Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. నాడు అవినీతి.. నేడు నీతి అయిందా పవన్?
ADVERTISEMENT 

నాడు అవినీతి.. నేడు నీతి అయిందా పవన్?

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Sep 23, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Minister-Karumuri-Slams-Chandrababu.jpg

సాక్షి, తాడేపల్లి: ప్రజాధనాన్ని లూటీ చేసిన చంద్రబాబును అరెస్ట్ చేస్తే తప్పేంటి?అని ప్రశ్నించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. చంద్రబాబు స్కిల్‌ స్కామ్‌లో రూ. 371 కోట్లు నొక్కేసి సాక్ష్యాధారాలతో సహా పట్టుబడిపోయాడన్నారు. చంద్రబాబు వేసిన క్వాష్‌ పిటిషన్‌ను కూడా హైకోర్టు కొట్టేసిందనే విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కారుమూరి స్పష్టం చేశారు. 

వాస్తవం ఇది అయితే.. వాస్తవాలను వక్రీకరిస్తూ, టీడీపీకి చెందిన ఒక సామాజికవర్గం వారు చంద్రబాబు అరెస్టు అన్యాయం-అక్రమం, సేవ్ డెమోక్రసీ  అంటూ మాట్లాడుతున్నారు. అంటే ప్రజా ధనాన్ని లూటీ చేసిన బాబును అరెస్టు చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టా..? అని నిలదీస్తున్నామన్నారు.

అసెంబ్లీలో చర్చించరు..బయట మాత్రం సింపతీ గేమ్

అలాగే, 'చంద్రబాబు చేసిన స్కాములు-అరెస్టులపై అసెంబ్లీలో చర్చిద్దామంటే.. వాళ్ళు చర్చకు రారు. కానీ, చంద్రబాబును ఈ ప్రభుత్వం కక్షపూరితంగా అరెస్టు చేసిందని పబ్లిసిటీ చేసుకోవడమే పనిగా పెట్టుకున్నారు. అసెంబ్లీ, కౌన్సిల్‌లో చర్చిద్దామంటే.. టీడీపీ ఎమ్మెల్యేలు ఒక్కరూ లేరు, అంతా పారిపోయారు. 

ఒక్కొక్కరికి కోటిన్నర ఇచ్చి లాయర్లను రప్పించి వాదనలు వినిపించినా..  వారు ఎంతసేపటికీ టెక్నికల్  అంశాలను ప్రస్తావిస్తారు తప్పితే.. చంద్రబాబు అవినీతి చేయలేదు అని ఏ ఒక్కరూ చెప్పలేకపోయారు. చంద్రబాబు అవినీతి చేయలేదని టీడీపీ కార్యకర్తలు సైతం నమ్మరు, ఎన్టీఆర్ కుటుంబం నమ్మదు.. ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదు' అని మంత్రి మండిపడ్డారు.

బాబు పాలన అంతా స్కాములే.. స్కీముల్లేవ్

'చంద్రబాబు పాలన అంతా అవినీతి, స్కాములే. ఆయన 14 ఏళ్ళ పాలన అంతా స్కాముల మయమే.. జగన్ గారి పరిపాలనలో ప్రతిదీ పేద ప్రజలకోసం అమలు చేస్తున్న సంక్షేమ స్కీములే. బాబు నిప్పు, నీతిమంతుడే అయితే ఆయన పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ను అమెరికాకు  పంపించి, ఎందుకు దాచిపెట్టారు? నీ.. పీఎస్ శ్రీనివాస్కు హవాలా మార్గంలో నిధులు రాకపోతే.. అతన్ని ఎందుకు పంపించేశావు? అలా, మీ స్కాములకు లాబియిస్టుగా ఉన్న మనోజ్ వాసుదేవ్ పార్థసాని(ఎంవీపీ) దుబాయ్ పారిపోయాడు! చంద్రబాబు చేసిన స్కాములతో ఆయన పాపం పండింది. బాబు తప్పులు చేశాడు కాబట్టే.. మీరు చొక్కాలు విప్పి రోడ్డున పడుతున్నారు' అని విమర్శించారు.

బాబుకు వెన్నుపోటు పొడిచేందుకు లోకేష్, బాలకృష్ణ మాస్టర్ ప్లాన్?

'లోకేష్ ఎక్కడ దాక్కున్నాడు..? చంద్రబాబును అరెస్టు చేస్తే.. నా తండ్రి దగ్గరకు వెళ్ళనివ్వరా.. అని రెచ్చిపోయి, ప్లకార్డులు పట్టుకుని, కింద కూర్చుని నానా హడావుడి చేశాడు. ఇప్పుడేమో ఎక్కడున్నాడో తెలియదు. ఎక్కడ దాక్కున్నాడో తెలియదు. నీ తండ్రి జైల్లో ఉంటే.. నీవు కూడా ఈ స్కాముల్లో పాత్రధారుడివి కాబట్టి, ఢిల్లీలో నక్కావా..?

తండ్రి జైల్లో ఉంటే.. బాలకృష్ణతో కలిసి లోకేష్ పార్టీని లాక్కోవాలని చూస్తున్నట్టు ఉన్నారు. ఎన్టీఆర్ గారికి చంద్రబాబు పొడిచిన వెన్నుపోటే.. రివర్స్లో ఆయనను పొడిచేందుకు మామ, అల్లుళ్ళు బాలకృష్ణ, లోకేష్లు రెడీ అయినట్టు ఉన్నారు. అందుకే, జైల్లో ఉన్న తండ్రిని పట్టించుకోకుండా, సీక్రెట్‌గా వీళ్ళు మాస్టర్ ప్లాన్లు వేస్తున్నారు. బాలకృష్ణ చంద్రబాబు కుర్చీలో కూర్చున్నాడు. అసెంబ్లీలో ఆయన కుర్చీపైకి ఎక్కి నిల్చొన్నాడు. ఎన్టీఆర్ ఆత్మ శాంతించాలంటే.. చంద్రబాబుకు తగిన శాస్తి జరగాల్సిందే' అంటూ చెబుతూ వచ్చారు.

బాలకృష్ణ తొడకొడితే బిల్డింగ్ కూలుతుందేమో అని భయపడ్డాం!

'బాలకృష్ణ మొన్న స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్ళి మీసం మెలేసి, తొడగొట్టాడు. దాంతో చంద్రబాబు దోపిడీ చేసి, నిర్మించిన టెంపరరీ అసెంబ్లీ బిల్డింగ్‌లు ఎక్కడ కూలిపోతాయోనని మేమంతా భయపడ్డాను. ఎందుకంటే ఆయన సినిమాల్లో ఒంటి చేత్తో పది, ఇరవై లారీలను ఎత్తేస్తాడు. ఆయన తొడకొడితే భూమి బద్ధలైపోతుంది. అందుకే, యనమల నోరు తెరవట్లేదు?

చంద్రబాబు హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన యనమల రామకృష్ణుడు  ఈ స్కాములు జరగలేదని మీడియా ముందుకు వచ్చి చెప్పాలి కదా.. ఆయన కూడా నోరు తెరవడం లేదు. ఎందుకంటే, బాబు తర్వాత యనమలకే ఈ అవినీతి గురించి బాగా తెలుసు. అవినీతి జరిగిందన్నది యనమలకు తెలుసు.

నాడు అవినీతి.. నేడు నీతి అయిందా పవన్?

'చంద్రబాబు, లోకేష్ అవినీతిపరులు, దుర్మార్గులు, తన తల్లిని తిట్టారు, నియోజకవర్గానికి వెయ్యి కోట్లు చొప్పున అవినీతి చేశారు.. అని మాట్లాడిన పవన్ కల్యాణ్- ఈరోజు ఎందుకు నోరు విప్పడు. ఆరోజు పవన్ కల్యాణ్ మాట్లాడిన అవినీతి కేసులే ఇప్పుడు చంద్రబాబు మెడకు చుట్టుకున్నాయి. అప్పుడు అవినీతి అయినవి.. ఇప్పుడు మీ కళ్ళకు నీతివిగా కనిపిస్తున్నాయా..? దేశానికి ప్రధానిగా చేసిన ఇందిరా గాంధీనే అరెస్టు చేశారు. బాబు ఏమైనా దిగొచ్చాడా..? తప్పు చేస్తే చట్టం ముందు ఎవరైనా ఒకటే.

స్కిల్ స్కాంకు సంబంధించిన నోట్ ఫైళ్ళపై.. చంద్రబాబు 13 సంతకాలు పెట్టాడు. పైగా, బ్యాంకు మేనేజర్ తప్పు చేస్తే..  చైర్మన్కు ఏమిటి సంబంధం అని అవగాహన లేకుండా లోకేష్, టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రిగా తానే స్వయంగా నోట్ ఫైళ్ళ మీద సంతకాలు చేసి, నిధులు విడుదలకు ఒత్తిళ్ళు చేస్తే.. అది తప్పు కాకుండా ఒప్పు అవుతుందా..? చంద్రబాబు తప్పు చేశాడు, సాక్ష్యాలతో సహా చిక్కాడు కాబట్టి.. ఆయన ఏ కోర్టుకు వెళ్ళినా ప్రయోజనం ఉండదు.  ఇప్పటికైనా చంద్రబాబు నోరు విప్పాలి. ఏమి అడిగినా  'తెలియదు, గుర్తులేదు, మరచిపోయాను..' అని ఒకటే సమాధానం చెబుతున్నాడంటూ' మండిపడ్డారు.

భేషుగ్గా జగన్  పరిపాలన!

సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వైపు దేశం యావత్తు చూస్తుంటే.. ఇక, మీకు రాజకీయంగా పుట్టగతులు ఉండవని ప్రభుత్వంపై ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని రోజూ బురద జల్లుతున్నారు.

గత నాలుగేళ్ళ సీఎం జగన్‌ పరిపాలనలో విద్యారంగం మొదలు సచివాలయ వ్యవస్థ.. పారదర్శకమైన పరిపాలన.. సామాజిక న్యాయం.. ప్రతి ఇంటికీ మూడు-నాలుగు సంక్షేమ పథకాలు అందేలా.. గొప్పగా పాలన చేస్తూ,  ఏపీ దేశంలోని మిగతా రాష్ట్రాలకంటే ముందుంది. పేదరికం 11 శాతం నుంచి 6 శాతానికి తగ్గింది. విద్యా, వైద్యం, వ్యవసాయ  రంగాల్లో ముందున్నాం. జగన్ మోహన్ రెడ్డిగారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఇంటికీ మేలు జరుగుతుంటే.. వీళ్ళంతా తట్టుకోలేకపోతున్నారు. అందుకే, ఈ ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారు’ అని మంత్రి కారుమూరి ధ్వజమెత్తారు.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Karumuri Venkata Nageswara Rao
Chandrababu Naidu
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

 బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాల్సిందే : వైఎస్సార్‌సీపీ

బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాల్సిందే : వైఎస్సార్‌సీపీ

పోయేకాలం వస్తే ఇలాంటి కేసులే పెడతారు.. దేశద్రోహం కేసు పెట్టాల్సింది పవన్, బాబు పైనే..?

పోయేకాలం వస్తే ఇలాంటి కేసులే పెడతారు.. దేశద్రోహం కేసు పెట్టాల్సింది పవన్, బాబు పైనే..?

ఏమన్నా ఉంటే కదా..  చెప్పడానికి!

ఏమన్నా ఉంటే కదా.. చెప్పడానికి!

ఓటర్ల జాబితా సవరణ..

ఓటర్ల జాబితా సవరణ..

పవన్‌ కల్యాణ్‌పై అంబటి సంచలన వ్యాఖ్యలు..

పవన్‌ కల్యాణ్‌పై అంబటి సంచలన వ్యాఖ్యలు..

చంద్రబాబు ప్రేమ ముమ్మాటికీ బూటకం... రైతులకు చంద్రబాబు చేసిన మోసాలపై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం

చంద్రబాబు ప్రేమ ముమ్మాటికీ బూటకం... రైతులకు చంద్రబాబు చేసిన మోసాలపై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.