Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి
ADVERTISEMENT 

అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Aug 29, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
onion.jpg

రైతు బజారులో కిలో ఉల్లి రూ.24 పైనే 

రైతుకు దక్కేది రూ.2 నుంచి రూ.4 మాత్రమే 

కర్నూలు మార్కెట్‌ యార్డులో రైతుల ఆర్తనాదాలు 

ఉల్లి ధరల పతనంపై సీఎం సమీక్ష 

క్వింటాల్‌ రూ.1,200కు తక్కువ కాకుండా కొనుగోలు చేయాలని సీఎం ఆదేశం

సాక్షి, అమరావతి: ఉల్లి ధరలు రోజురోజుకీ పతనమవుతున్నాయి. కర్నూలు మార్కెట్‌ యార్డులో ఉల్లి బస్తాల మేటలు పేరుకుపోతుండగా.. కోత ఖర్చులు కూడా రాక  అనేకమంది రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లోని పంటను మేకలు, గొర్రెలకు మేతగా వదిలేస్తున్నారు. నాలుగు రోజులుగా మార్కెట్‌కు వస్తున్న ఉల్లిని కొనేవారు లేక రైతులు గగ్గోలు పెడుతున్నారు. 

మార్కెట్‌కు వస్తున్న పంటలో నాలుగో వంతు సరుకును కూడా కొనేవారు లేరు. గురువారం కర్నూలు మార్కెట్‌కు 3,980 క్వింటాళ్ల ఉల్లి రాగా.. వెయ్యి టన్నుల కూడా ట్రేడర్లు కొనుగోలు చేయలేదు. దీంతో మార్కెట్‌కు తెచ్చిన పంటను తిరిగి తీసుకెళ్లలేక అక్కడే వదిలేస్తున్నారు. గురువారం కనిష్ట ధర క్వింటా రూ.520 పలకగా.. గరిష్టంగా రూ.1,149 లభించింది. 

అమ్ముడైన లాట్లలో 95 శాతం ఉల్లికి క్వింటాల్‌కు రూ.500–600 మించి ధర దక్కలేదు. క్వాలిటీ లేదనే సాకుతో వ్యాపారులు ధఱ తగ్గించేస్తున్నారు. కాగా.. రాష్ట్రంలోని రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.24–26 తక్కువకు దొరకడం లేదు. కర్నూలు మార్కెట్‌ యార్డులో మాత్రం రైతులకు కిలో రూ.2 నుంచి రూ.4 మాత్రమే ఇస్తున్నారు. 

రూ.1,200 తక్కువ కాకుండా కొనండి: సీఎం 
రైతుల నుంచి క్వింటాల్‌ ఉల్లిని రూ.1,200కు తక్కువ కాకుండా తక్షణమే కొనుగోలు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో గురువారం సమీక్ష నిర్వహించిన సీఎం మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ఫండ్‌ నుంచి నష్టాన్ని భరించాలని, కమ్యూనిటీ హాళ్లను అద్దెకు తీసుకుని ఆరబెట్టి రైతు బజార్లకు పంపిణీ చేయాలన్నారు. ఉల్లికి మంచి ధర వచ్చేవరకూ కమ్యూనిటీ హాళ్లల్లో నిల్వ చేసుకునేందుకు రైతులకు అవకాశం 
కల్పించాలన్నారు.  

ఉల్లి రైతులను గాలి కొదిలేస్తారా?
తాడేపల్లిగూడెం: కర్నూలు ఉల్లి రైతులు ధర దక్కక సంక్షోభంలో కూరుకుపోతే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గ­మని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వడ్డి రఘురామ్‌ పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో గురువారం మీడియాతో ఆయన మాట్లాడు­తూ.. గత ప్రభుత్వం రైతులను ఆదుకునేందు­కు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేసి అన్ని రకాలుగా ఆదుకుందని గుర్తు చేశారు. 

కర్నూ­లు ప్రాంత ఉల్లి రైతులు పంటను మార్కెట్‌కు తీసుకొచ్చినా కనీస ధర కూడా దక్కడం లేదన్నారు. దీంతో ఉల్లి పంటను పశువులకు మేతగా వదిలేస్తున్నారన్నారు.మార్కెటింగ్‌ శాఖ ద్వారా ప్రభుత్వం కర్నూలు ఉల్లికి కనీస మద్దతు ధర ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గిట్టుబాటు ధర దక్కేవరకు ఉల్లి రైతుల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాడుతుందని భరోసా ఇచ్చారు. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Andhra Pradesh
Onion farmers
price
Fall Down
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.