు. నా భర్తను వెంటనే విడుదల చేయాలి’ అని డిమాండ్‌ చేశారు. 

విడ్డూరంగా ఆర్టీఓ తీరు
సామాన్య ఆటోడ్రైవర్‌ వ్యవహారానికి సంబంధించి ఎమ్మెల్యే ఆదేశాలతో ఆర్టీఓ హుటాహుటిన పోలీసుస్టేషన్‌కు రావడం, వెంటనే దుర్గారావు ఆటోను స్వాధీనం చేసుకుని నిమిషాల వ్యవధిలోనే తణుకు ఆర్టీసీ బస్‌డిపోకు తరలించడం విడ్డూరంగా మారింది. ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించలేదని, జిల్లా మారి హైవేపైకి ఆటో వచ్చిందని తదితర కారణాలు చూపించి రూ.3,400 జరిమానా విధించడం, రవాణా కార్యాలయం నుంచి పనిగట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు వచ్చి మరీ అధికారం చూపించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అధికారులు చూపిస్తున్న అధికార దర్పాన్ని చూసిన తోటి ఆటోడ్రైవర్లు ముక్కున వేలేసుకున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Naga Lakshmi
false allegations
arrest
YS Jagan Mohan Reddy
YSRCP
Andhra Pradesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.