Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. వక్ఫ్‌ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి
ADVERTISEMENT 

వక్ఫ్‌ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Apr 14, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
rally.jpg

విశాఖ, అనంతపురం నగరాల్లో కదం తొక్కిన ముస్లింలు

సీతమ్మధార(విశాఖ)/అనంతపురం కార్పొరేషన్‌: వక్ఫ్‌ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం విశాఖపట్నం, అనంతపురం నగరాల్లో ముస్లిం మైనారిటీలు భారీ ర్యాలీలు నిర్వహించారు. విశాఖ నగరంలోని డాబా గార్డెన్స్‌ ఎల్‌ఐసీ బిల్డింగ్‌ వద్ద గల డాక్టర్‌ అంబేడ్కర్‌ విగ్రహం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయవాది మహమ్మద్‌ గౌస్‌ ముద్దిన్‌ ఖాన్‌ మాట్లాడుతూ వక్ఫ్‌ చట్ట సవరణ ద్వారా ముస్లింల మత, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక గుర్తింపును బలహీనపరిచే అవకాశం ఉందని చెప్పారు. 

వక్ఫ్‌ సవరణ చట్టం అనేది రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే కాకుండా మైనారిటీల మతపరమైన హక్కులకు ముప్పు కలిగిస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. ముస్లిం నాయకులు హైదర్‌ అలీ సింకా, జహీర్‌ అహ్మద్, అహ్మదుల్లా ఖాన్, మునీర్, మహమ్మద్‌ ఇబ్రహీం, మైనార్టీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఫారూఖి తదితరులు పాల్గొన్నారు. 

అనంతపురంలో... 
వక్ఫ్‌ సవరణ చట్టాన్ని రద్దుచేయాలని అనంతపురంలో యునైటెడ్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యాన నిర్వహించిన భారీ ర్యాలీలో వేలాది మంది ముస్లిం మైనారిటీలు పాల్గొన్నారు.వైఎస్సార్‌సీపీ, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నుంచి సప్తగిరి సర్కిల్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. అనంతపురం నగర మేయర్‌ వసీం, వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్‌ఘర్‌ రిజ్వాన్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

అవకాశ లౌకికవాది చంద్రబాబు
»ఆయనకు సిద్ధాంతాలు, విలువలు లేవు 
»2019 ఎన్నికల్లో ప్రధాని మోదీని ఉగ్రవాది 
»అన్న నోటితో ఇప్పుడు పొగుడుతున్నారు 
»బీజేపీతో ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు మరోలా లౌకిక వాదానికి అర్థం మారుస్తారు 
»వివాదాస్పద వక్ఫ్‌ బిల్లుకు మద్దతు ఇస్తూ బీజేపీ వైపు దృఢంగా నిలబడ్డారు 
» ప్రముఖ జర్నలిస్ట్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌  
సాక్షి, అమరావతి:ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనాలు తప్ప సిద్ధాంతాలు, విలువలు లేవని ప్రముఖ జర్నలిస్ట్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ పేర్కొన్నారు. తన యూట్యూబ్‌ ఛానల్‌లో తాజాగా ఈ మేరకు వీడియో అప్‌లోడ్‌ చేశారు.  ఆ వీడియోలో ఆయన ఏమన్నారంటే.. ‘2019 ఎన్నికల్లో బీజేపీపై ఆధారపడే అవసరం లేదని, మతతత్వ బీజేపీ నుంచి దేశాన్ని రక్షించాలని పిలుపునిచ్చిన చంద్రబాబు.. ఒకానొక సందర్భంలో ప్రధానమంత్రి 
నరేంద్రమోదీని ఉగ్రవాదిగా పేర్కొన్నారు.  రాజకీయ మనుగడ మాత్రమే చంద్రబాబు ఏకైక ప్రాధాన్యత. 

లౌకిక వాదం విషయంలోనూ ఆయన అంతే. తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడానికి దానిని ఒక కళారూపంగా మార్చుకున్నారు. లౌకిక వాదానికి అర్థం చంద్రబాబు బీజేపీతో కలిసి ఉన్నప్పుడు ఒక రకంగా, లేనప్పుడు మరో రకంగా మారిపోతుంది. రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా.. వారి పదవులు కాపాడుకునే అంశంగా లౌకిక వాదాన్ని చంద్రబాబు మార్చేశారు.

అవకాశ లౌకిక వాదిగా చంద్రబాబు చరిత్రలో మిగిలిపోతారు. లౌకిక వాదానికి, మత స్వేచ్ఛకు భంగం కలిగించే వివాదాస్పద వక్ఫ్‌ బిల్లును పార్లమెంట్‌లో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు బీజేపీకి దృఢమైన మద్దతుదారుగా చంద్రబాబు నిలబడ్డారు. బిల్లులో కొన్ని సవరణలు సూచించడం ద్వారా ముస్లిం సమాజానికి తాము మంచి చేశామని చంద్రబాబు, బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ చెప్పుకున్నారు. చంద్రబాబుది ట్రికీ కేస్‌స్టడీ. రాజకీయాల్లో సుదీర్ఘంగా కొనసాగడానికి ఎన్ని రంగులు మార్చడానికైనా ఆయన వెనకాడరు. 

లౌకిక వాదం విషయంలో ఆయన విధానం ఎప్పుడూ ప్రశ్నార్థకమే. రాజకీయాల్లో నిబద్ధత స్థానంలో అవకాశ వాదం, అవసరం వచ్చి చేరాయి. రాజకీయ విధానాల్లో నిబద్ధత అత్యంత ముఖ్యమనే విషయాన్ని ఎప్పుడో మర్చిపోయారు. వారు అనుభవించే పదవులను బట్టి లౌకిక వాదానికి అర్థం మారిపోతుంది’ అని చంద్రబాబు తీరును ఎండగట్టారు. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Andhra Pradesh
Chandrababu Naidu
Waqf
Rallies
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.