Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. శ్రీశైలంలో పూడిక నష్టం 102.11 టీఎంసీలు
ADVERTISEMENT 

శ్రీశైలంలో పూడిక నష్టం 102.11 టీఎంసీలు

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Dec 23, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
srissailam.jpg

జలాశయంలో పేరుకుపోతున్న మట్టి

సీడబ్ల్యూసీ నివేదిక వెల్లడి

జలాశయం నిర్మాణం పూర్తయ్యాక 1976లో తొలిసారిగా నీటినిల్వ

అప్పట్లో గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 308.06 టీఎంసీలుగా నిర్ధారణ

తాజా సర్వేలో 205.95 టీఎంసీలకు తగ్గిన నీటినిల్వ సామర్థ్యం

సాక్షి, అమరావతి: కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు శ్రీశైలం జలాశయంలో పూడిక పేరుకుపోతుండటంతో గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 102.11 టీఎంసీలు తగ్గింది. లైవ్‌ స్టోరేజి సామర్థ్యం 72.77 టీఎంసీలు, డెడ్‌ స్టోరేజీ సామర్థ్యం 29.33 టీఎంసీలు తగ్గిందని రాష్ట్ర జల వనరుల శాఖ, కేంద్ర జలసంఘం (సీడ­బ్ల్యూసీ) సంయుక్తంగా రిమోట్‌ సెన్సింగ్‌ టెక్నా­లజీని ఉపయోగించుకుని నిర్వహించిన హైడ్రో­గ్రాఫిక్‌ సర్వేలో వెల్లడైంది. 

బేసిన్‌లో పెద్దఎత్తున అడవులను నరికివేస్తుండటంతో వర్షాలు కురిసినప్పుడు భూమి భారీగా కోతకు గురువుతుండటం.. వరదతోపాటు భూమి కోతకు గురవడం వల్ల వచ్చే మట్టి కలిసి ప్రవహిస్తూ జలా­శయంలోకి చేరుతోంది. ఏటా పూడిక పేరుకుపోతుండటం వల్లే శ్రీశైలం జలాశయంలో నీటినిల్వ సామర్థ్యం భారీగా తగ్గిందని సీడబ్ల్యూసీ తేల్చింది. 

దేశంలో జలాశయాల్లో పేరుకుపోతున్న పూడికపై 1991, 2001, 2015, 2020లలో సీడబ్ల్యూసీ సర్వేచేసి.. నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. ఈ ఏడాది దేశంలోని 548 జలాశయాల్లో నీటినిల్వ సామర్థ్యంపై సర్వే చేసింది. పెద్దఎత్తున పూడిక పేరుపోవడం వల్ల నీటినిల్వ సామర్థ్యం భారీగా తగ్గిన జలాశయాల్లో శ్రీశైలం మొదటి స్థానంలో నిలిచింది.



45 ఏళ్లలో కొండలా పూడిక
కృష్ణా నదిపై నంద్యాల జిల్లా శ్రీశైలం సమీ­పంలో 1960లో జలాశయం నిర్మా­ణాన్ని ప్రా­రంభించారు. 1976 నాటికి పూర్తి చేశా­రు. జలాశయంలో నీటినిల్వను 1976 నుంచే ప్రారంభించారు. అప్పట్లో రాష్ట్ర జల­వనరుల శాఖ నిర్వహించిన సర్వేలో జలా­శయంలో గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 308.06 టీఎంసీలు కాగా.. సాగు, తాగునీటి అవస­రాల కోసం ఏటా 253.05 టీఎంసీలను వినియోగించుకోచ్చని తేల్చింది.

జలాశయంలో పూడిక పేరుకు­పో­తుండటం వల్ల ఏటా నీటినిల్వ సామర్థ్యం తగ్గు­తూ వస్తోంది. సీడబ్ల్యూసీ, రాష్ట్ర జల వనరుల శాఖ తా­జా­గా నిర్వహించిన సర్వేలో శ్రీశైలం గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 205.95 టీఎంసీలుగా తేలింది. అంటే.. 45 ఏళ్లలో గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 102.11 టీఎంసీలు తగ్గినట్టు స్పష్టమ­వుతోంది. జలా­శయంలో పూడిక కొండలా పేరుకు­పోవడం వల్లే ఆ స్థాయిలో నీటినిల్వ సామర్థ్యం తగ్గిందన్నది స్పష్టమవుతోంది.

ఆయకట్టుకు నీళ్లందించడం సవాలే
శ్రీశైలం జలాశయంపై ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు గంగ, ఎస్సార్బీసీ (శ్రీశైలం కుడి గట్టు కాలు­వ), గాలేరు–నగరి, హంద్రీ–నీవా, తెలంగాణ­లో కల్వకుర్తి ఎత్తిపోతలు ఆధారపడ్డాయి. పూ­డి­క వల్ల శ్రీశైలం గరిష్ట నీటినిల్వ సామర్థ్యం, లైవ్‌ స్టోరేజి సామర్థ్యం భారీగా తగ్గిన నేపథ్యంలో ఆ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీళ్లందించడం సవాల్‌గా మారుతుందని నీటి పారు­దలరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తు­న్నారు. 

కొండలా మారిన పూడికను తొలగించ­డం భారీ వ్యయంతో కూడిన పని అని, పూడిక తొలగింపు అసాధ్యమని తేల్చిచె­బుతున్నారు. తగ్గిన నీటినిల్వ సామర్థ్యం మేరకు కొత్తగా రిజర్వాయర్‌ నిర్మించే అవకా­శాలను పరిశీలించాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు.  

శ్రీశైలం రిజర్వాయర్‌ సమగ్ర స్వరూపం
తొలిసారి రిజర్వాయర్‌ను నింపింది: 1976
గరిష్ట నీటిమట్టం 885 అడుగులు
క్యాచ్‌మెంట్‌ ఏరియా: 60,350 చ.కి.మీ.
గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేసినప్పుడు నీరు నిల్వ ఉండే ప్రాంతం 615.18 చ.కి.మీ. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Andhra Pradesh
srisailam dam
Soil
CWC
survey
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.