Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. పత్రికా స్వేచ్ఛపై సర్కారు మరోదాడి
ADVERTISEMENT 

పత్రికా స్వేచ్ఛపై సర్కారు మరోదాడి

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Sep 16, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
redbook.jpg

‘సాక్షి’కి సభాహక్కుల ఉల్లంఘన నోటీసు 

ఇటీవలే ఆ పత్రిక ఎడిటర్‌ నివాసంలో అక్రమంగా సోదాలు 

పలువురు ‘సాక్షి’ జర్నలిస్టులపైనా ఇప్పటికే టీడీపీ కూటమి నేతల దాడులు  

తాజాగా ప్రివిలేజ్‌ నోటీసు ఇచ్చిన ఏపీ అసెంబ్లీ 

సాక్షి, అమరావతి : రెడ్‌బుక్‌ రాజ్యాంగం ప్రకారం రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం తాజాగా సాక్షి దినపత్రికను  మరోసారి లక్ష్యంగా చేసుకుంది. ఏపీ శాసనసభ ద్వారా వేధింపులకు దిగింది. అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ శుక్రవారం ‘సాక్షి’ దినపత్రికకు ప్రివిలేజ్‌ నోటీసు ఇచ్చారు. బడ్జెట్‌ సమావేశాలకు ముందు ఫిబ్రవరి 25న సాక్షిలో ప్రచురితమైన ఒక వార్త అసెంబ్లీకి, అసెంబ్లీ సభ్యుల హక్కులకు భంగం కలిగించిందని అందులో పేర్కొన్నారు. 

నందికొట్కూరు ఎమ్మెల్యే జి. జయసూర్య ఇచ్చిన ఫిర్యాదును స్పీకర్‌ ప్రివిలేజ్‌ కమిటీకి పంపారని, ఈనెల 2న సమావేశమైన కమిటీ పత్రిక ఎడిటర్, సంబంధిత రిపోర్టర్, ప్రింటర్‌ అండ్‌ పబ్లిషర్‌ స్పందన తెలుసుకోవాలని సూచించిందని పేర్కొన్నారు. వారం రోజుల్లో ఈ నోటీసుపై స్పందించాలని కోరారు.  

ఎవరి హక్కుల ఉల్లంఘనా జరగలేదు.. 
వాస్తవానికి.. ‘సాక్షి’ ప్రచురించిన కథనంలో ఎక్కడా సభా హక్కుల ఉల్లంఘన జరగలేదు. అసెంబ్లీ, అసెంబ్లీ సభ్యులు, అధికారుల ప్రస్తావన అందులో లేదు. వారి హక్కులకుగానీ, వారి హుందాతనానికి గానీ అగౌరవం కలిగే వ్యాఖ్యలు అసలేలేవు. కేవలం పరిపాలనాపరమైన లోపాలను మాత్రమే అందులో ప్రస్తావించారు. శిక్షణా తరగతుల పేరుతో అన్ని ఏర్పాట్లు చేశాక రద్దుచేయడం ద్వారా ప్రజాధనం వృధా అయిందని, ప్రణాళికా లోపంవల్లే ఇది జరిగిందని వ్యవస్థాపరమైన లోపాలను గుర్తుచేస్తూ ఈ కథనంలో రాశారు. 

కానీ, సాక్షి మీడియాపై కక్షగట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. బడ్జెట్‌ సమావేశాల్లో ఒక సభ్యుడితో దీనిపై ఫిర్యాదు చేయించి సభా హక్కుల ఉల్లంఘనగా ఆరోపించింది. ఆ సభ్యుడి ఫిర్యాదు మేరకు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు దాన్ని ప్రివిలేజ్‌ కమిటీకి పంపగా కమిటీ నోటీసులిచ్చింది. ఇలా కూటమి ప్రభుత్వం సాక్షి మీడియాపై వరుస దాడులు చేయిస్తోంది. జర్నలిస్టులను భయపెట్టాలని, పత్రికా స్వేచ్ఛకు పరిమితులు విధించాలనే కుతంత్రంతో ఇలా చేయిస్తున్నట్లు ప్రజాస్వామ్యవాదులు చెబుతున్నారు.  

సాక్షి, సాక్షి సిబ్బందిపై వరుస దాడులు.. 
ఇక ఇటీవలే సాక్షి పత్రిక ఎడిటర్‌ ఆర్‌. ధనంజయరెడ్డి నివాసంలో ‘సిట్‌’ పోలీసులు అకారణంగా సోదాలు జరిపారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా.. మద్యం కేసు నిందితుల కోసం అన్వేషించే పేరుతో ఒక పత్రిక ఎడిటర్‌ నివాసంలో సోదాలు జరిపి పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించారు. అలాగే, సమాజంలో జరిగే పలు అంశాలను ప్రతిబింబించే క్రమంలో రాసిన వివిధ కథనాలపై పరువు నష్టం కేసులు వేసింది. 

మరోవైపు.. సాక్షి విలేకరులపై రాష్ట్ర వ్యాప్తంగా అక్రమార్కులు దాడులకు తెగబడుతున్నారు. వారి తప్పులను ఎత్తిచూపడమే నేరమన్నట్లు భౌతిక దాడులకు దిగుతున్నారు. ఏలూరు సాక్షి కార్యాలయంపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దాడిచేసి కంప్యూటర్లు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. 

అలాగే, గుంటూరు జిల్లా సాక్షి ఛానల్‌ ప్రతినిధిపై కూటమి నేతలు దాడికి పాల్పడ్డారు. శ్రీకాళహస్తిలోనూ సాక్షి విలేకరిపై దాడి చేశారు. ఇంకా అనేక చోట్ల సాక్షి మీడియాపై దాడులు, దౌర్జన్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా.. ఇప్పుడు అసెంబ్లీ ద్వారా ప్రివిలేజ్‌ నోటీసు ఇచ్చి పత్రికా స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేస్తున్నారు.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Sakshi News Paper
freedom of Press
dhananjaya Reddy
press freedom
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

సాక్షి పత్రిక, టీవీ రిపోర్టర్లు, కెమెరామెన్‌లపై కేసులు

సాక్షి పత్రిక, టీవీ రిపోర్టర్లు, కెమెరామెన్‌లపై కేసులు

TJR Sudhakar: బాబు, లోకేష్, పవన్ కనబడుట లేదు.. ఏమైనట్టు.. నన్ను చెప్పమంటారా..

TJR Sudhakar: బాబు, లోకేష్, పవన్ కనబడుట లేదు.. ఏమైనట్టు.. నన్ను చెప్పమంటారా..

మద్యం అక్రమ కేసులో బెయిల్‌ పిటిషన్లపై విచారణ వాయిదా

మద్యం అక్రమ కేసులో బెయిల్‌ పిటిషన్లపై విచారణ వాయిదా

ఇది ప్రజల గొంతుకను నొక్కడమే!

ఇది ప్రజల గొంతుకను నొక్కడమే!

‘సాక్షి’ చానల్‌ను ఎలా బ్లాక్‌ చేస్తారు?

‘సాక్షి’ చానల్‌ను ఎలా బ్లాక్‌ చేస్తారు?

‘సాక్షి’ ఎడిటర్‌పై సర్కార్‌ దాష్టీకం

‘సాక్షి’ ఎడిటర్‌పై సర్కార్‌ దాష్టీకం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.