Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. మరింత మంది రైతన్నలకు లబ్ధి
ADVERTISEMENT 

మరింత మంది రైతన్నలకు లబ్ధి

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Oct 1, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
agri.jpg

సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్నదాతలకు అన్ని విధాలుగా అండదండలు అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే ఆద­ర్శవంతంగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకంలో మరింత మంది రైతులకు మేలు చేకూర్చేలా మరిన్ని సంస్కరణలు తెచ్చారు.

నోటిఫై చేసిన పంటలు ఏ కేటగిరీ కింద సాగైనా ఒకే రీతిలో బీమా రక్షణ కల్పించేలా చర్యలు చేపట్టారు. మరో వైపు కొన్ని జిల్లాల్లో పెరిగిన సాగు విస్తీర్ణాన్నిబట్టి కొత్త పంటలను బీమా పరిధిలోకి తెచ్చారు. ఈ మేరకు మార్గదర్శకాల్లో మార్పులు చేయడమే కా­కుం­డా,  ప్రస్తుత వ్యవసాయ సీజన్‌ నుంచే అమల్లోకి తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రైతులపై పైసా భారం పడకుండా ఈ క్రాప్‌లో నమోదే ప్రామాణికంగా నోటిఫై చేసిన పంటలకు యూనివర్సల్‌ బీమా కవరేజ్‌ను కల్పిస్తూ ఆంధ్ర­ప్రదేశ్‌ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఒక సీజన్‌కు సంబంధించిన బీమా పరిహారాన్ని మరుసటి ఏడా­ది అదే సీజన్‌ ప్రారంభానికి ముందే చెల్లిస్తోంది. ఇలా 2019లో శ్రీకారం చుట్టిన ఈ పథకం ద్వారా గడిచిన 4 ఏళ్లలో 54.48 లక్షల మంది రైతులకు రూ.7,802.05 కోట్ల పరిహారం చెల్లించింది.



పరిహారం లెక్కింపులో పారదర్శకత కోసమే

సాధారణంగా ఇరిగేటెడ్, నాన్‌ ఇరిగేటెడ్‌ కేటగిరీల్లో పంటలు సాగవుతుంటాయి. పూర్వం నుంచి ఇరిగేటెడ్‌ (నీటి వసతి కల్గిన) విభాగంలో సాగయ్యే పంటలను దిగుబడి ఆధారితంగా, నాన్‌ ఇరిగేటెడ్‌ (వర్షాధారం) కేటగిరిలో సాగయ్యే పంటలను వాతావరణ ఆధారితంగా పరిగణనలోకి తీసుకొని బీమా కవరేజ్‌ కల్పిస్తున్నారు. దిగుబడి ఆధారిత పంటలకు వాస్తవ, హామీ దిగుబడిలోని వ్యత్యాసాల ఆధారంగా, వాతావరణ ఆధారిత పంటలకు ప్రతికూల, సాధారణ వాతావరణ పరిస్థితుల్లోని వ్యత్యాసాలను బట్టి బీమా పరిహారం లెక్కిస్తారు.

స్థానికంగా ఉండే నీటి వసతినిబట్టి కొన్ని జిల్లాల్లో ఒకే పంట రెండు కేటగిరిల్లోనూ సాగవుతుంటుంది. దీంతో ఒకే జిల్లాలో ఒకే పంటకు సాగయ్యే విధానాన్ని బట్టి రెండు విధాలుగా బీమా కవరేజ్‌ కల్పిస్తూ నోటిఫై చేయాల్సి వచ్చేది. ఫలితంగా పక్క పక్క సర్వే నంబర్లలో సాగయ్యే ఒకే పంటకు ఒకే పంట కాలంలో కొంత వాతావరణ, మరికొంత దిగుబడి ఆధారంగా లెక్కించి పరిహారం చెల్లించాల్సి వచ్చేది. ఫలితంగా జరిగిన పంట నష్టం ఒకటే అయినా, పరిహారంలో వ్యత్యాసాలు ఉండేవి.



ఉదాహరణకు నోటిఫైడ్‌ జిల్లాల్లో ప్రధానంగా పత్తి, వేరుశనగ పంటలు 95 శాతం విస్తీర్ణంలో వర్షాధారం, 5 శాతం నీటి వసతి కింద, మిరప 85 శాతం నీటి వసతి, 15 శాతం వర్షాధారం కింద సాగవడం వలన ఒక్కో ప్రాంతంలో ఒక్కో రీతిలో పరిహారం ఉండేది. ఖరీఫ్‌లో నోటిఫై చేసిన పసుపు పంటకు కృష్ణా జిల్లాలో వాతావరణ ఆధారంగా, అల్లూరి సీతారామరాజు, వైఎస్సార్‌ జిల్లాల్లో దిగు­బడి ఆధారంగా పరిగణించేవారు.

ఇలా మిరప, పత్తి, పసుపు, జొన్న, వేరుశనగ వంటి పంటల విష­యంలో పూర్వం నుంచి రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పరిహారం లెక్కింపు, పంపిణీలో అసమానతలు తొలగించడమే లక్ష్యంగా పంటల బీమా మార్గదర్శకాల్లో ప్రభుత్వం మార్పు­లు చేసింది. ఇక నుంచి నోటిఫై చేసిన జిల్లాల్లో ఖరీఫ్‌లో మిరప, పసుపు జొన్న పంటలు ఏ కేటగిరీ కింద సాగైనా పూర్తిగా దిగుబడి ఆధారంగానే పరిగ­ణిస్తారు. పత్తి, వేరుశనగ పంటలను పూర్తిగా వాతా­వ­రణ ఆధారితంగా పరిగణిస్తారు.

అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో విస్తారంగా సాగవుతున్న ఆము­దం పంటను కొత్తగా పంటల బీమా పరిధిలోకి తెచ్చారు. నోటిఫైడ్‌ జిల్లాల్లో దానిమ్మ, బత్తాయి, నిమ్మ, జీడిమామిడి పంటలను వాతావరణ ఆధారిత బీమా పరిధిలోకి తీసుకొచ్చారు. నాటిన మూడో ఏడాది నుంచి దానిమ్మకు, నాలుగో ఏడాది నుంచి బత్తాయి పంటకు ఖరీఫ్‌లోనూ, మూడో ఏడాది నుంచి జీడిమామిడి, నాలుగో ఏడాది నుంచి నిమ్మ తోటలకు రబీలోనూ బీమా రక్షణ కల్పిస్తారు.

2023–24 సీజన్‌ కోసం నోటిఫికేషన్‌ జారీ

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వచ్చాక తొలి ఏడాది పీఎంఎఫ్‌బీవైతో కలిసి బీమా పథకం అమలు చేయగా, యూనివర్సల్‌ కవరేజ్‌కు కేంద్రం విముఖత చూపడంతో ఆ తర్వాత రెండేళ్ల పాటు కంపెనీలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే పరిహారం చెల్లించింది. ఈ క్రాప్‌ ప్రామాణికంగా యూనివర్సల్‌ కవరేజ్‌కు కేంద్రం దిగి రావడంతో 2022–23 సీజన్‌ నుంచి దిగుబడి ఆధారిత పంటలకు పీఎంఎఫ్‌బీవైతో అనుసంధానించి వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా అమలు చేస్తోంది.

వాతావరణ ఆధారిత పంటలకు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా బీమా రక్షణ కల్పిస్తోంది. 2023–24 సీజన్‌ కోసం దేశంలోనే అత్యల్ప ప్రీమియంతో బీమా కవరేజ్‌కు ముందుకొచ్చిన కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. జిల్లాలవారీగా కవరేజ్‌ కల్పించే కంపెనీలతో పాటు నోటిఫైడ్‌ పంటల వివరాలతో ఇటీవలే నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ఖరీఫ్‌–­2023లో 15 పంటలకు దిగుబడి ఆధారంగా, 6 పంటలకు వాతావారణ ఆధారంగా, రబీ 2023–24లో 13 పంటలకు దిగుబడి ఆధారంగా, 4 పంటలకు వాతావరణ ఆధారంగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. దిగుబడి ఆధారిత పంటలకు ఖరీఫ్‌లో గ్రామం, మండల, జిల్లా యూనిట్‌గా బీమా కవరేజ్‌ కల్పిస్తుండగా, వాతావరణ ఆధారిత పంటలకు మాత్రం మండలం యూనిట్‌గా బీమా కవరేజ్‌ కల్పిస్తున్నారు.

అసమానతలకు తావులేకుండా..

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పంటల బీమా లెక్కింపు, పరిహారం చెల్లింపుల్లో మరింత పారదర్శ­కత తీసుకొచ్చేందుకు పంటల బీమా మార్గ­దర్శ­కాల్లో కీలకమైన మార్పులు తీసు­కొ­చ్చాం. నీటి వసతి, వర్షాధారం ప్రాతి­పది­కన కాకుండా ఇక నుంచి పూర్తిగా వాతా­వరణ, దిగుబడి ఆధారంగానే పంటలకు బీమా రక్షణ ఉంటుంది. నోటిఫై చేసిన జిల్లాల్లో నోటిఫై చేసిన పంటలు నష్టపోయే రైతులకు ఒకే రీతిలో పరిహారం దక్కు తుంది. లెక్కింపులో, చెల్లింపుల్లో ఎలాంటి అసమానతలు ఉండవు. – చేవూరు హరికిరణ్,  స్పెషల్‌ కమిషనర్, వ్యవసాయ శాఖ 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
YS Jagan Mohan Reddy
Insurance Coverage
crops
Agricultural schemes
SEASON
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

టెట్‌లో వీళ్లూ పాస్‌ కావాలనడం ఎంతవరకు కరెక్టు?: వైఎస్‌ జగన్‌

టెట్‌లో వీళ్లూ పాస్‌ కావాలనడం ఎంతవరకు కరెక్టు?: వైఎస్‌ జగన్‌

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

రేపు, ఎల్లుండి వైఎస్సార్‌ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన

రేపు, ఎల్లుండి వైఎస్సార్‌ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.