Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. అమెరికాలో సైతం గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరత
ADVERTISEMENT 

అమెరికాలో సైతం గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరత

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Jun 26, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Doctor-Program-in-AP.jpg

ప్రపంచంలో అత్యంత ధనికదేశం అమెరికాలోని గ్రామీణ ప్రాంతాల్లో (వాటిని కౌంటీలు అని పిలుస్తారు) దేశ జనాభాలో కేవలం 20 శాతం జనమే నివసిస్తున్నారు. పట్టణాలు, నగరాలకు దూరంగా ఉండే ఈ ప్రాంతాల్లో 80 శాతం ప్రజలకు అవసరమైనన్ని వైద్య సౌకర్యాలు లేవని అమెరికా కేంద్ర (ఫెడరల్‌ ) ప్రభుత్వం భావిస్తోంది. ఈ కౌంటీల్లో దేశ ప్రజల్లో 20% నివసిస్తున్నాగాని మొత్తం డాక్టర్లలో కేవలం పది శాతం మందే అక్కడ ప్రాక్టీసు చేస్తున్నారు. వైద్యసేవలు అరకొరగా అందిస్తున్నారు. అంటే డాక్టర్లు ప్రపంచంలో ఎక్కడైనా పట్టణ, నగర ప్రాంతాల్లోనే నివసిస్తూ వైద్య, ఆరోగ్య సేవలు అందించడానికి ఇష్టపడతారనేది జగమెరిగిన సత్యం.

2010–2017 సంవత్సరాల మధ్య కాలంలో గ్రామీణ కౌంటీలలో ప్రాథమిక వైద్య సేవలందించే డాక్టర్ల సంఖ్య అక్కడి జనాభాతో పోల్చితే బాగా తగ్గిపోయిందని అమెరికాలోని ప్రసిద్ధ హార్వర్డ్‌ యూనివర్సిటీ, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఇకనామిక్స్‌ స్కాలర్లు గత ఏడాది చేసిన అధ్యయనంలో తేలింది. ఈ సర్వేకు సంబంధించిన ఏడేళ్ల కాలంలో గ్రామీణ కౌంటీల్లో ప్రాథమిక వైద్యుల సంఖ్య తగ్గిపోగా, నగర (మెట్రోపాలిటన్‌ ఏరియాలు) ప్రాంతాల్లో డాక్టర్ల సంఖ్య పెరిగింది. మొత్తంమీద అమెరికాలో డాక్లర్ల సంఖ్య అవసరమైన స్థాయిలో లేకపోవడం ఒకటైతే, కొన్ని ప్రాంతాల్లో వైద్యులు మరీ తక్కువగా ఉండడం పెద్ద లోపంగా ప్రభుత్వాధికారులు గుర్తించారు. నగర, పట్టణ ప్రాంతాల ప్రజలతో పోల్చితే గ్రామీణ కౌంటీల్లోని జనానికి గుండె జబ్బులు, కేన్సర్, దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలు, అన్ని రకాల స్ట్రోకులు ఎక్కువ పీడిస్తున్నాయని అనేక సర్వేలు చెబుతున్నాయి. అగ్రరాజ్యానికి సంబంధించిన ఈ సమస్య గురించి ఇక్కడ వివరించడానికి కారణాలు లేకపోలేదు.

ఇండియాలో పల్లె ప్రాంతాల్లో వైద్యుల సంఖ్య బాగా తక్కువే,  ఏపీలో కొత్త పరిష్కారం

వైద్య కళాశాలల సంఖ్య, డాక్టర్ల సంఖ్య ఈమధ్యనే పెరుగున్న భారతదేశంలోనూ, ఆంధ్రప్రదేశ్‌ లోనూ గ్రామీణ ప్రాంతాల ప్రజలు తగినంత మంది వైద్యులు అందుబాటులో లేక కొన్ని దశాబ్దాలుగా ఇబ్బంది పడుతున్నారనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రజారోగ్యానికి మున్నెన్నడూ కనీవినీ ఎరగని రీతిలో ప్రాధాన్యం ఇచ్చారు దివంగత జననేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారు. 2004 నుంచి 2009 వరకూ ఐదేళ్లకు పైగా సాగిన ఆయన పాలనా కాలంలో రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరికీ వైద్య సౌకర్యాల కోసం విశేష కృషి చేశారు వైఎస్‌ గారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్ల పోస్టులు పెద్ద సంఖ్యలో ఆయన ప్రభుత్వం భర్తీ చేసింది.

108 వంటి అత్యవసర వైద్య సేవలతో పాటు పేదలు, బడుగు వర్గాల కోసం ఉచిత వైద్యానికి ఆరోగ్య శ్రీ పథకం రూపొందించి పకడ్బందీగా అమలు చేశారు. నవ్యాంధ్రలో నాలుగేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం రాజన్న మార్గంలో పయనిస్తూ గ్రామీణ ప్రాంతాల వైద్య, ఆరోగ్య అవసరాలకు ఎక్కువ నిధులు కేటాయిస్తోంది. అనేక వ్యాధులను ఆరోగ్య శ్రీ పథకం పరిధిలోకి తీసుకొచ్చింది. వీటన్నింటికీ తోడు ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్యులు తగినంత సంఖ్యలో అందుబాటులో ఉండేలా చేయడానికి కొత్తగా ‘ఫ్యామిలీ డాక్టర్‌’ పథకం ప్రవేశపెట్టింది.

ఈ వినూత్న వైద్య–ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమం పూర్తి స్థాయిలో అమలయ్యే నాటికి పల్లెల్లో ప్రజలందరికీ డాక్టర్లు పిలిస్తే పలికే మంచి రోజులొస్తాయి. 10,032 డాక్టర్‌ వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్కుల ద్వారా పనిచేసే వైద్యుల సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రజారోగ్య సంరక్షణలో దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఆంధ్ర రాష్ట్రం ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. వైద్యులే స్వయంగా పల్లె ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి జనం ఆరోగ్యం గురించి వాకబు చేసి వైద్య సహాయం అందిస్తే గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం తెలుగునాట సాకారమౌతుంది. అప్పుడు అమెరికా విశ్వవిద్యాలయాలు సైతం ఏపీ వచ్చి ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలను అధ్యయనం చేయాల్సిన పరిస్థితులు వస్తాయి.



-విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
v vijayasai reddy
Andhra Pradesh
Family Doctor
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.